ప్రకాశం

స్మార్ట్‌సిటీ పథకం ద్వారా వౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఫిబ్రవరి 23: స్మార్ట్‌సిటీ పథకం ద్వారా ఒంగోలు పట్టణంలో వౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి వినయ్‌చంద్ ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్‌ను ఆదేశించారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో స్మార్ట్‌సిటీ పథకంలో భాగంగా సిటీ మేనేజిమెంట్ సెంటర్, బైస్కిల్ షేరింగ్ సిస్టం, ఐకానిక్ టవర్, మోడల్ రోడ్లు, జంక్షన్ల అభివృద్ధిపై ఆయన సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. స్మార్ట్‌సిటీ పథకంలో భాగంగా స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు మేనేజరు సిద్దార్థ ఈబైక్ షేరింగ్ సిస్టం, సిటీ మేనేజ్‌మెంట్ సెంటర్, ఐకానిక్ టవర్, మోడల్ రోడ్లు, జంక్షన్ల అభివృద్ధిపై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈబైస్కిల్ షేరింగ్ సిస్టం నగరంలో తొలుతగా 25నుండి 50 సైకిళ్లతో మొదలుపెట్టి విడతలవారీగా నిర్దేశించిన లక్ష్యం మేరకు సైకిళ్లు ప్రజలు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను ఆదేశించారు. సిటీ మేనేజ్‌మెంట్ సెంటరులో అమలుచేసే విధంగా సేవలపై కలెక్టర్ సమీక్షించారు. స్మార్ట్ స్ట్రీట్ లైటింగ్ వీధి వ్యాపారస్తులకు జిపిఎస్, బేస్డ్‌సేవలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, ప్రజలకు తెలియచేసే భావప్రకటనల బోర్డులు, వాతావరణం తెలిపే మానిటరింగ్ స్టేషన్, స్మార్ట్ స్కూల్స్, వాటర్ మేనేజ్‌మెంట్ సిస్టం, పబ్లిక్ బైస్కిల్స్ షేరింగ్ సిస్టంలపై ప్రాజెక్టు మేనేజరు, కమిషనర్‌తో సమీక్షిస్తూ ప్రధానంగా వాటర్ మేనేజ్‌మెంట్ సిస్టంపై ఎక్కువ దృష్టి సారించేలా చూడాలని సూచించారు. నగరంలో ఐకానిక్ టవర్ ఏర్పాటు విషయంలో ముఖ్యంగా పట్టణ చరిత్ర, ఇతర అంశాలతో మ్యూజియం, లైబ్రరీ ఉండేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. ఐకానిక్ టవర్‌లో అన్ని రకాల వసతులు, ఓపన్ ఎయిర్ థియేటర్, ఫుడ్‌కోర్టు, షాపింగ్‌మాల్ వంటివి ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించరారు. ఐకానిక్ టవర్ బహుళ ప్రయోజనకరంగా తీర్చిదిద్దేలా చూడాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. నగరంలో మున్సిపాలిటీకి సంబంధించిన ఖాళీ ప్రదేశాలను గుర్తించి మంచి పార్కులు అభివృద్ధి చేయాలని ఆయన కమిషనర్‌ను ఆదేశించారు. టౌన్‌ప్లానింగ్‌ను దగ్గర పెట్టుకుని ఖాళీ ప్రదేశాలను గుర్తించాలని మునిసిపల్ ఇంజనీర్‌ను ఆదేశించారు. నగర ప్రజలకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కలిగిన పార్కులు అభివృద్ధి చేసేందుకు అధికారులు కృషిచేయాలన్నారు. మోడల్ రోడ్ల అభివృద్ధిలో భాగంగా రోడ్లపై బ్లింకింగ్ మార్క్స్, లైన్ మార్కింగ్ చేపట్టి ప్రమాదాలను అరికట్టాలన్నారు. నగరంలో గుర్తించిన ప్రాంతాల అభివృద్ధికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా నగరంలోని రోడ్ల విస్తరణ, ప్రధానమైన కూడళ్లు అభివృద్ధి చేయాలన్నారు. ఒంగోలు నగరంలోకి ప్రవేశించే ప్రాంతాల్లో సైన్‌బోర్డులు ఏర్పాటుచేసి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా చూడాలన్నారు. సిటీ మేనేజ్‌మెంట్ సెంటర్, బైస్కిల్ షేరింగ్ సిస్టం, ఐకానిక్ టవర్, మోడల్ రోడ్లు, జంక్షన్ల అభివృద్ధికి సంబంధించి టెండర్లు త్వరితగతిన చేపట్టి పనులు ప్రారంభించేలా చూడాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. జంక్షన్ల అభివృద్ధికి సంబంధించి జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ను సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించి పనులు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈసమావేశంలో జిల్లా ఎస్‌పి ఏ సత్యఏసుబాబు, ఒంగోలు నగరపాలక సంస్థ కమిషర్ ఎస్ వెంకటకృష్ణ, మునిసిపల్ ఇంజనీరు డి సుందరరామిరెడ్డి, స్మార్ట్‌సిటి ప్రాజెక్టు మేనేజరు సిద్దార్ధ, ప్రాజెక్టు సెక్రటరి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.