ప్రకాశం

అంతుపట్టని అన్నా వ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, జనవరి 22: గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు రాజకీయ వ్యూహం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. 2014 ఎన్నికల్లో గిద్దలూరు నుంచి టిడిపి తరపున పోటీచేసి ఓటమిపాలైన అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల కారణంగా టిడిపికి రాజీనామా చేసి ప్రస్తుతం స్థబ్దతగా ఉన్నారు. అయితే ప్రతినిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలకు చేరువగా ఉంటూనే పార్టీలకు మాత్రం దూరంగా ఉంటున్నారు. ముందుగా వైకాపాలో చేరి గిద్దలూరు లేదా మార్కాపురం నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే పార్టీకి దూరమై ఏడాది కావస్తున్నా నేటివరకు ఏపార్టీ తీర్థం పుచ్చుకున్న దాఖలాలు లేవు. నియోజకవర్గంలో బలమైన వర్గం కలిగిన అన్నా రాంబాబు టిడిపి రాజీనామా చేసే సమయంలో నియోజకవర్గంలో పాదయాత్ర చేసి గిద్దలూరు నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే పాదయాత్రను జరపకపోవడంపై రాంబాబు వ్యూహాం ఏమిటా అన్న విషయం ఎవరికీ అర్థం కావడం లేదు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీచేసి గెలుపొందిన రాంబాబు మధ్యలో ఆ పార్టీని చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో కాంగ్రెస్‌పార్టీలో కొనసాగారు. విభజన అనంతరం కాంగ్రెస్ కనుమరుగవుతుందని భావించి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. అయితే అక్కడి నుంచి వైకాపా నుంచి గెలుపొందిన ముత్తుముల అశోక్‌రెడ్డి టిడిపి తీర్థం పుచ్చుకోవడంతో పార్టీలో, అధికారుల వద్ద తన మాట చెల్లుబాటు కాకపోవడంతో మనస్థాపానికి గురైన రాంబాబు టిడిపిని వీడారు. అయితే ఇప్పటివరకు ఏపార్టీ తీర్థం పుచ్చుకోకపోవడంతో అసలు 2019 ఎన్నికల్లో శాసనసభకు పోటీచేస్తారా..? లేక రాజకీయాల నుంచి నిష్క్రమిస్తారా అన్నది అర్థంకాక ఆయన వర్గం నేతలు మదనపడుతున్నారు. వైకాపా కూడా గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం అభ్యర్థుల పేర్లు త్వరలో ప్రకటించే అవకాశాలు ఉండటంతో ఈలోపు జగన్‌ను కలిసి తన సీటు పదిలం చేసుకుంటారా, లేక స్వతంత్ర అభ్యర్థిగా గిద్దలూరు నుంచి పోటీ చేస్తారా అన్నది కూడా జవాబులేని ప్రశ్నలా మారింది. అయితే కొందరు మాత్రం మార్కాపురం నియోజకవర్గం నుంచి వైకాపా తరపున పోటీచేస్తారా అన్నది కూడా ప్రస్తుతం ప్రజల్లో చర్చ జరుగుతోంది.