ప్రకాశం

రాష్ట్భ్రావృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్న చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శి, ఏప్రిల్ 25:రాష్ట్భ్రావృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మునిలా పనిచేస్తున్నారని జిల్లా ఇన్‌చార్జి మంత్రి రావెల కిశోర్‌బాబు అన్నారు. సోమవారం దర్శి నియోజకవర్గంలోని వెంకటాచలం పల్లె గ్రామపంచాయితీలో డ్రైవింగ్ శిక్షణ, ట్రాఫిక్ పరిశోధన సంస్థకు భూమిపూజ సందర్భంగా బహిరంగసభ జరిగింది. ఈ డ్రైవింగ్ శిక్షణ, ట్రాఫిక్ పరిశోధన సంస్థను 18.51కోట్లరూపాయల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇందులో కేంద్రం 16.34కోట్లు, మారుతీ సుజుకి కోటి 69లక్షల రూపాయలను మంజూరు చేసింది. ఈసందర్భంగా జరిగిన బహిరంగసభలో మంత్రి రావెల మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయి అప్పుల ఊబిలో ఉన్నప్పటికీ స్వర్ణాంధ్ర నిర్మాణానికి ముఖ్యమంత్రి నిరంతరం తపిస్తున్నారన్నారు. రాష్ట్రప్రజలకు బంగారుభవిష్యత్ అందించాలన్న లక్ష్యంతో నిరంతరం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మాట తప్పకుడదు, మడం తిప్పకుడదనే నినాదంతో ముఖ్యమంత్రి రాష్ట్రప్రజలకు ఇచ్చిన హమీలను నేరవెరుస్తున్నారన్నారు. నియోజకవర్గంలో మంత్రి రాఘవరావు అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నారని రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరగని అభివృద్ధి దర్శి నియోజకవర్గంలో జరుగుతుందన్నారు. ప్రతి ఇంటి వద్దకు సిమెంటురోడ్ల నిర్మాణానికి శిద్దా శ్రీకారం చుట్టారని ఎస్‌సి,ఎస్‌టి సబ్‌ప్లాన్ నిధులకింద అత్యధికంగా దర్శినియోజకవర్గంలో ఖర్చుచేసినట్లు చెప్పారు. కురిచేడులో 21కోట్లరూపాయలతో కారొరేట్ స్థాయి ఏపి రెసిడెన్షియల్ స్కూలును మంజూరు చేయటం జరిగిందని ఈసందర్భంగా తెలిపారు. రాజధాని తరువాత దర్శినియోజకవర్గంలోని దొనకొండ అంతటి అభివృద్ధి సాధిస్తుందని దొనకొండలో పారిశ్రామిక కారిడార్ హబ్ అభివృద్ధి చెందితే ఈప్రాంతంలోనిరుద్యోగ సమస్య పారిపోతుందన్నారు. రాష్ట్ర రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ గత 20సంవత్సరాల కాంగ్రెస్‌పాలనలో ఏ ఒక్క రోడ్డుకు తట్టమట్టిపోసిన దాఖలాలు లేవని టిడిపి అధికారం చేపట్టిన తరువాత ప్రతిగ్రామం నుండి మండలానికి, మండలం నుండి జిల్లాకు,జిల్లానుండి అమరావతికి రోడ్ల అభివృద్ధి జరిగిందన్నారు. రాష్ట్రం విడిపోయి 17వేలకోట్లరూపాయల అప్పుల్లో ఉన్నప్పటికి సంక్షేమ పధకాలను కొనసాగిస్తూనే రాష్ట్భ్రావృద్ధికి నిరంతరం పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రికి అందరి సహాయసహకారాలు అందించాలన్నారు. రోజుకు 18గంటలు పనిచేస్తూ రాష్ట్రానికి అనేక పరిశ్రమలను తీసుకురావటంలో విశేషకృషి సలుపుతున్నారన్నారు. దొనకొండలో 23వేల కోట్లరూపాయలతో చైనా కంపెనీ పరిశ్రమలను నెలకొల్పనుందని ఈ పరిశ్రమలను స్థాపిస్తే 70వేలమందికి ఉపాధి అవకాశం ఏర్పడుతుందన్నారు. జిల్లాలో రామయపట్నం పోర్టు, ఒంగోలులో ఐఐటి కాలేజి ఏర్పాటు, కనిగిరిలో నిమ్జ్ లాంటి అనేక సంస్థలు తమపాలనలో వచ్చాయన్నారు. దొనకొండ కారిడార్ నుండి 750కోట్ల రూపాయలతో రాజధానికి నాలుగులైన్ల రహదారుల విస్తరణ, రెండువందల రూపాయల పెన్షన్‌ను వెయ్యిరూపాయలకు, ఐదురూపాయల పెన్షన్‌ను 15వందల రూపాయలకు పెంచి ప్రతి ఇంటా చంద్రన్న పంట పండించారన్నారు. 