ప్రకాశం

జిల్లాలో వేడెక్కుతున్న రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,జూలై 18: అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల రణరంగానికి సమయం దగ్గరపడుతున్న నేపధ్యంలో జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులు, ఇన్‌చార్జులు ఆయా నియోజకవర్గాల్లో గ్రామదర్శిని పేరుతో జిల్లావ్యాప్తంగా పర్యటించే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్రప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజాసంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ రానున్న ఎన్నికల్లోను తమకు సహకరించే పనిలో అధికారపార్టీ నేతలు ఉన్నారు. ప్రత్యేకహోదా అంశాన్ని తెరపైకి తీసుకువస్తూ కేంద్రప్రభుత్వం మోసం చేస్తున్న వివరాలను కూడా ప్రజలకు తెలుగుతమ్ముళ్లు వివరిస్తున్నారు. అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షమైన వైసిపి నేతలు కూడా రాష్ట్రప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
ప్రధానంగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రాజకీయాలు వేడెక్కాయి. ఒంగోలు శాసనసభ్యులు, జిల్లాతెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్ వర్సస్ ఒంగోలు పార్లమెంటు వైకాపా అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డిల మధ్య మాటల యుద్దం జరుగుతుంది. గత కొన్నిరోజులుగా బాలినేని ఒంగోలులో తిష్టవేసి ఒంగోలునగరంలో విస్తత్రంగా పర్యటిస్తూ పార్టీశ్రేణులను బలోపేతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. పనిలో పనిగా దామచర్లపై విమర్శలు సంధిస్తున్నారు. అభివృద్దిపనుల మంజూరులో కమీషన్లు తీసుకుంటున్నారంటూ దామచర్లపై బాలినేని ఆరోపణలు చేశారు. ఈనేపధ్యంలో తాను ఒంగోలు నియోజకవర్గ అభివృద్దికి ఎంతో కృషిచేస్తున్నానని, బాలినేని శాసనసభ్యునిగా ఉన్న సమయంలో అభివృద్ది ఎక్కడ చేశారంటూ దామచర్ల ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రధానంగా ఒంగోలు నగరం, ఒంగోలు రూరల్, కొత్తపట్నం మండలాల్లో అభివృద్ది పూర్తిస్ధాయిలో జరిగిందని, ఆ అభివృద్ది బాలినేనికి కనిపించటం లేదా అని దామచర్లతోపాటు, తెలుగుతమ్ముళ్ళు విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా కొత్తపట్నం మండలం పూర్తిస్ధాయిలో అభివృద్ది జరిగిందని బాలినేని శాసనసభ్యునిగా ఉన్న సమయంలో ఆ పనులు గుర్తుకురాలేదా అంటూ తెలుగుతమ్ముళ్ళు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఒంగోలు రాజకీయాలు వేడెక్కాయి. దామచర్ల వర్సస్ బాలినేని మధ్య మాటలు తూటల్లా పేలిపోతున్నాయి. కాగా కొత్తపట్నం మండలంలోని వరంలాంటిది అయిన నల్లవాగుపై బ్రిడ్జిని నిర్మించటం, నాలుగులైన్ల రహదారి, కొత్తపట్నం బీచ్ అభివృద్ది, బ్రిడ్జిలు, నూతన రోడ్ల నిర్మాణాలు దామచర్లకు ప్లస్‌పాయింట్‌గా మారాయనే చెప్పవచ్చు. ఈ అభివృద్ధిని కొత్తపట్నం మండల ప్రజల్లోకి దామచర్ల తీసుకువెళ్తున్నారు.
ఇదిలాఉండగా దర్శినియోజకవర్గంలోను రాష్ట్రఅటవీశాఖమంత్రి శిద్దారాఘవరావు ప్రత్యేక దృష్టి సారించారు.అందులోభాగంగా దర్శి నియోజకవర్గపరిధిలోని దర్శి, ముండ్లమూరు, తాళ్ళూరు, కురిచేడు, దొనకొండ మండలాలవారీగా తెలుగుతమ్ముళ్లు, మండల అధికారులతో మంత్రి సమీక్ష సమావేశాలు నిర్వహించే పనిలో నిమగ్నమయ్యారు. అదేవిధంగా గ్రామదర్శిని కార్యక్రమం కింద ప్రజలతో మంత్రి శిద్దా మమేకం అవుతున్నారు. ప్రధానంగా తాను నియోజకవర్గంలో రెండువేల కోట్లరూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేశానని, అదేవిధంగా రానున్న ఎన్నికల్లో తనను మళ్లీ గెలిపించాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేస్తున్నారు. తన చేసిన అభివృద్ధే మళ్లీ తనను గెలిపిస్తుందన్న ధీమాలో మంత్రి శిద్దా ఉన్నారు. అదేవిధంగా దర్శి నియోజకవర్గ వైకాపా ఇన్‌చార్జి బాదం మాధవరెడ్డి కూడా పార్టీని బలోపేతం చేసే పనిలో నిమగ్నవౌతున్నారు. నియోజకవర్గంలోని ఐదుమండలాలకు చెందిన కన్వీనర్లను మార్చేపనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లోను రాజకీయాలు వేడెక్కాయనే చెప్పవచ్చు. కందుకూరు నియోజకవర్గంలోనూ రాజకీయాల రూపురేఖలు మారాయి. మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి వైసిపిలో చేరటంతో అక్కడ పోటీ రసవత్తరంగా మారింది. మొత్తంమీద జిల్లావ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కుతున్నాయనే చెప్పవచ్చు.

