ప్రకాశం

జిల్లాను కరవుజిల్లాగా ప్రకటించి ప్రత్యేక ప్యాకేజి ఇచ్చి ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఫిబ్రవరి 17: ప్రకాశం జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించి రైతులు, కూలీలకు ప్రత్యేక ప్యాకేజి ఇచ్చి ఆదుకోవాలని సీపీఎం తూర్పు ప్రకాశం జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సీపీఎం తూర్పు జిల్లా కమిటీ సమావేశం శనివారం స్థానిక సుందరయ్య భవన్‌లో జరిగింది. సీపీఎం తూర్పుప్రకాశం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జాలా అంజయ్య అధ్యక్షతన జరిగిన సమావేశం నిర్ణయాలను సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు పాత్రికేయులకు తెలిపారు. ఈ సంవత్సరం జిల్లాలో 30 శాతం లోటు వర్షపాతం నమోదైందన్నారు. ఈ సంవత్సరం రబీ, ఖరీప్ సీజన్‌లో వేసిన పైర్లు వర్షపాతం లోటుతో ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయినట్లు ఆయన తెలిపారు. రైతులు పెట్టిన పెట్టుబడులు అధికంగా ఉన్నప్పటికీ పంట దిగుబడి మాత్రం సరిగారాలేదని చెప్పారు. శనగ, మిర్చి, కంది, మినుము, ప్రత్తిపంటల దిగుబడి బాగా తగ్గిందని ఆయన చెప్పారు. ఇదే సమయంలో మార్కెట్‌లో కూడా ధరలు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం సగానికి సగం తగ్గిపోయినట్లు ఆయన తెలిపారు. దీనిమీద ఆదారపడ్డ రైతులు, కూలీలు తీవ్రంగా నష్టపోయినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో గతం కంటే వలసలు బాగా పెరిగాయని, వరసగా నాలుగువ సంవత్సరం కూడా జిల్లాలో కరవు కొనసాగుతుందన్నారు. కరువు సహాయక చర్యలు మాత్రం నామమాత్రంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి జిల్లాకు ప్రత్యేక ప్యాకేజిని ప్రకటించాలని సీపీఎం డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. టీడీపీ పోర్టు సాధనపై వెంటనే ప్రకటన చేయకపోతే పోర్టు సాధనకోసం జరుగుతున్న ఉద్యమం మరింత ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఎం తూర్పు జిల్లా కార్యవర్గ సభ్యులు జీవీ కొండారెడ్డి, పెంట్యాల హనుమంతరావు, చీకటి శ్రీనివాసరావు, ఎస్‌కె మాబు, కంకణాల ఆంజనేయులు, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు తెలిపారు.

బతికి ఉన్నానని రుజువుకోసం వచ్చి
తనువు చాలించిన వృద్ధురాలు
యర్రగొండపాలెం, ఫిబ్రవరి 17: తాను బతికి ఉన్నానని రుజువు చేసుకునేందుకు స్థానిక ట్రెజరీ కార్యాలయంలో బయోమెట్రిక్ విధానంలో వేలిముద్ర వేసేందుకు వచ్చి ఓ వృద్ధురాలు మరణించిన సంఘటన శనివారం పట్టణంలోని ట్రెజరీ కార్యాలయంలో జరిగింది. పట్టణానికి చెందిన కొండెబోయిన మరియమ్మ (70) భర్త పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తూ మరణించడంతో ప్రతినెలా సర్వీసు పెన్షన్ తీసుకుంటూ జీవనం కొనసాగించేది. ప్రభుత్వ నిబంధనల మేరకు పెన్షన్‌దారులు లైఫ్ సర్ట్ఫికెట్ ట్రెజరీ కార్యాలయంలో ఇవ్వవలసి ఉంది. ఈ సంవత్సరం నూతనంగా ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానం ద్వారా పెన్షన్‌దారులు తప్పనిసరిగా ట్రెజరీ కార్యాలయానికి వచ్చి వేలిముద్ర వేయాలని, లేనిపక్షంలో పెన్షన్ నిలిపివేస్తారని తెలియడంతో నడవలేని స్థితిలో సైతం వేలిముద్ర వేసేందుకు శనివారం ఉదయం ట్రెజరీ కార్యాలయానికి చేరుకుంది. కార్యాలయంలో ఆన్‌లైన్ సర్వర్ పనిచేయకపోవడంతో దాదాపు చాలాసేపు నిరీక్షించి వేలిముద్రలు వేసిన మరుక్షణమే కుప్పకూలిపోయింది. వెంటనే ట్రెజరీ కార్యాలయ సిబ్బంది స్థానిక ప్రైవేటు వైద్యశాలకు తరలించగా ఆమె మృతిచెందినట్లుగా నిర్ధారించారు.
పైవార్తకు కలర్ ఫోటో పంపుతున్నాము.
17యమ్‌ఆర్‌కె 6: వేలిముద్ర వేయడానికి వచ్చి మృతిచెందిన మరియమ్మ

చీరాల వైకాపా అభ్యర్థి రేసులో కొండయ్య
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు,్ఫబ్రవరి 17: చీరాల వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి రేసులో ఎంఎం కొండయ్య ఉన్నట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం. ఆమేరకు త్వరలోనే ఆయన పేరును అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈపాటికే రాష్టప్రార్టీతో ఆయన మంతనాలు సాగించినట్లు సమాచారం. ఈనేపధ్యంలో ఆయన పేరును త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తొంది. గతంలో తెలుగుదేశంపార్టీ తరుపున ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గానికి పోటీచేసి ఒటమి పాలయ్యారు. అప్పటినుండి రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన పేరు ఒక్కసారిగా తెరపైకి వచ్చింది.
ఇదిలా ఉండగా కందుకూరు నియోజకవర్గంలో జగన్ చేపట్టిన పాదయాత్ర సందర్భంగాను ఎంఎం కొండయ్య ఫ్లెక్సీలు వెలిశాయి. ఈనేపధ్యంలో ఆయనకు టిక్కెట్ దక్కే అవకాశాలున్నాయని రాజకీయంగా చర్చనీయాంశమైంది. కాగా జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వాటిలో కొండెపి, సంతనూతలపాడు, యర్రగొండపాలెం నియోజకవర్గాలు ఎస్‌సి రిజర్వుడు కాగా మిగిలిన తొమ్మిది నియోజకవర్గాలు జనరల్‌కేటగిరి కోటాలో ఉన్నాయి. బిసి తరపున కనిగిరి నియోజకవర్గం నుండి పార్టీ తరపున బుర్రా మధుసూదన్‌యాదవ్ పోటీచేసి ఓటమిపాలయ్యారు. మళ్లీ ఆయనే కనిగిరి నియోజకవర్గంనుండి పోటీచేసే అవకాశాలున్నాయి. చీరాల నియోజకవర్గం నుండి ఎంఎం కొండయ్యకు అవకాశం కల్పిస్తే జిల్లానుండి బీసీలకు రెండు అసెంబ్లీ స్థానాలు పార్టీపరంగా ఇచ్చినట్లు అవుతుంది. మొత్తంమీద వైసిపి తరపున బీసీ వర్గానికి చెందిన ఇద్దరు అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

నవరత్నాలతో పేదల కష్టాలు తీరుస్తా
* వైకాపా అధినేత జగన్ హామీ
* జగన్‌కు అడుగడుగునా జన నీరాజనం
* దారిపొడవునా తమ సమస్యలను చెప్పుకున్న జనం
* మనందరి ప్రభుత్వం రాగానే అందరినీ ఆదుకుంటా : జగన్
వలేటివారిపాలెం, ఫిబ్రవరి 17 : నవరత్నాల పథకంతో రాష్ట్రంలో ఉన్న పేదలందరి కష్టాలను తీర్చి ఆదుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని బంగారక్కపాలెం అడ్డరోడ్డు నుండి ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించారు. ఈ యాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికి జగన్ నాయకత్వం వర్ధిల్లాలి, కాబోయే సిఎం జగన్ అంటూ నినాదాలు చేస్తూ జగన్‌కు తోడుగా పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు హారతులు ఇచ్చి జగన్‌కు స్వాగతం పలకగా, జగన్ వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ మన ప్రభుత్వం రావాలని దేవుడికి రెండు టెంకాయలు కొట్టాలని, ప్రార్థనలు చేయాలని జగన్ కోరారు. కొంతమంది చిన్నారులను తీసుకొచ్చిన మహిళలను ఉద్దేశించి చిన్నారులను చదివించాలని, ప్రతి ఒక్కరికీ ఏడాదికి 15 వేల రూపాయలు ఇస్తానని, ఉన్నత చదువులు సైతం ఉచితంగా చదివిస్తానని, మీరు ఎవరినీ ఏమీ అడగక్కర్లేదని జగన్ వారికి భరోసా ఇచ్చారు. అలాగే వలేటివారిపాలెంలో పొగాకు రైతులతో జగన్ మాట్లాడుతూ పొగాకు బ్యారన్ కడితే ఎంత ఖర్చు అవుతుందని అడగ్గా కట్టా హనుమంతరావు అనే రైతు సుమారు రూ. 