ప్రకాశం

రైతుకు లాభాల పూలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతమాగులూరు, డిసెంబర్ 12 : సాగులో మెలకువలు మార్కెట్‌లో లభ్యమయ్యే నూతన వంగడాలు మర్కెట్ పోకడలు గమనించి సాగు చేసుకుంటే పూల సాగుకూడా లాభాల పంటేనని మక్కెనవారిపాలెంకు చెందిన సుబ్బారావు మల్లయ్యలు నిరూపించారు. మక్కెనవారిపాలెంలో ఆ ఇద్దరు రైతులు వారికున్న కొద్దిపాటి పొలంలో గత 15 సంవత్సరాలుగా బంతి, కనకాంబరం పూలసాగు కుటుంబ సాంప్రదాయపైర్లుగా సాగుచేస్తూ లాభాలను గడిస్తున్నారు. మల్లయ్య అనే రైతు తన అర ఎకరంలో ఎప్పుడూ బంతి పూలు అలరిస్తుంటాయి. పూలసాగులో మెలకువలు తెలుసుకుని మార్కెట్‌లో ఆకర్షణ కలిగిన వంగడాలను బెంగళూరు నుండి విత్తనాలు తెప్పించి ఎప్పటి కప్పుడు నూతన పూల ఒరవడికి శ్రీకారం చుడుతూ తన అర్ద ఎకరంలోనే ఎటా లక్షరూపాలయ ఆదాయం పొందుతున్నట్లు ఆనందంగా చెబుతున్నారు.
పూలతో లాభాలే - సుబ్బారావు
నాకు అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారి ప్రక్కన గల అర్ద ఎకరం ఎప్పుడూ బంతి పూలనే సాగు చేస్తాను, విత్తనానికి చేను సిద్ధం చేసేందుకు ఏటా కనీసంగా 10వేలు అవుతుంది. ఒక సారి నాటిన మొక్కలు మూడు నెలలు పూలు పూస్తాయి. ఎటా రెండు సార్లు పూల మెక్కలు నాటి దిగుబడి తీస్తాము. పూల కొనుగోలుకు తోటల వద్దకే వ్యాపారులు వస్తారు. గిరాకీ తక్కువగా ఉంటే మేము మార్టూరు,అద్దంకి, ఒంగోలు తీసుకుపోయి అమ్ముకుని వస్తాం. మార్కెట్‌లో కిలో పూల ధర.50కి తగ్గకుండా ఉంటే ఏటా రూ.80వేల నుండి లక్షరూపాయల ఆదాయం వస్తుంది.
పూలే మాజీవనాధారం - మల్లయ్య
నా కుటుంబం గత 15 ఏళ్లుగా కనకాంబరం పూల సాగుతోనే ఆనందంగా జీవిస్తున్నాం. నాకున్న 60 సెంట్ల పొలంలో సంవత్సరం పొడవునా పూలు పూసేవిదంగా మూడు మళ్లుగా సాగు చేస్తా. ఎప్పుడూ 20సెంట్లలో పూలు పూస్తూ ఉంటాయి. నేను నాభార్య ఇద్దరం పూలతోటను కన్నబిడ్డలకన్నా ఎక్కువ గా ప్రేమిస్తాం. మా పిల్లలలను పూలసాగుతోనే ఉన్నత చదవులు చదివిస్తున్నాం. 20సెంట్ల లో రోజూ 4కేజీల పూలకు తగ్గకుండా పూస్తాయి. ప్రస్తుతం కేజీ ధర రు.500 పలుకుతుంది. మార్కెట్ ఏడాదిలో ఒక నెల కాస్త తక్కువగా ఉంటుంది. అయినా ఏటా లక్షరూపాయల ఆదాయం వస్తుంది. పూలే మాజీవితం ఆనందంగా గడపడానికి మూలం అంటారు కనకాంబరం మల్లయ్య.