తాగు, సాగు నీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నాం - మంత్రి శిద్దా రాఘవరావు
ముండ్లమూరు, జూలై 19 : రాష్ట్రంలో ముఖ్యమంత్రి నదుల అనుసంధానం చేపట్టి ప్రజలకు తాగునీటికి, సాగు నీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారని రాష్ట్ర అటవీశాఖా మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. గురువారం ముండ్లమూరు మండలంలోని భీమవరం గ్రామంలో జరిగిన గ్రామ దర్శిని - గ్రామ వికాస్ కార్యక్రమంలో మంత్రి శిద్దా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శిద్దా మాట్లాడుతూ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టును ఎన్నికల లోగా పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకున్నారని ఆయన తెలిపారు. గోదావరి నుండి సముద్రంలోకి వృధాగా పోయే 100 టిఎంసీల నీటిని పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణానదికి మళ్లించారన్నారు. రాష్ట్రంలో రూ.24 వేల కోట్లతో రైతులకు రుణ మాఫీ, రూ.12 వేల కోట్లతో డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ, ఆరు వేల కోట్ల రూపాయలతో పింఛన్లు పంపిణీ చేసారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పేదరికం లేని సమాజం నిర్మించడానికి ముఖ్యమంత్రి ప్రత్యేక చర్యలు తీసుకున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ , బీసీ, కాపు, బ్రాహ్మణ, వైశ్య కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు చేసారన్నారు. చంద్రన్న బీమా పథకం కింద ప్రమాదంలో మృతి చెందిన వారికి ఐదు లక్షల రూపాయలు, సహజ మరణానికి రెండు లక్షల రూపాయలు అందిస్తామని మంత్రి తెలిపారు. అంతే కాకుండా వైద్య రంగంలో ముఖ్యమంత్రి విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారన్నారు. తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ ఏర్పాటు చేసి తల్లిబిడ్డల సంరక్షణకు పెద్ద పీఠ వేశారన్నారు. దర్శి నియోజక వర్గ పరిధిలో రెండు వేల 500 కోట్ల రూపాయలతో గత 20 సంవత్సరాల కాలంలో జరగని అభివృద్ధిని నాలుగు సంవత్సరాల్లో చేసి చూపించామన్నారు. దర్శిలో రెండు కోట్ల రూపాయలతో పార్కును ఏర్పాటు చేశామన్నారు. రూ.18 కోట్లతో అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. కురిచేడులో రూ.30 కోట్లతో సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్సియల్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ముండ్లమూరు మండలంలో రూ.170 కోట్లతో సాగునీటి ఎత్తిపోతల పథకాలు నిర్మించి 14 వేల ఎకరాల భూమిని సాగులోకి తీసుకు వచ్చామన్నారు. భీమవరం గ్రామంలో మూడు కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. దర్శి నియోజక వర్గ పరిధిలోని అన్నీ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు నిర్మించేందుకు 39 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసారని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు నూరు శాతం పింఛన్లు, రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. భీమవరం గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. వృద్ధులకు పింఛన్లు వస్తున్నాయా.. లేదా.. అని అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ కాలనీలో ప్రజలు స్మశాన భూమికి వెళ్లేందుకు దారి చూపించాలని మంత్రిని కోరారు. బీమరం గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన కె పావని ఇద్దరు కుమార్తెలు అమూల్య, నాగ తులసీలకు ఒక్కొక్కరికి పది వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ముండ్లమూరు ఎంపీపీ మందలపు వెంకట్రావు, మండల పార్టీ నాయకులు సోమేపల్లి శ్రీనివాసరావు, మాజీ జడ్పీటీసీ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ కుంచే ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.