4 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. 5 నుంచి 6 ఎకరాలకు మాత్రమే బ్యారన్‌కు అనుమతి ఇచ్చారని, కేవలం 35 క్వింటాళ్ల ఉత్పత్తి మాత్రమే వస్తుందని తెలిపారు. ఎకరాకు ఖర్చు కౌలు రైతులకు లక్ష రూపాయలు, సొంత పొలం ఉంటే రూ. 70 వేలు ఖర్చు అవుతుందని రైతులు తెలిపారు. సాగు నీటి కొరత తీవ్రంగా ఉందని, మండలంలో సుమారు వర్షాలు పడితేనే పంటలు పండుతాయని, లేని పక్షంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ఇంత కష్టపడి పండిస్తే సరైన గిట్టుబాటు ధర లేక నష్టాలబారిన పడుతున్నామని, కిలో పొగాకు 150 రూపాయలకు కొంటే నష్టాలను తగ్గించవచ్చునని తెలపగా, కేంద్ర అధికారులతో మాట్లాడతానని జగన్ రైతులకు హామీ ఇచ్చారు. స్వచ్ఛందంగా పొగాకు మానేస్తే రూ. 10 లక్షలు ప్రభుత్వం ఇస్తామన్నారని, మేమందరం పొగాకు వదులుకోవడానికి సిద్ధమేనని, ప్రత్యామ్నాయ పంటలకు సాగునీటి సౌకర్యం లేదని తెలిపారు. రైతుల సమస్యలను మన ప్రభుత్వం వస్తే పరిష్కరిస్తానని, తప్పకుండా ఆదుకుంటామని రైతులకు జగన్ భరోసా ఇచ్చారు. వాల్మీకి బోయలను ఎస్టీలలో చేర్చాలని చుండికి చెందిన ఇరపని అంజయ్య జగన్‌కు వినతిపత్రం అందజేశారు. ఒంగోలు డెయిరీకి పాలు పోసినా డబ్బులు ఇవ్వలేదని, తమ సమస్యలను పరిష్కరించాలని నేకునాంపురం గ్రామానికి చెందిన నరసయ్య జగన్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం పోలినేనిపాలెం గ్రామం సమీపంలో జగన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో మహిళలను అన్ని రకాలుగా మోసం చేశారని జగన్ ఆరోపించారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి రూపాయి కూడా మాఫీ చేయలేదని అన్నారు. మన ప్రభుత్వం వస్తుందని, మీరు ఎవరినీ అడగక్కర్లేదని డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలను నాలుగు దఫాలుగా మొత్తం మాఫీ చేస్తానని, మాఫీ మొత్తం నేరుగా అక్కచెల్లెమ్మలకు అందజేస్తానన్నారు. విద్యార్థుల హాస్టల్ ఖర్చు కింద రూ.20 వేలు ఇస్తాం, అవ్వా తాతలకు రూ.2వేలు పింఛను ఇస్తాం, పింఛను వయస్సు 65 ఏళ్ల నుండి 60 ఏళ్లకు తగ్గిస్తాం, ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకు తగ్గిస్తామని చెప్పారు. ఇవన్నీ మన నవ రత్నాల పథకంలో భాగమేనని, వీటన్నింటినీ ప్రజలకు వివరించాలని, దేవుని ఆశీస్సులు, ప్రజల దీవెనలతో మన ప్రభుత్వం వస్తే పేద ప్రజలను ఆదుకుంటామని అన్నారు. వచ్చే ఎన్నికల ముందు చంద్రబాబు మరిన్ని హామీలతో ప్రజలను మోసం చేయడానికి వస్తారని, ప్రజలు మరోసారి మోసపోకుండా వచ్చే ఎన్నికలలో వారికి బుద్ధి చెప్పాలన్నారు. అనంతరం పొగాకు కూలీలు తమకు కూలీ గిట్టుబాటు కావడం లేదని జగన్‌కు బాధలు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన సుమారు 50 మంది లాయర్లు ప్రత్యేక హోదాకు మద్దతుగా జగన్‌ను కలిశారు. ప్రత్యేక హోదా కోసం మన పార్టీ తీవ్రంగా కృషి చేస్తోందని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతామని, లేనిపక్షంలో ఏప్రిల్ 6వ తేదీన మన పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని, ప్రత్యేక హోదాపై మీరు బాగా ఒత్తిడి చేస్తున్నారని, అందుకే మీకు మద్దతు తెలియజేస్తున్నామని మీరు ముఖ్యమంత్రి కావాలని