Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ స్వార్థ విద్రోహ చర్యలం బడుచు నైతి
కత్వమును వీడిపోయెడు కర్మఠులకుఁ
గనులఁ దెరిపించుమో దేవ! కలియుగానఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: ఈ కలియుగంలో స్వార్థవిద్రోహ చర్యలకు పూనుకుంటూ నైతికత్వాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. అటువంటి కఠినాత్ముల కన్నులు తెరిపించేవాడవు నీవేనయ్యా! కర్మసాక్షివైన ఓ సూర్యదేవా!
తే.గీ ఆత్మనడిగిన వాస్తవమదియుఁ జెప్ప
ననవరతమీవు నీయాత్మనడుగవలయు
నాత్మసాక్షిని మించినదవనిఁ గలద?
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: మనం చేసే కర్మలు సత్కర్మలా? దుష్కర్మలా? అనేది మన ఆత్మనడిగితే అది వాస్తవాన్ని చెప్పేస్తుంది. ఆత్మసాక్షిని మించిన సాక్ష్యం ఈ భూమీద మరెక్కడా ఉండదు. అందుకే ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవాలని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా ఈ లోకానికి తెలియజేయుమయ్యా ప్రభూ!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262