Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. కబురులేవియు నింపవు కడుపు నచుఁ
గదలిపోవలె జనులు లో కానఁగాంచఁ
గరగిపోయెడి కాలానఁ గబురులేలఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: కబుర్లు కడుపు నింపవన్న సత్యాన్ని గ్రహించి ఈ లోకంలోని జనులంతా కార్యార్థులై చకచకా కదలిపోతుండాలి. కాలం అనేది క్రొవ్వొత్తిలా కరిగిపోతుంది. అలా కరిగిపోయేకాలాన్ని కాస్తాఅనవసరమైన కబుర్లతో వృథాగా గడిపేయరాదని కర్మసాక్షివైన ఓసూర్యనారాయణమూర్తీ నీవైనా బోధించుము స్వామి.
తే.గీ. పేదలకు ఁ బెట్టఁ బ్రాణమ్ము వెలికిఁ బోదు
దానధర్మాలు చేసినఁ దరలిపోదు
సేవఁ జేసిన దేహమ్ము శిథిలమవదు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: పేదలకు పట్టెడన్నం పెట్టినంత మాత్రాన ప్రాణం పైకిపోదు. దాన ధర్మాలు చేసినంత మాత్రాన సంపద అంతా తరలిపోదు. అలాగే మానవసేవ చేసినంత మాత్రాన దేహం శిథిలమై పోదనీ, ఇంకా నూతనోత్తేజం తేజరిల్లుతుందని కూడా ఈ లోకానికి కర్మసాక్షివైన ఓ సూర్యభగవానుడా నీవైనా ప్రబోధించుము స్వామీ.

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262