ప్రకాశం

నవజీవన్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాలరూరల్, మే 2: నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో నీళ్లు లేకపోవడం, ఫ్యాన్లు తిరగకపోవడంతో ఆందోళన చేసి ప్రయాణికులు 50 నిమిషాల పాటు చీరాల రైల్వేస్టేషన్‌లో రైలును నిలిపివేసి ఆందోళన చేశారు. సోమవారం ఉదయం 11.30 నిమిషాలకు చీరాల చేరుకున్న అహ్మదాబాద్ - చెన్నై సూపర్‌ఫాస్ట్ రైలు రిజర్వేషన్ కోచ్‌లో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు 12.20 గంటల వరకు చీరాల్లో రైలును నిలిపి వేశారు. అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న నవజీవన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం ఉదయం అహ్మదాబాద్‌లో బయల్దేరింది. రైలులో ఉన్న రిజర్వేషన్ బోగీల్లో ఫ్యాన్లు పనిచేయకపోవడంతో పాటుగా మరుగుదొడ్లలో నీరు సరఫరా కాకపోవడంతో రిజర్వేషన్ ప్రయాణికులు చీరాల రైల్వేస్టేషన్‌లోని రైల్వే అధికారులతో వాగ్వాదానికి దిగారు. విజయవాడలో రైలుకు నీరు నింపాల్సి ఉండగా రైల్వే అధికారులు నీరు నింపకుండా పంపించారన్నారు. ఓ వైపు వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ రిజర్వేషన్ బోగీల్లో ఫ్యాన్లు తిరగకపోవడంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందిపడ్డారు. 50 నిమిషాల వరకు రైలును చీరాల స్టేషన్‌లో నిలిపి వేసి ఆందోళన చేశారు. అనంతరం రైల్వే స్టేషన్ మేనేజర్, ఆర్‌పిఎఫ్ పోలీసులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. చీరాల ఉన్నతాధికారులు పై అధికారులకు ఫిర్యాదు చేయగా రైలుకు ఒంగోలులో ఫ్యాన్లు మరమ్మతులు చేయించి బిట్రగుంటలో నీరు నింపుతామని హామీ ఇవ్వడంతో రైలు బయల్దేరింది.

తగ్గిన మామిడి దిగుబడి
* రైతుకు రాని పెట్టుబడి
* నష్టాలతో కౌలు రైతు కంటతడి
* ఎగుమతి వ్యాపారుల రాకతో మారుతున్న ధరలు
* టన్ను ధర రూ.45వేల నుంచి రూ.50వేలు

కందుకూరు, ఏప్రిల్ 24: కందుకూరు నియోజకవర్గంలో ఉలవపాడు, గుడ్లూరు మండలాలు మామిడి తోటలకు పెట్టింది పేరు. ఇక్కడ నుంచి వేల టన్నుల మామిడి కాయలు ముంబయి, నెల్లూరు, గుంటూరు తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతూ ఉంటాయి. ప్రస్తుతం దిగుబడి సరిగా లేకపోవడంతో రైతులు దిగులు పడుతున్నారు. కాగా, మామిడి ధరలు చుక్కలనంటుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ఏడాది కౌలు రైతులు మామిడి చెట్లు పూత పూయక ముందే తోటలను కౌలుకు తీసుకున్నారు. పూత వచ్చేందుకు వేలకువేల రూపాయలు వెచ్చించి రసాయనిక మందులు పిచికారీ చేశారు. అనంతరం పూతకు వచ్చిన తరువాత వర్షాలు కురవకపోవడంతో ఆ పూత దాదాపు 70శాతం రాలిపోయింది. ఆ ఉన్న కొద్దిశాతం పూతను కాపాడుకునేందుకు కౌలు రైతులు అనేక వ్యయ ప్రయాసాలకు గురికావాల్సి వచ్చింది. వేలకువేలు ఖర్చు చేయడంతోపాటు తమ కాయకష్టం కూడా ప్రయోజనం లేకుండా పోయిందని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామిడి కాయలను కొనుగోలుచేసి ఎగుమతి చేసేందుకు సుదూర ప్రాంతాల నుండి వ్యాపారులు వస్తున్నప్పటికీ ఆశించిన మేర పంట దిగుబడి లేకపోవడంతో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం ధర టన్నుకు 45వేల నుంచి 50వేల రూపాయల వరకు పలుకుతోందని రైతులు చెబుతున్నారు. ప్రకృతి అనుకూలించకపోవడం, దిగుబడి సరిగా రాకపోవడంతో ఈ ప్రాంతంలో మామిడి తోటలను కౌలుకు తీసుకున్న రైతులు దిగాలు పడుతున్నారు. మామిడి తోటలను కౌలుకు తీసుకున్న రైతులు 90శాతం మంది నష్టాలను చవిచూడాల్సి వస్తుందని కౌలు రైతులు చెబుతున్నారు. ఇప్పటికే మామిడి కాయలను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఈ ప్రాంతంలో మకాం వేసి ఎగుమతులు చేస్తున్నప్పటికీ ఆశించిన మేర పంట దిగుబడి లేదు. అయితే ఈ ఏడాది ఇంత ఘోరంగా మామిడి కాయలు కాపు తగ్గిపోవడానికి ప్రధాన కారణం రైతులు వాడుతున్న రసాయనిక ఎరువులు, మందులేనని, అంతే కాకుండా పూత దశలో వర్షాలు కురవకపోవడంతో మామిడి తోటలు బీటలు రావడంతో పూత పిందె దశలోనే రాలిపోవడంతో దిగుబడి గణనీయంగా తగ్గిపోయిందని మామిడి తోటల యజమానులు తెలుపుతున్నారు.