40వేల కోట్ల రూపాయలతో రైతులకు, డ్వాక్రామహిళలకు రుణాలను మాఫీ జరిగిందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చటం జరుగుతుందన్నారు. నీరు-చెట్టు, నదుల అనుసంధానంతో భవిష్యత్‌లో కరవురహిత ఆంధ్రాగా తీర్చిదిద్దటమే చంద్రన్న లక్ష్యమన్నారు. రోడ్డ్భుద్రతా వారోత్సవాలు, రోడ్డుప్రమాదాల నివారణకు అవగాహన సదస్సులు,ప్రతినెలా పదిరోజులు పోలీసు, రవాణాశాఖ ఆధ్వర్యంలో డ్రంకన్‌డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతుందన్నారు. ప్రతి వాహనానికి జిపిఐ సిస్టంను అమలుచేసి స్పీడు గవర్నర్స్ ఏర్పాటుచేయటం చేయటం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చన్నారు. భారతదేశంలోనే ఆంధ్రారాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపటం వలన అందరు ఆంధ్రరాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారన్నారు. చంద్రన్నపాలన పట్ల అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు దృష్టిసారిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో పాలిటెక్నిక్, డిగ్రీకాలేజిల ఏర్పాటు, చందవరంపై ఎనిమిది కోట్లతో బ్రిడ్జినిర్మాణానికి అనుమతులు మంజూరు చేసినట్లు చెప్పారు.
ఇప్పటికే నియోజకవర్గంలో వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడటం జరిగిందన్నారు. భవిష్యత్‌లో మరింత అభివృద్ధికి తోడ్పడతానని తెలిపారు. నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా తనకు అవకాశం కల్పిస్తే నియోజకవర్గ అభివృద్దికి తోడ్పడతామని ఇచ్చిన హామీలను నేరవెర్చి మాట నిలబెట్టుకుంటున్నట్లు తెలిపారు.
ఈ సభలో రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రోడ్డ్భుద్రతను పెంచాలని సుశిక్షులైన శోధకులను తయారుచేయటం ద్వారా దేశంలో ప్రమాదాలను నివారించేందుకు భారతదేశంలో ప్రథమంగా దర్శి నియోజకవర్గంలో ఈ ట్రాఫిక్ పరిశోధన సంస్థను నెలకొల్పుతున్నట్లు చెప్పారు. 2020 నాటికి 50శాతం రోడ్డుప్రమాదాలను తగ్గించేదిశగా ప్రభుత్వం అన్ని చోట్ల డ్రైవింగ్ శిక్షణ, ట్రాఫిక్ పరిశోధన కేంద్రాలను నెలకొల్పనున్నట్లు చెప్పారు.
ఈకార్యక్రమంలో ఆర్‌అండ్‌బి చీఫ్ సెక్రటరి శ్యాంబాబు మాట్లాడుతూ ప్రతిసంవత్సరం 45వేలమందికి ఈ శిక్షణ కేంద్రంలో శిక్షణ ఇవ్వటం జరుగుతుందని, ఇందులో పదివేలమంది నూతనం వాహన చోదకులు తయారుఅవుతారని పునశ్చరణ తరగతుల కింద 14,500మందికి శిక్షణ ఇవ్వటం జరుగుతుందన్నారు.వాహనచోదకుల వలన వారి జీవితాలతోపాటు ఇతరుల జీవితాలు కూడా ఆధారపడి ఉంటాయని దేశంలో 30శాతంమంది డ్రైవింగ్ లైసెన్స్‌లు లేకుండా మరో 30శాతంమంది డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న నైపుణ్యంలేని డ్రైవింగ్ వలన ప్రమాదాలకు గురౌతున్నారని ఈ శిక్షణాకేంద్రాల వలన సుశిక్షుతులైన వాహన చోదకులు తయారౌతారన్నారు. ఈకార్యక్రమంలో రవాణాశాఖ జాయింట్ కమిషనర్ ప్రసాదురావు, జిల్లాజాయింట్‌కలెక్టర్ ఎం హరిజవహర్‌లాల్, ఎస్‌పి సిహెచ్ శ్రీకాంత్, వైపాలెం, కొండెపి శాసనసభ్యులు పాలపర్తి డేవిడ్‌రాజు, డోలా బాలవీరాంజనేయస్వామి, మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు, ఎన్ విజయకుమార్, ఎంపిపి పూసల సంజీవయ్య, జడ్‌పిటిసి గర్నెపూడి స్టీవెన్, ఆర్‌టిఒ రాంప్రసాదు, ఎఎంవిఐ శేషిరెడ్డి, రహదారుల భవనాల శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.

