ప్రకాశం

నాగార్జున సాగర్ జలాలను వ్యవసాయానికి వాడుకోకుండా చూడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీమకుర్తి, మే 14: నాగార్జున సాగర్ జలాలు వెళ్తున్న మార్గంలో అప్రమత్తంగా ఉండి ఆ జలాలను వ్యవసాయానికి వాడుకోకుండా చూడాలని రాష్ట్ర అటవీశాఖమంత్రి శిద్దా రాఘవరావు అధికారులను ఆదేశించారు. ఆదివారం సాయంత్రం మంత్రి రామతీర్థం రిజర్వాయరును సందర్శించారు. ఈసందర్భంగా మంత్రి శిద్దా మాట్లాడుతూ రామతీర్థం రిజర్వాయరును సర్వాంగ సుందరంగా తయారుచేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. పల్లెవనం కింద రామతీర్థం గుడివద్ద పర్యావరణ పార్కును 60లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటుచేస్తామన్నారు. రామతీర్థం రిజర్వాయరుకు వచ్చే రహదారిని బిటి రోడ్డుగా నిర్మించేందుకు అతిత్వరలో చర్యలు చేపడ్తామన్నారు. చీమకుర్తి ఎన్‌ఎస్‌పి అతిథిగృహానికి మంజూరైన కోటిరూపాయలతో త్వరలో పనులు ప్రారంభించాలన్నారు. రామతీర్థం రిజర్వాయరులో నీటి నిల్వ తగ్గిన తరువాత కాల్వ గేట్ల మరమ్మతులు చేస్తామన్నారు. రైతుల భాగస్వామ్యంతో పంట సంజీవిని ద్వారా భూగర్భజలాలు పెంపొందించేందుకు కృషిచేయాలన్నారు. రాష్ట్రప్రభుత్వం జలవనరుల శాఖ, రైతులకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తుందన్నారు. ఈపర్యటనల్లో మంత్రి వెంట జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ వీర్రాజు, పర్యవేక్షక ఇంజనీరు శారద, సంతనూతలపాడు మాజీ శాసనసభ్యుడు బిఎన్ విజయకుమార్, పౌరసరఫరాల సంస్ధ డైరెక్టర్ మన్నం శ్రీ్ధర్, చీమకుర్తి నగర పంచాయతీ చైర్మన్ రాఘవ, నీటి వినియోగదారుల సంఘం సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు
* రూ.92వేలు, 8 సెల్‌ఫోన్లు స్వాధీనం
చీరాలటౌన్, మే 14: ఐపిఎల్ సందర్భంగా బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను సిఐ వెంకటేశ్వరరావు ఆదివారం విలేఖర్లకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు పట్టణంలో బెట్టింగ్ జరుగుతుందన్న సమాచారం మేరకు మోహన్ థియేటర్ వద్దనున్న ఓ బార్ అండ్ రెస్టారెంటుపై శనివారం పోలీసులు దాడి చేశారు. అనుమానాస్పదంగా ఉన్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.97వేలు, 8 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్సైలు నాగరాజు, విజయ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.