ప్రకాశం

గొట్టిపాటి ఫ్లెక్సీలు చించిన అగంతకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అద్దంకి, ఏప్రిల్ 30: అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ పేరుతో పోతురాజుగండి వద్దనున్న గొట్టిపాటి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను శనివారం ఉదయం గుర్తు తెలియని అగంతకులు చింపేశారు. ఫ్లెక్సీలు చించారన్న వార్తతో గొట్టిపాటి అనుచరులు కార్యాలయం వద్దకు చేరారు. ఎలాంటి ఉద్రిక్తతలకు తావివ్వరాదని, సంయమనం పాటించాలని ఎమ్మెల్యే గొట్టిపాటి అనుచరులకు చెప్పారని సమాచారం. టిడిపిలో చేరిన గొట్టిపాటి ఫ్లెక్సీలను గత ఐదురోజుల్లో రెండుసార్లు చించివేశారు. ఎవరైనా ఆకతాయితనంగా ఫ్లెక్సీలు చించినా అద్దంకిలో ఉద్రిక్తతలు రేకెత్తే అవకాశం ఉంది. నియోజకవర్గంలోని ఇరుపార్టీల నాయకులు ఒకే పార్టీలో ఉండడంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయోనని ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.
ఫ్లెక్సీల ఏర్పాటుకు నిబంధనలు పాటించాలి : డిఎస్‌పి రాంబాఋ
అద్దంకి నియోజకవర్గంలో ఎక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నా పోలీసుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని డిఎస్‌పి రాంబాబు తెలిపారు. అద్దంకి పట్టణంలో మున్సిపాలిటీ కమిషనర్ అనుమతి పొందిన తరువాత పోలీసుల అనుమతులు కూడా తీసుకోవాలని, ఎన్నిరోజులు ఫ్లెక్సీ ఉంచాలో అనుమతి పత్రంలో తెలియజేస్తామన్నారు. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో అద్దంకి పట్టణంలోని ఫ్లెక్సీలన్నీ తొలగించారు.