Others

అంతరార్థమిది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనస్సును, బుద్ధిని నియంత్రించి కామాన్ని జయించాలి. కామ శత్రు విజయమే కైవల్యం. ఆత్మానందం పొందటమేగమ్యం. కైలాసం పోనవసరం లేకుండా ఆ ఆనంద చిన్మయ స్థితిని అనుభవించవచ్చు ఇక్కడే.
మాఘ బహుళ చతుర్థశి శివరాత్రి పేర ప్రసిద్ధం. పౌరాణికంగా, ఆధ్యాత్మికంగా, శివరాత్రికి ప్రత్యేకమైన గుర్తింపున్నది. సాధారణంగా ప్రతి పండుగకు ఒక తిథి , ఒక దేవతల అంటూ చెప్పుకుంటాం. ఉదాహరణకు శ్రీరాముడి జన్మదినాన్ని శ్రీరామనవమి అని, గణపతి ఉత్సవాన్ని వినాయక చవితి అని, కృష్ణుడు పుట్టిన రోజును కృష్ణాష్టమి అని అంటున్నాం. కానీ శివుడికి సంబంధించిన బహుళ చతుర్థశిని శివచతుర్థశి అన్నపేరు ఎందుకు పెట్టలేదు? అందుకు ఏదో ప్రత్యేకమైన కారణం ఉందా అని ఆలోచిస్తే-
శివరాత్రి, దేవ, ఋషి, మానవ, దానవ గణాలు భక్తితో జరుపుకునే ఒక పవిత్రమైన సమయం. శివస్వరూప జ్ఞానం వ్యావహారికంగానో, ఆషామాషీగానో సాధించటానికి వీలుపడదు. ఇంద్రియాలకు అతీతంగా జ్ఞానాన్ని పొందటానికి అనుకూలమైన సమయం రాత్రి. జిజ్ఞాసువుకు మొదట శివోపాసన , తద్వారా శివజ్ఞానం పొందవలెనని ఉపనిషత్తులు చెబుతున్నాయి.జ్ఞానసముపార్జన తైలధార వంటి ఏకాగ్రబుద్ధికి మాత్రమే అది సాధ్యం.
పౌరాణికంగా పరమశివుడు ఈనాడు హాలాహలం స్వీకరించి గరళకంఠంలో బాధపడుతుండటం వల్ల భక్తులు ఉపవాస, జాగరణలు ద్వారా తమ సానుభూతిని తెలియజేయడానికి సంకేతం శివరాత్రి. తాత్త్వికంగా, యోగీశ్వరుడైన శివారాధనకు తగిన సమయం రాత్రి. భగవద్గీతలో రెండో అధ్యాయం 71వ శ్లోకంలో ఏది భోగులకు రాత్రో , అది యోగులకు పగలు, ఏది వారికి పగలో, అది వీరికి రాత్రి అన్నారు. శివజ్ఞానం వ్యవహారానికే కాదు భౌతికావసరాలకు అతీతమైన ఒక నిరంతరం ధ్యాన ప్రవాహం! దీనినే కార్మిక శివరాత్రి అంటారు. వేదోక్త శాస్త్రోక్త కర్మలే నిజమైన కర్మలు.
జీవిత పరమార్థం పరమాత్మ తత్త్వాన్ని తెలుసుకుని, శరణాగతి పొందటమే. ప్రతినిముషం మనసా, వాచా, కర్మణా, యోగసాధన ద్వారా పరమగమ్యం చేరుకోవాలి. ఏ పని చేసినా అంకిత భావంతో ఆత్మార్పణతో నిష్కా3మంగా అదే యోగం అవుతుంది. అందుకే, జీవితమే ఒక యోగం. అంటారు శ్రీ అరవిందులు.
కాలగతిలో మంచి, చెడు రెండూ అంతర్లీనంగా ఉంటాయి. అందులో మంచిని పెంచే అవకాశం ఉన్న రోజులను శుభదినాలని ఆ రోజుల్లో చేసే పనులు మంచి ఫలితాలు ఇస్తాయని, మనలో ఒక నమ్మకం పాదుకుని ఉన్నది. వాటిని పర్వదినాలుగా గుర్తించి సంబురాలు జరుపుకోవడంమన ఆచారం. విశ్వచైతన్యం. సత్యత్వం వైపు సాగుతన్నప్పుడు వ్యక్తిచైతన్యపు ఆధ్యాత్మిక పురోగమనానికి భౌతిక శక్తులు సహకరిస్తాయి. సాధకుడు అలాంటి సదవకాశం ఉపయోగించుకుని , ప్రగతి నిరోధక శక్తుల్ని జయించి, వేగంగా పురోగమించవచ్చు. అందుకు శివరాత్రి ఒక మహత్తరమైన అవకాశం. లోకోత్తరమైన కార్య సాధనకు శివరాత్రి చక్కని ఉదాహరణ క్షీర సాగర మధనంలో అమృతం దేవతాశక్తులను వివరించేలా లోక కల్యాణం. జరిపించిన ఘనత శివదేవుడికే చెల్లుతుంది. అందుకే శివరాత్రిని శుభరాత్రి అని చెబుతూ ఉంటారు. శుభాలను పొందడానికి వీలైన రోజుగా చెబుతుంటారు.
