ప్రకాశం

తాగునీటి సరఫరాను మెరుగుపర్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, మే 22: జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, నీటి సరఫరా మెరుగుపరచాలని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కలెక్టర్ వినయ్‌చంద్‌ను కోరారు. మంగళవారం ఉదయం ఎంపీ సుబ్బారెడ్డి కలెక్టర్‌ను కలిసి తాగునీటి సరఫరాపై చర్చించారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ జిల్లాలో ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో నీటిసమస్య తీవ్రంగా ఉన్నట్లు తెలిపారు. బిల్లులు సక్రమంగా చెల్లించకపోవటంతో ట్యాంకర్ల యజమానులు మంచినీటి సరఫరాకు ముందుకు రావటం లేదన్నారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో మరిన్ని ట్యాంకర్లతో నీటి సరఫరా సరఫరా జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బోర్లు ఎండిపోయిన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుని మంచినీటిని అందించాలని అధికారులకు సూచించారు. రైతుల వద్ద నిలువ ఉన్న కందులను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పశ్చిమ ప్రాంతంలో ఏర్పాటుచేసిన రెండు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరపాలని చెప్పారు. రైతులను దళారులకు వదిలేయకుండా గిట్టుబాటు ధర వచ్చేలా అధికారులు కృషి చేయాలన్నారు. నాలుగేళ్ల నుండి వచ్చిన నిధుల వినియోగంలో అధికారులు అలసత్వం వీడాలని కోరారు. ఇప్పటి వరకు వచ్చిన నిధులను వెంటనే ఖర్చుపెట్టాలని కోరారు. రాజీనామాలు ఆమోదిస్తే నిధులు వచ్చేఏడాదికి రావని, కాబట్టి అందుబాటులో ఉన్న నిధులకు వెంటనే ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కలెక్టర్‌కు సూచించినట్లు తెలిపారు. అనంతరం హెడ్ పోస్ట్ఫాస్ ఆవరణలో ఏర్పాటుచేసిన పాస్‌పోర్టు కార్యాలయాన్ని సందర్శించారు. ఈ కార్యాలయాన్ని ఏడాదిన్నర నుంచి పోరాడి సాధించినట్లు ఎంపీ తెలిపారు. జిల్లాప్రజలు పాస్‌పోర్టు కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లే పనిలేకుండా తేలిగ్గా పాస్‌పోర్టు పొందే అవకాశం కలిగిందన్నారు. తపాలా కార్యాలయం ఎదుట వేతన సవరణ కోసం ధర్నా చేస్తున్న గ్రామీణ డాక్‌సేవక్‌లకు ఎంపీ మద్ధతు తెలుపుతూ, వారి సమస్యలపై టెలికాంశాఖ మంత్రితో చర్చించి పరిష్కరించేలా చూస్తామన్నారు. ఏళ్లతరబడి అతితక్కువ వేతనాలతో పనిచేస్తున్న వారిపట్ల కేంద్రం సానుకూలంగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు బత్తుల బ్రహ్మానందారెడ్డి, చుండూరి రవిబాబు, కేవీ రమణారెడ్డి, వీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.