ప్రకాశం

అర్జీల పట్ల తక్షణమే స్పందించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్,జూలై 23:ప్రజల నుండి వచ్చే అర్జీల పట్ల తక్షణమే స్పందించి పరిష్కరించాలని కలెక్టర్ వి వినయ్‌చంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక సిపిఒ సమావేశ మందిరంలో మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల అర్జీలను స్వయంగా పరిశీలించి వాటి పరిష్కారానికి వివిధ శాఖలకు అధికారులకు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా జాయింట్‌కలెక్టర్-2 డి మార్కండేయులు, డిఆర్‌డిఎ పిడి ఎంఎస్ మురళీతోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

డిఆర్‌ఒకు బంగారు నాణెలు అప్పగింత
ఒంగోలు,జూలై 23: పెద్దారవీడు మండలం సానికవరం గ్రామంలో ఎద్దుల సత్యనారాయణరెడ్డికి చెందిన పొలంలో ఈనెల 20వతేదీ సాయంత్రం బయల్పడిన 103గ్రాములన్న 30 బంగారు నాణెలను మార్కాపురం ఆర్‌డిఒ పెంచలకిశోర్, పెద్దారవీడు తహశీల్దార్ బి దిలీప్‌కుమార్ సోమవారం స్థానిక సిపిఒ కాన్ఫరెన్స్‌హాలు వద్దకు వచ్చి జిల్లాకలెక్టర్ వినయ్‌చంద్‌కు చూపించి డిఆర్‌ఒకు అప్పగించారు.

నేడు వైకాపా బంద్
జయప్రదం చేయాలని పార్టీశ్రేణులకు బాలినేని పిలుపు
ఒంగోలు,జూలై 23:రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వకుండా మోసం చేసి నాటకాలు ఆడుతున్న కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ఈనెల 24న వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ తలపెట్టిన రాష్టబ్రంద్‌ను జయప్రదం చేయాలని ఆ పార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో జిల్లాప్రజలకు పిలుపునిచ్చారు. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ లోపాయికారి వ్యవహారాన్ని ప్రజలు గమనించినట్లు పేర్కొన్నారు. వీళ్ల నయవంచనకు తగని విధంగా బుద్ధి చెప్పాలన్నారు. మొట్టమొదటి నుండి తమ పార్టీనే హోదాకోసం పోరాడుతుందని గుర్తించుకోవాలని తెలిపారు. ఎన్నికల్లో లబ్ధికోసమే చంద్రబాబు సర్కారు ప్యాకేజి నుండి యూటర్న్ తీసుకుని హోదా అంటూ మరోసారి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధపడుతుందన్నారు. బంద్‌కు వామపక్షాలు, ప్రజాసంఘాలు మద్దతు పాల్గొనాలని ఆయన విజ్ఞప్తిచేశారు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని తమ నిరసన తెలపాలని మాజీ మంత్రి బాలినేని పిలుపునిచ్చారు.