ప్రకాశం

వైకాపాలోనే కొనసాగుతా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, మే 3: తాను వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీలోనే కొనసాగుతానని మాజీమంత్రి, వైకాపా రాష్టన్రాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు. మంగళవారం తన స్వగృహంలో ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు . గతకొంతకాలం నుండి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ వీడుతారన్న ప్రచారానికి ఆయన ఫుల్‌స్ట్ఫా పెట్టారు. తాను ఎట్టి పరిస్థితుల్లోను వైకాపాను వీడేది లేదని వెల్లడించారు. తనపై వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు. తాను కాంగ్రెస్‌పార్టీలో మంత్రిగా పనిచేస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీలో చేరానని ఆయన వెల్లడించారు. వైకాపా రాష్ట్ర అధినేత వైఎస్ జగనమోహన్‌రెడ్డితో బాగున్నానని తెలిపారు. అసెంబ్లీ,పార్లమెంటు ఎన్నికల తరువాత తాను పార్టీకి దూరంగా ఉన్న మాట వాస్తవమేనని అయితే తాను వ్యక్తిగత కారణాల వలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జిల్లా, రాష్టప్రార్టీనాయకులతో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. యర్రగొండపాలెం శాసనసభ్యుడు పాలపర్తి డేవిడ్‌రాజు తెలుగుదేశంపార్టీ వైపు వెళ్లకుండా గట్టిప్రయత్నమే చేశానని ఆయన తెలిపారు. పార్టీలు మారే వారి ఉద్దేశాలు వేరుగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. వేరే పార్టీ నుండి గెలిచి మరో పార్టీకి వెళ్ళటం సరైంది కాదని అలాంటి వారికి ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర రవాణాశాఖమంత్రి శిద్దారాఘవరావు తనపై చేసిన అనవసర ఆరోపణలను ఆయన తీవ్రంగా స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్లు ,పార్టీ పెద్దలతో టచ్‌తో ఉన్నట్లు మంత్రి చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రిగా ఉండి ఇలాంటి ఆరోపణలు చేయటం సరికాదని ఆయన హితవుపలికారు. త్వరలోనే తాను క్రియశీలకంగా రాజకీయాల్లో ఉంటానని ఆయన కార్యకర్తలు, నాయకులకు భరోసా ఇచ్చారు. త్వరలో జరగనున్న ఒంగోలు కార్పోరేషన్ ఎన్నికల్లో పోరాటం చేసి గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను డబ్బుకోసం ఆశించి రాజకీయాల్లోకి రాలేదని కేవలం ప్రజలకు నిస్వార్ధంగాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. తాను ఏలాంటి ప్రలోభాలకు లొంగే వ్యక్తిని కాదని, ఎలాంటి పరిస్థితుల్లోను వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీని వీడేది లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.