ఆర్‌టివో కార్యాలయ సమీపంలోని
ఏజెంట్ల ఆఫీసులపై
విజిలెన్స్ అధికారుల దాడులు
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, మే 2: రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంటు అధికారులు ఆర్‌టిఒ కార్యాలయం బయట ఉన్న ఏజెంట్ల కార్యాలయాలపై సోమవారం దాడులు నిర్వహించారు. కాకినాడ డిటిసి ఆదిమూలం మోహన్ ఇటీవల ఎసిబి అధికారులు దాడులు నిర్వహించి పెద్దఎత్తున ఆస్తులు, బంగారం, నగదును స్వాధీనం చేసుకున్న నేపధ్యంలో రాష్ట్రప్రభుత్వం రవాణాశాఖపై ప్రత్యేక దృష్టిసారించింది. అందులోభాగంగా రాష్టవ్య్రాప్తంగా జరిగిన దాడుల్లో భాగంగా విజిలెన్స్ అధికారులు ఏజెంట్లకార్యాలయాలపై దాడులు నిర్వహించారు. రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు వాహనదారులు తమ వాహనాలకు రిజిస్ట్రేషన్లు, ఇతర పనుల మీద వచ్చేవారు నేరుగా ఆర్‌టిఒ కార్యాలయ సిబ్బందిని కాని, ఆర్‌టిఒ అధికారులను కలిసి పనిచేసుకునే వీలు ఉంది. బ్రోకర్ల వ్యవస్థను రాష్ట్రప్రభుత్వం రద్దుచేసింది. ఈనేపధ్యంలో ఒంగోలులోని ఆర్‌టిఒ కార్యాలయం ఎదుట బ్రోకర్లు ఉండి కార్యాలయ సిబ్బందితో కుమ్మకై వాహనదారులకు సేవలు అందిస్తున్నట్లుగా తమ దాడుల్లో తెలినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంటు ఎఎస్‌పి బాలవెంకటేశ్వరరావు ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. కాగా తమ కార్యాలయంలో ఎవరు మధ్యవర్తులు లేరని జిల్లా ఆర్‌టిఒ రాంప్రసాదు వెల్లడించారు. తన దగ్గరకు ఎవరు వచ్చిన పనిచేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. మొత్తంమీద త్వరలోనే ఆర్‌టిఒ కార్యాలయ బండారం బయటకు రానుండటంతో కార్యాలయ సిబ్బంది ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా బ్రోకర్ల వ్యవస్థ నిర్మూలనకు ఆర్‌టిఒ అధికారులు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేనిపక్షంలో వాహనదారులులైసెన్స్‌ల కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ దాడుల్లో విజిలెన్స్ అధికారులు కిశోర్, శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.

