Others

మహోదాత్త శక్తి .. మహాత్రిపురసుందరీదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిరాకారము, నిశ్చలము అయినది- శివతత్త్వం. శివుణ్ణి ఆశ్రయించి అనుసరించి ఉంటుంది ‘శక్తి’. ఇదే శివ శక్తిసామరస్యం. శివతత్త్వాన్ని నామరూపాత్మకంగా మార్చి దర్శింపజేస్తోంది అదిశక్తి. చరాచర విశ్వమంతా ఆదిశక్తి విభూతి.
నామరూపాత్మకమది విభూతి. చెప్పేది నామం, చెప్పబడేది రూపం. నామం- భావప్రపంచం అయితే, రూపం వస్తు ప్రపంచం. ఈ రెండింటి నడుమ నడిచేదంతా క్రియారూపం. నామ, రూప, క్రియలనే మూడూ ‘త్రిపురములు’. త్రిపురముల సృష్టికర్త్రి అయి, వాటిలో ఆనందమయంగా విహరించే మహోదాత్తశక్తి ‘లలితా త్రిపురసుందరి’.. జగన్మాత ప్రాభవాన్ని, ప్రాదుర్భావాన్ని చెప్పి, హయగ్రీవుడు అగస్త్య మహర్షి కోరికపై లలితా నామాలను చెప్పాడు. అదే లలితా సహస్రం.
ఆనామాలనే మహర్షి రహస్య నామ సహస్రం అన్నాడు. దేవీ ఖడ్గమాలాస్తోత్రంలో కూడా ‘రహస్య యోగిని, పరాపర రహస్య యోగిని..’ అని చెప్పబడింది. అంటే, ప్రతి ఒక్క నామాన్ని భక్తితో భావన చేస్తూ నామ సంకీర్తనం చేస్తే తల్లి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. రహస్యం తెలియకపోయినా, లలితాంబను ప్రతి పదంలో భావిస్తూ నామపారాయణ చేస్తే సంతుష్టురాలై మనసిక ప్రశాంతతను ప్రసాదిస్తుంది.మన శరీరమే ఒక శ్రీచక్రం. శ్రీచక్రమునందు తొమ్మిది ఆవరణలు ఉంటాయి. ఈ తొమ్మిది ఆవరణలు, మన శరీరంలోని తొమ్మిది ద్వారాలకు సంకేతం. మానవ శరీరంలో షట్చక్ర సందర్శనంతో సకల దేవతలు ఒకే తత్త్వానికి చెందినవారని అర్థమవుతుంది. మూలాధారంలో నిద్రాణంగా ఉన్న కుండలిని మేల్కొలిపి, సహస్రారానికి చేరుస్తే, అమృతధారలు వర్షిస్తాయి. నశించే స్వభావం కల్గిన శరీరం నశించినా, నశించని అమృత తత్త్వాన్ని దర్శింపజేస్తుంది కుండలినీ యోగ శక్తి. అదే ‘ఆత్మవిద్య’. ఆత్మవిద్యను ప్రసాదించే మహోదాత్త శక్తి- శ్రీ లలితా త్రిపురసుందరి.

- శ్రీ