Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ పాపమని యెంచఁబోక నపారముగనుఁ
బాపకృత్యాలకొడిగట్టి పాప పంకి
లాన బొర్లాడి విడువంకఁ బ్రాణములనుఁ
బిదప నరకానఁబడుదురే! యెదఁ దలంపఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: పాపభీతి అనేది లేకుండా అంతులేని పాపకృత్యాలకు పాల్పడి పాపమనే బురదలో ఎంతగానో పొర్లాడి ప్రాణాలను విడిచిపెట్టేస్తే ఆ తర్వాత వారు నరకానపడి యాతనలు పడాల్సి వస్తుందని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి ప్రబోధించు స్వామీ!
తే.గీ పుణ్యకార్యంబులంజేయఁ బొంగిపొరలు
గాద! సిరిసంపదలు సూడఁ గాలమందుఁ
గష్టములు వోయి సుఖములు గదలివచ్చుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: పుణ్యకార్యాలు ఆచరించడంవల్ల మన వద్ద సిరిసంపదలు పొంగిపొరలుతాయి. రానున్న కాలంలో కష్టాలనేవి వాటంతట అవే తొలగిపోయి సుఖాలు కదలివస్తాయని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి ప్రబోధించు తండ్రీ!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262