ప్రకాశం

నల్లమల చెంచు గిరిజనుల ఉత్పత్తులకు జాతీయ స్థాయి గుర్తింపు తెస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దదోర్నాల, ఏప్రిల్ 30: నల్లమల చెంచు గిరిజనుల ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా పథకాలు రూపొందిస్తున్నట్లు గిరిజన సహకార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రవిప్రకాష్ అన్నారు. మండల కేంద్రమైన పెద్దదోర్నాల్లోని గిరిజన సహకార సంస్థ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన గిరిజనుల ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని శనివారం శ్రీశైలం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి శ్రీనివాసులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నల్లమల గిరిజన సంక్షేమ సంఘం నాయకులు దాసరి అంకన్న, చెవుల అంజయ్య, మంతన్న, మాజీ ఎంపిటిసి కోటన్న తమ గూడెంలలో ఉన్న సమస్యలను ఎండి దృష్టికి తెచ్చారు. అటవీ ఉత్పత్తుల ధరలను పెంచాలని, అలాగే పంట రుణాలను అందజేయాలని కోరారు. గిరిజన సహకార సంస్థ ద్వారా దోర్నాల, ఆత్మకూరు, వైపాళెం, మహానంది వంటి ప్రాంతాలలో చెంచుల కోసం సూపర్‌మార్కెట్లు ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో కోరారు. పెద్దదోర్నాలలో నన్నారి గడ్డలతో షరబత్ తయారుచేసే పరిశ్రమలను, అగర్‌బత్తీ తయారుచేసే పరిశ్రమలను దోర్నాలలో ఏర్పాటుచేయాలని ఆయన దృష్టికి తెచ్చారు. స్పందించిన ఎండి రవిప్రకాష్ మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా కొన్ని గిరిజన సహకార సంస్థలు ఎన్నుకోబడినాయని, అటువంటి సంస్థలను గుర్తించి బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. గత ఏడాదిలో 180 కోట్ల రూపాయల ఉత్పత్తులను లక్ష్యంగా పెట్టుకొని 183 కోట్ల రూపాయల వ్యాపారం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సంవత్సరం 367 కోట్ల రూపాయల వ్యాపారం చేయాలన్న లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. గిరిజన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు ఆదేశాల మేరకు ప్రతి చెంచు కుటుంబానికి అన్ని పథకాలు అందేటట్లు కృషి చేస్తానని అన్నారు. కర్నూలు జిల్లా సుండిపెంటలో ఉన్న గిరిజన సహకార సంస్థ గిరిజన కార్యాలయాన్ని దోర్నాలకు మార్చుతున్నట్లు తెలిపారు. దోర్నాలలో గిరిజన సహకార సంస్థకు రెండు ఎకరాల పొలం ఉంది, ఆ పొలంలో పరిశ్రమలు, గోడౌన్లు నిర్మించి చెంచులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఆయన తెలపారు. విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో చెంచు గిరిజనులు పండించిన కాఫీ తోటలు ప్రసిద్ధి చెందాయని, ఆ కాఫీని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ తాగి చెంచులను అభినందించినట్లు ఆయన తెలపారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ మేనేజర్ కైలాసగిరి, దోర్నాల మేనేజర్ అప్పలరాజు, రిటైర్డు మేనేజర్ శశికళ, ఆఫీసు ఇన్‌చార్జి శ్రీ్ధర్ పాల్గొన్నారు.