ప్రకాశం

ఎబిపాలెంలో అగ్ని ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్చూరు, ఏప్రిల్ 30: అన్నంబొట్లవారిపాలెం గ్రామ శివారులోని పెంకుటిల్లు కొట్టంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 20 ఎకరాల్లోని 150 క్వింటాళ్ల పొగాకు దగ్ధమైన సంఘటన శనివారం వేకువజామున జరిగింది. గ్రామానికి చెందిన అప్పలనేని నాగేంద్రకు చెందిన పొగాకు మండె దగ్ధమైనట్లు పరిశీలనకు వెళ్లిన డిప్యూటీ తహశీల్దార్ షఫీ అహ్మద్ తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన పెంకుటిల్లు కొష్టాం కిటికీ వద్ద పెట్రోల్ బాటిల్, కవర్‌లో శనగపప్పు ఉన్నట్లుగా బాధితుని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎవరైనా కావాలని చేశారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు రూ.20లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని బాధితుని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ అగ్ని ప్రమాద సంఘటన ఎలా జరిగిందో విచారించడానికి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నట్లు బాధితులు తెలిపారు. ఈ సందర్భంగా విచారణ చేయడానికి వెళ్లిన డిప్యూటీ తహశీల్దార్ షఫీ అహ్మద్ మాట్లాడుతూ 150 క్వింటాళ్ల పొగాకులో 100 క్వింటాళ్ల పొగాకు పూర్తిగా దగ్ధం కాగా మరో 50 క్వింటాళ్ల పొగాకు పాక్షికంగా దగ్ధమైనట్లు ఆయన తెలిపారు. విచారించిన అనంతరం నివేదికను తయారు చేసి జిల్లా అధికారులకు అందించినట్లు తెలిపారు. వేకువ జామున జరిగిన అగ్ని ప్రమాద సంఘటన తెలుసుకున్న చిలకలూరిపేట నుంచి వచ్చిన ఫైర్ స్టేషన్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఎపి పొగాకు ఉత్పత్తిదారుల యూనియన్ డైరెక్టర్ కె బుచ్చిబాబు మాట్లాడుతూ గ్రామానికి చెందిన ఎ నాగేంద్రకు చెందిన 20 ఎకరాల వైట్‌బర్లీ పొగాకు దగ్ధమైందని, ఈ రైతును ప్రభుత్వమే ఆదుకోవాలని ఆయన కోరారు.