Others

చరిత్రను తిరగరాయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్ఫూర్తిగా నిలవాలి
120 కోట్ల పైచిలుకు గల జనాభాలో.. కొందరు మాత్రమే సింధు, సాక్షిమాలిక్, పూర్ణ, నర్సమ్లలు.. దేశ ప్రతిష్ఠను నిలబెట్టారు. లక్ష్యాన్ని సాధించే క్రమంలో వారు పడిన శ్రమ మనకు శిరోధార్యం కావాలి. సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు లక్ష్య సాధనలో అడ్డంకిగా మారినప్పటికీ లక్ష్యాన్ని సులభంగా సాధించినవారు ఎందరో వున్నారు.
ఒక దేశంలోని పక్షులు తమ ప్రాంతంలో మనుగడ సాధించలేని వాతావరణ పరిస్థితులు వుంటే అవి త్రాగడానికి నీటికోసం కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. జీవితాన్ని కొనసాగించడంపై వాటికే అంత తెలివితేటలు ఉంటే ప్రపంచాన్ని శాసించే స్థాయిగల అధిక మేధస్సు వున్న మనుషులు మాత్రం నిరాశ నిస్పృహలకు లోనవుతూ తమ జీవితాన్ని భూమికి భారంగా వెళ్లదీసే వారెందరో వున్నారు. జీవన పోరాటంలో విజయాలు, వైఫల్యాలు సహజం. వైఫల్యాలనుండి కూడా నేర్చుకుని లక్ష్యాన్ని సాధించిన అరుణిమా సిన్హా, రైలు ప్రమాదంలో పూర్తిగా ఛిద్రమైన శరీరం, ఒంటికాలుతో కేవలం రెండు సంవత్సరాలలో ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో సాధన చేసి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన భారత మహిళయే ఆదర్శం. ఆటంకాలెన్ని ఎదురైనా నిన్నటికి నిన్న ఇస్రోలో రికార్డు స్థాయి ప్రయోగంలో కీలక పాత్ర పోషించిన మహిళా శాస్తవ్రేత్తలే నిదర్శనం. ఒలిపింక్స్‌లో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచిన సింధూయే సాక్ష్యం. దేశంలో అతి పెద్ద బ్యాంకు ఎస్‌బిఐకి సారథ్యం వహిస్తున్న అరుంధతీ భట్టాచార్య, బహుళజాతి సంస్థ పెప్సి సీఈఓ ఇంద్రానూయిల చెదరని స్ఫూర్తి. ఆ స్ఫూర్తి కిరణాలకు.. ఆ స్ర్తిమూర్తులకు వందనం.
వృత్తి, పిల్లల పెంపకం సమర్థవంతం
వృత్తిని, పిల్లల పెంపకాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న మహిళామూర్తులకు అభివందనం. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటోతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వృత్తిపట్ల అమితమైన నిబద్దత కలిగిన 30 సంవత్సరాల అర్చన ఝాన్సీ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో రిసెప్షనిస్ట్ పోలీసు కానిస్టేబుల్‌గా ఆరు నెలల పసికందుతో విధి నిర్వహణలో పాల్గొన్న ఫొటోతో చాలామంది ఉద్యోగులలో మార్పు వచ్చింది అని ఉత్తరప్రదేశ్ డిజిపి ఓంప్రకాశ్, విధి నిర్వహణపట్ల అర్చన నిబద్ధతను ప్రశంసిస్తూ క్యాష్ రివార్డుతో అభినందించారు. లారా దత్తా లాంటి మిస్ యూనివర్స్ లాంటి ప్రముఖ వ్యక్తులు కూడా ఒక ఛాలెంజింగ్ తీసుకుంటూ ద్విపాత్ర పోషిస్తూ వృత్లితోనూ, పిల్లల పెంపకంలోనూ రాణిస్తున్న మహిళా మూర్తులు ఎందరో ఉన్నారు.
గర్భం దాల్చిన ప్రతి క్షణం నుండి ఎన్నో బాధలను ఓర్చుకుంటూ, కుటుంబ పరంగా, వృత్తిపరంగా ఎన్నో సమస్యలు ఎదురైనప్పటికీ చిరునవ్వుతో, ఆత్మవిశ్వాసంతో పరిష్కరించుకుంటూ బాధలను కష్టాలను తన గొంతులోనే దిగమింగుతూ నవమాసాలు మోసి జన్మనిచ్చి మరో జన్మనెత్తిన ఆ మాతృమూర్తికి వృత్తిరీత్యా ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడితే.. తల్లి చనుబాలతో పెరగాల్సిన ఆ పసికందుపై వున్న ప్రేమానురాగాలతో గడపాల్సిన ఆ మాతృమూర్తి ప్రసవానంతరం వృత్తిలో చేరడం ఎంత క్లిష్టమైన సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందో మనందరికీ అర్థమవుతోంది.
మహిళ లేని రంగమేది
నేటి మహిళ చరిత్ర సృష్టిస్తోంది. పరిపాలక అధికారులుగా, రక్షకభటులుగా, సైనికులుగా, క్రీడాకారులుగా, కళాకారులుగా, శాస్తవ్రేత్తలుగా, పరిశోధకులుగా, అంతరిక్ష యాత్రికులుగా, అధ్యాపకులుగా, సాఫ్ట్‌వేర్ వంటి సేవా రంగాల ఉద్యోగులుగా, ప్రజాప్రతినిధులుగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. నేడు మహిళ లేని రంగం లేదంటే అతిశయోక్తి కాదు.
స్ర్తిలు పూజింపబడాలి
భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల్లో మాతృమూర్తిని పూజించే విశిష్టమైన లక్షణం కనిపిస్తోంది. అయితే మార్పు అనుకున్నంతగా సాగకపోవడంతో మహిళాలోకానికి చీకటి తెరలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. అసమానత, అణచివేత, దోపిడీ వంటి వాటిని రూపుమాపినపుడే మహిళలు అన్ని రంగాల్లో మరింత ముందడుగు వేసేందుకు వీలుంటుంది.

-డా.అట్ల శ్రీనివాస్‌రెడ్డి