ప్రకాశం

గాలివాన బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దారవీడు, మే 19: మండలంలోని పలు గ్రామాల్లో శనివారం సాయంత్రం వడగండ్లతో కూడిన గాలివాన కురిసింది. పెద్దారవీడు, ఎస్‌కొత్తపల్లి, దేవరాజుగట్టు, కుంట, గొబ్బూరు, తోకపల్లి, సానికవరం, చట్లమిట్ల, మద్దలకట్ట తదితర గ్రామాల్లో వడగండ్లవానతోపాటు ఒక మోస్తారు వర్షం కురిసింది. రెండుగంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అంతేకాకుండా పలుగ్రామాల్లో చెట్లు విరిగిపడగా విద్యుత్‌స్తంభాలు నేలకొరిగాయి. అయితే ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. వడగండ్ల వానతో ప్రజలు ఎండ తీవ్రత నుండి ఉపశమనం పొందారు. మండలంలోని ఎస్ కొత్తపల్లి గ్రామంలో కందుకూరి చిన్నరంగయ్యకు చెందిన రేకులషెడ్ గాలివానకు లేచిపోయాయి. ఆయనకు సుమారు లక్ష రూపాయల నష్టం వాటిల్లింది. రహదారులకు ఇరువైపులా ఏర్పాటు చేసుకున్న టీస్టాల్స్, బంకులపై వేసుకున్న రేకులు గాలికి లేచిపోయాయి. దీంతో యజమానులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు.

నిలువ నీడలేని జాతీయ రహదారులతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
- పర్యావరణ సంస్థ చైర్మన్ జి వీరభద్రాచారి
ఒంగోలు, మే 19: జిల్లాలో వందలాది కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల వెంట నిలువునీడలేని పరిస్థితిలో ప్రజలు, వాహనదారులు పలు ఇబ్బందులు గురౌతున్నట్లు పర్యావరణ పరిరక్షణ సంస్థ చైర్మన్ జి వీరభద్రాచారి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక సంస్థ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రహదారుల వెంట వందల సంవత్సరాల క్రితం ఉన్న చెట్లను నరికివేయటం వలన జాతీయ రహదారుల వెంట నిలువునీడలేని స్థితిలో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.వారు నిరంతరం ఇబ్బందులు పడుతున్నప్పటికీ పాలకులు, అధికారులు పట్టించుకోకపోవటం దురదృష్టకరమన్నారు. 2002లో నాటిన చెట్లను 2011లో మొత్తం నరికి రోడ్లవిస్తరణ పేరుతో పకృతిని నాశనం చేశారని నేటికి ఒక్క మొక్క కూడా నాటకపోవటం ఎన్‌హెచ్ 1 అధికారుల నిర్లక్ష్యానికిపరాకాష్టకా చెప్పుకోవచ్చునని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న వనం, మనం కార్యక్రమం కూడా ఈ జాతీయ రహదారుల వెంట చెట్లను నాటే అంశం ప్రస్తావనకు రాకపోవటం దురదృష్టకరమన్నారు. అంతేకాకుండాజాతీయ రహదారులపై ఒప్పందంపై కల్పించాల్సిన అనేక సౌకర్యాలు కల్పించటం లేదని అంతేకాకుండా నిరంతరం నిర్లక్ష్యపునిర్మాణాలతో అనేక ప్రమాదాలుజరుగుతూ అమాయక ప్రాణాలు గాలిలో కలుస్తున్న పట్టించుకోని అధికారుల తీరును ఆయన విమర్శించారు. తక్షణమే జాతీయ రహదారుల వెంట చెట్లను నాటి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిందిగా ఆయన కోరారు.