ప్రకాశం

కేసుల త్వరితగత పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాల, మే 13: జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి 7.30 గంటల వరకు విజిబుల్ పోలిసింగ్ నిర్వహిస్తామని ఎస్పీ త్రివిక్రమవర్మ తెలిపారు. సాధారణ తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఆయన స్థానిక డిఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. రికార్డులను తనిఖీ చేసి పోలీసు అధికారులకు తగిన సూచనలందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా ప్రజలను ఇబ్బంది పెట్టేలా జరిమానాలు ఉండవన్నారు. అయితే నిర్దిష్ట ప్రణాళికతో వాహనాల తనిఖీ చేపడతామన్నారు. జిల్లాలో 2 జాతీయ రహదారులు, 13 రాష్ట్ర రహదారులున్నట్లు తెలిపారు. తక్కువ సంఖ్యలో ఉన్న సిబ్బందితో అన్ని రహదారులను పర్యవేక్షించడం ప్రయాసతో కూడిందన్నారు. అయినప్పటికీ వాటిపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తూ ప్రమాదాలను నివారణకు చర్యలు చేపడతామన్నారు. కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగిస్తామని తెలిపారు. చీరాల సబ్ డివిజన్ పరిధిలో ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. వ్యభిచారాన్ని నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు.
ఆటో డ్రైవర్లు పెద్దశబ్దంతో పాటలు పెట్టడం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అదే విధంగా ప్రజలు కూడా దొంగతనాలపై అవగాహన కలిగి తదనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. వేసవి సెలవులకు ఇతర ప్రాంతాలకు వెళ్లేటపుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు చిన్నపాటి జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి చీరాల వచ్చిన ఆయన్ను కలిసిన వారిలో సి ఐలు నిమ్మగడ్డ సత్యనారాయణ, పరంధామయ్య, అల్త్ఫా హుస్సేన్ ఉన్నారు.