Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ అచ్యుతానంద గోవిందయనెడి మంత్ర
మెల్లవేళల జపియింపుమెట్టి యంటు
రోగములు దరిఁజేరవేరోజునైనఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: అచ్యుతానంద గోవింద అనే నామత్రయ మహామంత్రాన్ని ఎల్లప్పుడూ జపిస్తూంటే కరోనా వంటి భయంకరమైన అంటురోగాలు కూడ ఏరోజూ మన దరికి చేరవనే సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యనారాయణ మూర్తీ! ఈ లోకానికి తెలియజేయుమయ్యా ప్రభూ!

తే.గీ చెంతకుంజేరఁ బోవెట్టి చీకుచింత
లాత్మలో భగవన్నామమదియె పనిగఁ
జక్కగా జపియించినఁ జిక్కులెన్ని
యున్ననవియుఁ దొలగిపోవునూతమదియె
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: ఆత్మలో భగవన్నామాన్ని అదేపనిగా జపించడం వల్ల ఎలాంటి చీకూ చింతా లేని ప్రశాంతత మనకు లభిస్తుంది. చిక్కులన్నీ వాటంతటవే తొలగిపోతాయి. సర్వజనులకూ భగవన్నామమే ఊతమన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి ప్రబోధించు స్వామీ!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262