దాహం తీర్చండి
* ఖాళీ బిందెలతో వైకాపా నేతల ఆందోళన
* శాసనసభ్యుల కొనుగోళ్లు కాదు.. మంచినీళ్లు ఇవ్వండి
* వైకాపా నేతల డిమాండ్
* ఒంగోలులో ఆందోళనకు అనుమతి
లేదంటూ టెంట్‌లను పీకేసిన పోలీసులు
ఆంధ్రబూమి బ్యూరో
ఒంగోలు, మే 2: జిల్లాలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నివారణకు రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్, మండల కార్యాలయాల ఎదుట వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా వైకాపా నాయకులు, మహిళలు ఖాళీబిందెలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. జిల్లావ్యాప్తంగా మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉండటంతో వైకాపా నేతల ఆందోళనకు ప్రజల నుండి మద్దతు లభించిందనే చెప్పవచ్చు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల కేంద్రాల్లో శాసనసభ్యులు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు పాల్గొని రాష్ట్రప్రభుత్వ తీరును ఎండగట్టారు. మార్కాపురంలో శాసనసభ్యుడు జంకె వెంకటరెడ్డి, కనిగిరిలో బి మధుసూదన్, కొండెపిలో వరికూటి అశోక్, చీరాలలో యడం బాలాజీతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఆందోళనకు అనుమతి లేదంటూ టెంట్‌లు పీకేసిన పోలీసులు
జిల్లాకేంద్రమైన ఒంగోలులోని మదర్‌థెరిస్సా విగ్రహం వద్ద వైకాపా నాయకులు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు టెంట్‌లు వేశారు. ఈసందర్భంగా పోలీసులు, వైకాపా నాయకుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కాగా, పోలీసుల అనుమతి లేదంటూ టెంట్‌ను పీకివేయటంతో నాయకులు ఎండలోనే ఆందోళన చేస్తూ రాష్ట్రప్రభుత్వ విధానాలను ఎండగడుతూ నినాదాలు చేశారు. రాష్ట్రప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని పోలీసుల తీరుపై వైకాపా నేతలు మండిపడ్డారు. ఈ సందర్భంగా వైకాపా రాష్ట్ర పార్టీ నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కెవి రమణారెడ్డి తదితరులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు శాసనసభ్యులను సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తున్నారని, ఆ విధానానికి స్వస్తిపలికి జిల్లాలోని మంచినీటి ఎద్దడిని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి ప్రజాధనంతో హెలికాఫ్టర్‌లో తిరుగుతూ ప్రజల సమస్యలను పట్టించుకోవటం లేదని ఆరోపించారు. జిల్లాలోని ప్రజలు తాగేందుకు గుక్కెడు నీరు ఇవ్వండి మహాప్రభో అంటూ వారు ధ్వజమెత్తారు. ఈ ఆందోళన కార్యక్రమంలో వైకాపా పట్టణ అధ్యక్షుడు కుప్పం ప్రసాదుతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్దఎత్తున పాల్గొని నిరసన తెలిపారు. మొత్తంమీద జిల్లావ్యాప్తంగా వైకాపా నేతలు చేపట్టిన ఆందోళన కార్యక్రమం విజయవంతమైందనే చెప్పవచ్చు.

ఎంపి సుబ్బారెడ్డి
బ్రెజిల్ పర్యటన
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, మే 2: వైకాపా రాష్ట్ర నాయకులు, ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వైవి సుబ్బారెడ్డి ఈనెల 8వ తేదీ వరకు బ్రెజిల్‌లో జరిగే ఎపోజబు ఎక్స్‌పో కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదేశానికి బయలుదేరి వెళ్లారు. ఆయన తిరిగి ఈనెల 10వ తేదీన బ్రెజిల్‌లో బయలుదేరి ఢిల్లీలో జరిగే పార్లమెంటు సమావేశాలకు హాజరుకానున్నారు. బ్రెజిల్ దేశం ఆహ్వానం మేరకు ఆయన ఆ దేశానికి వెళ్లారు. ఈసందర్భంగా బ్రెజిల్ వ్యవసాయశాఖ మంత్రి కాటియా అబ్రూతో భేటీ అయిన అనంతరం ఒంగోలు జాతి పశుసంపద అభివృద్ధికి ఆ దేశానికి చెందిన శాస్తవ్రేత్తలు అనుసరిస్తున్న విధానాలను ఇక్కడకు తీసుకువచ్చేందుకు కృషిచేయనున్నారని ఆయన కార్యాలయ ప్రతినిధి విలేఖర్లకు తెలిపారు.

కడుపునొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య
చినగంజాం, మే 2: స్థానిక దర్గా సెంటరు వద్ద గల ముస్లిం పేటలో కడుపునొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ముస్లిం పేటకు చెందిన సయ్యద్ షమ్మి (25) కడుపునొప్పితో బాధ పడుతూ ఆదివారం సాయంత్రం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి సోదరుడు ఎస్‌కె షమీర్ తెలిపాడు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని చీరాల వైద్యశాలకు తరలించినట్లు ఎస్సై బత్తుల నరసింహారావు తెలిపారు.
రేపు భవననిర్మాణ కార్మికుల సమావేశం
ఒంగోలు అర్బన్,మే 2:్భవన నిర్మాణ కార్మిక సంఘ సమావేశం ఈనెల 4వతేదీ బుధవారం ఉదయం పదిగంటలకు స్థానిక సిపిఐ జిల్లాకార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఎపి భవన నిర్మాణ కార్మిక సంఘం నగర కన్వీనర్ హరికృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
కందుకూరు, మే 2: విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైన సంఘటన సోమవారం రాత్రి పట్టణంలోని ఒకటవ వార్డులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే నల్లబోతుల సాంబయ్య ఇంట్లో రాత్రి 8 గంటల ప్రాంతంలో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఇంటిలోని గ్యాస్ సిలిండర్ పేలడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. అయితే ఆ సమయంలో ఇంటిలో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఇంటిలోని సామాను అంతా పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారి జాలయ్య ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 20 వేల రూపాయల నగదుతోపాటు, రెండు లక్షల విలువైన సామన్లు దగ్ధమైనట్లు బాధితుడు తెలిపారు. బాధితుడిని టిడిపి పట్టణ అధ్యక్షులు పి వెంకటేశ్వర్లు పరామర్శించారు. ప్రభుత్వం దృష్టికి వెళ్లి బాధిత కుటుంబానికి న్యాయం చేసేలా కృషి చేస్తానని తెలిపారు.

మాజీ ఎంఎల్‌సి రామిరెడ్డి మృతికి
పలువురి సంతాపం
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు,మే 2:మాజీ ఎంఎల్‌సి, యుటిఎఫ్ రాష్టమ్రాజీ అధ్యక్షుడు దాసూరి రామిరెడ్డి మృతికి పలువురు సంతాపం తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఒంగోలులోని ఒకప్రైవేటు వైద్యశాలలో చికిత్సపొందుతూ తుదిశ్వాసవిడిచారు. రామిరెడ్డి బౌతికకాయాన్ని స్ధానిక యుటిఎఫ్ కార్యాలయంలో పలువురు సందర్శనార్ధం ఉంచారు. మంగళవారం ఆయస స్వగ్రామమైన శింగరాయకొండ మండల పాకల్లో అంత్యక్రియలు జరగనున్నాయి. (ప్రధాన వార్త మెయిన్ ఎడిషన్‌లో)
ఆయన భాతికాయాన్ని పలువురు రాజకీయ, ఉపాధ్యాయ, ప్రజాసంఘాలనాయకులు సందర్శించి నివాళులర్పించారు. కాగా ఆయన మృతిపట్ల ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి, జిల్లా శాసనమండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి, సిపిఎం జిల్లాకార్యదర్శి పూనాటి ఆంజనేయులు, జనవిజ్ఞానవేదిక రాష్టక్రార్యదర్శి డిఎల్ ప్రసాద్ తదితరులు సంతాపం ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో ఆయన రాజకీయాల్లో, యుటిఎఫ్‌లో ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో అన్ని క్యాడర్ల టీచర్లను మూడు గ్రూపుల్లో వీలినం చేయటం కోసం చారిత్మాకంగా పనిచేశారు. రీ గ్రూపింగ్ ఆధారంగా ఆటోమెటిక్ అడ్వాన్స్‌మెంటు పే స్కేళ్ళను ఎన్‌టిఆర్‌ను ఒప్పించి ఉపాధ్యాయులకు ఇప్పించిన ఘనత ఆయనకే దక్కింది. భాషాపండితుల పట్ల ఆయనకు ప్రత్యేక అభిమానం ఉంది. ఆయనకు జిఓల రామిరెడ్డి అనే పేరు ఉంది. 1983లో వారికి అప్‌గ్రేడింగ్ జీవోలను సాధించిపెట్టారు. అసాధారణమైన జివోల పరిజ్ఞానంతో ఆయన 1950నుండి విడుదలైన ప్రభుత్వ ఉత్తర్వులన్నింటిని సంపూటలుగా ప్రచురించారు. ఉపాధ్యాయ సంఘాల తొలి డైరీని కూడా ఆయన రూపకల్పన చేశారు. వేలాది మంది ఉపాధ్యాయులను కార్యకర్తలుగా తీర్చిదిద్దటమే కాకుండా వారి కుటుంబాలతో మమేకం అయ్యారు. మొత్తంమీద ఆయన జీవితం ఉపాధ్యాయ ఉద్యమాలకే అంకితమైంది. జిల్లా ఉద్యమ కేరటం నెలకొరగటంతో ఉపాధ్యాయవర్గాలు శోకసముద్రంలో మునిగిపోయాయి.