టిడిపి సభ నుండి బిజెపి నేతల గెంటివేత
దర్శి, ఏప్రిల్ 25: డ్రైవింగ్ శిక్షణ, ట్రాఫిక్‌పరిశోథన సంస్థకు భూమిపూజ సందర్భంగా సోమవారం వెంకటాచలం పల్లె పంచాయతీ పరిధిలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర నిధులతో జరుగుతున్న కార్యక్రమానికి కేంద్రమంత్రి నితిన్‌గడ్కరి ఫొటోలు ఫ్లెక్సీల్లో ఏర్పాటుచేయకుండా ప్రోటోకాల్ పాటించలేదంటూ బిజెపి నేతలు రాష్టర్రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు ప్రసంగం జరుగుతుండగా గడ్కరి నాయకత్వం వర్థిల్లాలి అంటూ కేకలు వేశారు. కేంద్రప్రభుత్వ నిధులతో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రోటోకాల్ ప్రకారం కేంద్రమంత్రుల ఫొటోలను ఏర్పాటుచేయకపోవటం పట్ల బిజెపి జిల్లాకార్యదర్శి దిండి నారాయణ రెడ్డి, కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు వైవి లక్ష్మినారాయణరెడ్డి, బిజెపి కార్యకర్తలతో సభాప్రాంగణంలో శిద్దా ప్రసంగాన్ని అడ్డుకున్నారు 18.50కోట్లరూపాయలతో నిర్మిస్తున్న డ్రైవింగ్ శిక్షణకేంద్రానికి కూడా కేంద్రప్రభుత్వ నిధులేనని కాని టిడిపి నాయకులు తమ గొప్పతనంగా ప్రచారం చేసుకుంటూ కేంద్రాన్ని తక్కువ చూస్తున్నారని దీన్ని ప్రశ్నిస్తే పోలీసులనుండి గెంటివేశారని ఆరోపించారు. దర్శి 4. సభనుండి బిజెపి నాయకులను గెంటివేస్తున్న పోలీసులు

తెలుగు నాటకానికి మహోన్నత చరిత్ర
రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్
మార్టూరు, ఏప్రిల్ 25: తెలుగు నాటకానికి మహోన్నత చరిత్ర ఉందని, గొప్ప గొప్ప కళాకారులు తమ నాటకాల ద్వారా జాతిని చైతన్య పరిచారని రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. శ్రీకారం రోటరీ కళాపరిషత్ నాటికలు మార్టూరులో రెండో రోజు సోమవారం రాత్రి సందడిగా సాగాయి. ఈ పోటీలను మండలి బుద్ధ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు కళాపరిషత్ కార్యనిర్వాహకుడు జెవి మోహన్‌రావు అధ్యక్షత వహించారు. సభలో బుద్ధ ప్రసాద్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ జాతిని చైతన్యం చేయడంలో నాటకాలు ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు. సంఘ సంస్కరణ దృక్పథంతో ఆధునిక నాటకానికి గురజాడ, కందుకూరి లాంటి వారు బీజం వేశారని గుర్తు చేశారు. ఈ కాలంలో నాటకాలు వేషధారణ కరువైందని అయినా ఎందరో కళాకారులు నాటకాలను ప్రదర్శిస్తూ ప్రజలను ఆలోచింప చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నంది నాటకాలు నిర్వహిస్తూ నాటకాల అభివృద్ధికి చేస్తున్న కృషి గర్వకారణమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు అకాడమీలను పునరుద్ధరించడం శుభపరిణామమన్నారు. అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ నాటకాలకు ప్రేక్షక ఆదరణ కరువైందని, నాటకాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రానున్న రోజుల్లో నాటకాలకు మంచిరోజులు రానున్నాయన్నారు. నాటక రంగాన్ని పోషించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. తన వంతుగా పేద కళాకారులను ఆదుకోవడమే తన ధ్యేయమని అన్నారు. కళాపరిషత్ అధ్యక్షుడు కందిమళ్ల సాంబశివరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సినీ దర్శకుడు అనీల్, రోటరీ క్లబ్ అధ్యక్షుడు జాస్తి సాంబశివరావు, కార్యదర్శి కనె్నగంటి శ్రీనివాసరావు, ఎస్ చిరంజీవి, ఎస్ ప్రసాద్, లక్ష్మయ్య, దొడ్డా రమేష్ తదితరులు పాల్గొన్నారు.