Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. అర్ఘ్య మిచ్చినవారికి నభయమిడుచు
నమ్మి కొలచినవారికి సొమ్ములిడుచు
వాడవో భాస్కరా! రవీ!పాహి! పాహి!
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: అర్ఘ్య ప్రదానం చేసినవారికి అభయమిస్తూ, నిన్ను నమ్మి కొలిచేవారి కి సకల సంపత్తులిస్తూ నిన్ను మదిలో తలచినవారికి అండగా, రక్షణగా నిలిచే ఓ సూర్యదేవా! పాహిమాం! పాహిమాం!

తే.గీ. గుండె పొరలందు గూడల్లు కొనగవలయు
నింపుసొంపగు భావాలు నిత్యమవియు
జగతిఁ బారంగవలయు నాశ్చర్యమొప్పఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: మనోహరమైన సుమధుర భావాలు గుండెపొరల్లో గూడల్లుకుపోవాలి. ఆ భావాలు అనునిత్యం అత్యంత ఆశ్చర్యజనకంగా లోకమంతా ప్రవహిస్తూ ఉండాలి. అదే జీవన సార్థక్యమని కర్మసాక్షివైన ఓ సూర్యనారాయణమూర్తీ ఈలోకానికి తెలియ జేయమయ్యా ప్రభూ!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262