ప్రకాశం

డీ‘జల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, డిసెంబర్ 12 : కేంద్రంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా డీజిల్ ధరల నియంత్రణలో వైఫల్యం చెంది ప్రజలపై భారం మోపుతున్నారు. ఇటీవల కాలంలో పన్ను తగ్గింపుపేరుతో రెండురూపాయలు తగ్గించి వినియోగదారుల కంటినీరు తుడిచారు. అయితే నిత్య ధరల నియంత్రణల పేరుతో 4.62 పైసలను గుట్టుచప్పుడుకాకుండా పెంచి ప్రజలపై భారం మోపారు. యుపిఎ ప్రభుత్వ హయాంలో క్రూడాయిల్ ధరలు అధికంగా ఉండటంతో అప్పట్లో డీజిల్ ధర పెరిగింది. ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ డీజిల్ ధరలు మాత్రం అప్పటి ధరల కన్నా అధికంగా ఉండటం విశేషం. ప్రస్తుతం డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం 17రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 22 రూపాయలు పన్నుల రూ పంలో వసూలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో కేంద్రప్రభుత్వం రెండు రూపాయలు తగ్గించి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కొంతమేర తగ్గించమని చెప్పినప్పటికీ ఒకటి, రెండు రాష్ట్రాలు మినహా మరెక్కడా ధరలు నియంత్రించిన దాఖలాలు లేవు. యుపిఎ హయాంలో డీజిల్ ధర 64 రూపాయలకు మించకుండా ఉన్నా ఎన్‌డిఎ ప్రభుత్వంలో మంగళవారం ధర 65.66 పైసలుగా, పెట్రోల్ ప్రభుత్వం పన్ను తగ్గించిన సమయంలో 70 రూపాయలు ఉండగా నేడు 75.83 పైసలుగా ధర ఉండటం విశేషం. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోనికి వస్తే ధరలు తగ్గుతాయని అందరూ భావిస్తే ప్రతినిత్యం డీజిల్, పెట్రోల్ ధరలను నియంత్రిస్తామని చెప్పిన కేంద్రప్రభుత్వం నిత్యం 10 నుంచి 15పైసలు పెంచి ప్రజలపై భారం మోపుతుంది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే డీజిల్ ధర పెరుగుదలతో ఆ భారం నిత్యావసర వస్తువులపై పడి పేద, మధ్య తరగతి ప్రజలకు జీవనం కష్టసాధ్యంగా మారింది. అలాగే కూరగాయల ధరలు కూడా ఆకాశానంటాయి. ఇదేమని వ్యాపారులను ప్రశ్నిస్తే తమ తప్పు ఏమి లేదని, రవాణచార్జీల పెరుగుదలతో ధరలు పెరుగుతున్నాయని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు.