ప్రకాశం

సుస్థిరమైన చేపల వేట సాగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాలరూరల్, ఏప్రిల్ 30: సముద్రంలో లభించే మత్స్య సంపద అంతరించి పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మత్స్యకారులపై ఉందని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సముద్రంలో వేట సాగిస్తే మత్స్యకారులు అభివృద్ధి చెందుతారని కాకినాడ ఫిషరీస్ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపల్ బి వెంకటేశ్వర్లు అన్నారు. మండలం లోని వాడరేవు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచి ఎరిపిల్లి రమణ ఆధ్వర్యంలో జాతీయ సమగ్ర మత్స్య విధానం 2016 ముసాయిదాపై ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని మత్స్యకారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సముద్రంలో వేటసాగించే మత్స్యకారులు ప్రతి ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు నిర్వహించే వేట నిషేదాన్ని తప్పకుండా పాటించాలన్నారు. సముద్రంలో మత్స్య సంపద పునరావృతి సాగించే సమయంలో నిషేధాన్ని అమలు చేసి అన్ని చేపల జాతులు అంతరించి పోకుండా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో ఉన్న 33,000 చదరపు కిలోమీటర్ల సముద్ర తీరంలో 16,000 మెకనైజ్డ్ బోట్లు, 3వేల పడవలు ఉన్నాయన్నారు. 20 ఏళ్ల క్రితం 400 రకాలు ఉండే మత్స్య సంపద ప్రస్తుతం 150 రకాలకు చేరిందని దీన్ని బట్టి చూస్తే సముద్రంలో వేట చేసే మత్స్యకారులు ఏ విధంగా వేట సాగిస్తున్నారో తెలుసుకోవచ్చన్నారు. దేశీయ బోట్లు, మెకనైజ్డ్ బోట్లు సముద్రం లోపల 24 కిలోమీటర్లు మాత్రమే వేట చేయడం వలన అరకొరగా మత్స్య సంపద పొందుతున్నారని, 25 నుంచి 150 కిలోమీటర్ల మేరకు వేట చేయాలంటే భారత ప్రభుత్వం అనుమతి తీసుకోవాలన్నారు. మన దేశంలోని మత్స్యకారులు అనుమతులకు ముందుకు రాకపోవడం వల్లనే ఇతర దేశాల్లోని మత్స్యకారులు మన దేశంలో వేట చేసి లక్షలు సంపాదిస్తున్నారన్నారు. మత్స్యకారులు వేటలో వినియోగించే వలలు, బోట్లను మారుతున్న కాలానుగుణంగా మార్పులు చేసుకుని వేట సాగించాలన్నారు. సముద్రంలో విషవాయువులు కలుషితం చేయకుండా చూడడంతో పాటుగా ప్రభుత్వం అందిస్తున్న పధకాలను వినియోగించుకుని ముందుకు సాగాలన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులకు రూపొందించే ముసాయిదా 2025 మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుందని, ముసాయిదాలో మత్స్యకారుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సముద్రంలో వేట చేసే మత్స్యకారులకు వేట నిషేధంలో ఒక్కో కుటుంబానికి నిషేద సమయంలో రూ.4వేలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా ఎడి కె లక్ష్మీనారాయణ, కాకినాడ ఎడి వెంకటరావు, చీరాల, ఒంగోలు, బాపట్ల, రేపల్లె, దర్శి, సింగరాయకొండ ఎఫ్‌డి ఒలు రాజ్‌కుమార్, ఉషాకిరణ్, గాలి దేవుడు, శ్రీనివాసరావు, కిరణ్, వెంకటేశ్వర్లు, మెకనైజ్డ్ బోట్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బ్రహ్మానందరెడ్డి, కార్యదర్శి బ్రహ్మానందరెడ్డి, మెరైన్ పోలీసులు శంకర్, దుర్గ, మత్స్యకారులు పాల్గొన్నారు.