పరతత్వం రెండు విధాలుగా అందుబాటులో ఉంటుంది. సగుణరూపంలో నిర్గుణ రూపంలో దాన్ని మనం పొందవచ్చు. పరమాత్మ తత్త్వం సులభంగా తెలుసుకొవడానికి సగుణో పాసన ప్రథమ సోపానం, అవతారాలన్నీ సాకారమైన సగుణ రూపాలే. దుష్టశక్తుల్ని దునిమి, ధర్మాన్ని కాపాడటానికి ఆ భగవంతుడు దిగిరాక తప్పదు. ఈ ప్రత్యక్ష దర్శనం ఒక ఎత్తు. పరోక్షంగా వాటిని అరికట్టటం మరో ఎత్తు. పెరుగుతున్న పాపాన్ని ధర్మానికి జరుగుతున్నహానిని, అరికట్టటానికి అకాల వర్షాలు వంటి అనుకోని సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. భూభారం తగ్గటానికి ఊహించిన కరోనాలు, ఎదురుచూడని సునామీలు. అగ్ని ప్రమాదాలు, భూప్రకంపనలు. విస్ఫోటనాలు ఆకస్మిక ప్రమాదాలు మనసున దాడి చేస్తాయి. ఇదే కలికాలపు కల్కి కరవాలపు దృశ్య హస్తంగా చెప్పుకుంటాం. సదాశివుడు జ్ఞాన వైరాగ్యాల ప్రతిరూపం. ధ్యానముద్రలో అర్థనిమీలిత నేత్రుడై మార్గదర్శనం చేయిస్తాడు యోగ సాధకులందరికి.
ఉత్తర భారతంలో శివరాత్రిని ఒక కల్యాణోత్సవంగా జరుపుకుంటారు. శివశక్తుల కలయికే అర్థ నారీశ్వర తత్త్వార్థం. పురుష ప్రకృతుల అపూర్వ సంగమానికి సజీవ ప్రతీక. సత్య సాక్షాత్కారానికి సృష్టి, దృష్టి రెండూ అవసరమే. పదార్థంలో యథార్థం చూడటం అంటే, భిన్నత్వంలో ఏకత్వం సాధించటమే! పరిమితమైన భావనే మనం పరిమితులమై పుట్టటానికి కారణం. పరిమితత్త్వం నుంచి అపరిమితత్వాన్ని సాధించడాని యోగమార్గమే శ్రేయోమార్గం.
నిత్య జీవితంలో మనం శివరాత్రిని మూడురకాలుగా ఆచరణలో పెట్టవచ్చు. నిరంతరంగా కార్మిక శివరాత్రి అమలు చేయటం ఒకటి. మాసానికి కనీసం ఒక రోజు శివరాత్రిని పాటించటం రెండు. ఆ రెండూ చేయలేని పరిస్థితుల్లో మాఘ బహుళ చతుర్దవి నాడు యోగసాధన చేయడం ఒక్కటే మార్గం. జ్ఞాన వైరాగ్యాలకు శివుడు కాణాచి. అందుకే శివరాత్రి నాడు ఉపవశించి, జాగరణ పాటించడం అనుచానంగా వస్తున్న ఆచారం. చిత్త శుద్ధితో శివరాత్రినాడు శివారాధన చేయటం వల్ల పాప విక్షేప ఆవరణలు తొలిగిపోయి జీవితం ధన్యం అవుతుందని శ్రుతి చెబుతున్నది. ఇంద్రియ వ్యాపారాలు శూన్యం కావటానికి వ్యాపార శూన్యమైన రాత్రిపూటే చక్కని అవకాశం. అన్ని అనుభవాలు సుషుప్తిలో నిద్రాణమవుతాయి. ప్రజ్ఞను మేలుకొలిపి శివజ్ఞానం పొందటానికి శివరాత్రిని మించిన ఉపాయం మరేమీ లేదు.
నమశ్శివాభ్యా అతిసుందరాభ్యాం అనంత కల్యాణ
గుణాస్పదాభ్యాం, అజాది బృందారక వందితాభ్యాం
నమో నమోస్తే శివపాదుకాభ్యాం.

- నిరామయ