జగన్‌ను వారు కోరారు. మధ్యాహ్నం పోలినేనిపాలెం సమీపంలో కందుకూరు ఇన్‌ఛార్జి తూమాటి మాధవరావు నాయకులకు, కార్యకర్తలకు భోజన వసతి కల్పించారు. ప్రజా సంకల్ప యాత్ర పోకూరు సమీపంలో ముగిసింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఒంగోలు ఎంపి వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసులరెడ్డి, కందుకూరు వైకాపా ఇన్‌చార్జి తూమాటి మాధవరావు, బత్తుల బ్రహ్మానందరెడ్డి, కొండారెడ్డి, రఫీ, గంగిరెడ్డి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా భవానీశంకరుని రథోత్సవం
గిద్దలూరు, ఫిబ్రవరి 17: మండలంలోని ముండ్లపాడు గ్రామంలో వెలసిన శ్రీభవానీశంకరస్వామి తిరునాళ మహోత్సవంలో భాగంగా శుక్రవారం రాత్రి భవానీశంకరస్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. శివకేశవులు ఒక్కరేనని తెలియచేసే ఈ ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఆలయంలో పైభాగంలో నరసింహాస్వామి, కిందిభాగంలో లింగాకారంలో భవానీశంకరస్వామి వెలసి ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత. నారాయణస్వరూపమైన నరసింహాస్వామికి పూజ చేసినట్లైతే భవానీశంకరస్వామికి కూడా ఆ పూజ చెందుతుంది. గతవారంరోజులుగా ఈ ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంతవైభవంగా సాగాయి. శుక్రవారం రాత్రి రథోత్సవంతో ఈ కార్యక్రమం ముగిసింది. ఈ రథోత్సవం శనివారం ఉదయం వరకు సాగింది. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పాల్గొని రథోత్సవాన్ని ప్రారంభించారు. భవానీశంకరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే వెంట మాజీసర్పంచ్ డి విజయభాస్కర్‌రెడ్డి, ఎంపిపి కడప వంశీధరరెడ్డి, మండలపార్టీ అధ్యక్షులు బండి వెంకటస్వామి, సర్పంచ్ శేషగిరి, ఎంపిటిసి పి బాలవెంకటమ్మ, నవీన్, సర్పంచ్‌లు జి లక్ష్మీరెడ్డి, గోపాలకృష్ణ తదితరులు పాల్గొనగా మాజీఎమ్మెల్యే అన్నా రాంబాబు భవానీశంకరస్వామి రథోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆలయంలో భవానీశంకరస్వామికి, నరసింహాస్వామికి అభిషేకాధి కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం స్వామిరథోత్సవంలో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. ఈకార్యక్రమంలో ఆలయ కమిటీ అన్నా రాంబాబును ఘనంగా సత్కరించారు. మాజీఎఎంసి చైర్మన్ కోటా నరసింహులు, ఎన్ చెన్నారెడ్డి, కె శ్రీనివాసులు, మాజీసర్పంచ్ కె వెంకటసుబ్బయ్య, కె సుబ్బారావు, బి మధు, పి వెంకటేశ్వర్లు, జి భాస్కర్, కెవిఎస్ కొండయ్య, పి బాలచెన్నయ్య, మురళీ, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. రథోత్సవం ఆధ్యాంతం వైభవంగా సాగింది.
రాష్ట్రాన్ని చంద్రబాబు భ్రష్టు పట్టిస్తున్నారు
- ఎంపి మేకపాటి
కందుకూరు, ఫిబ్రవరి 17: రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బ్రష్టు పట్టిస్తున్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. ప్రజాసంకల్ప యాత్రలో ఆయన మాట్లాడుతూ జగన్ ఉక్కుమనిషి అని, ప్రత్యేక హోదా కోసం పోరాటాలకు వెనకాడరన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపి వైవి సుబ్బారెడ్డి, వైకాపా జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసులురెడ్డి, కందుకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.