ప్రకాశం

కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ఏమైంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, సెప్టెంబర్ 21 : ప్రస్తుత శాసన మండలి సమావేశాల్లో ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రకాశం జిల్లాలో కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుపై ప్రశ్నించారు. ప్రకాశం జిల్లాలో జనాభా 38 లక్షలకు పెరిగిందని, జిల్లాలో కేవలం మూడు రెవెన్యూ డివిజన్లు మాత్రమే ఉన్నాయని, డివిజన్ హెడ్ క్వార్టర్‌కు వెళ్ళేందుకు ప్రజలు చాలా దూరం వెళ్ళాల్సి వస్తోందన్నారు. దీంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కనుక కనీసం మరో మూడు కొత్త డివిజన్లు ఏర్పాటు అవసరం ఎంతైనా ఉందన్నారు. 1970 ఫిబ్రవరి 2న ఒంగోలు జిల్లా గా ఏర్పడి ఆ తరువాత 1972లో ప్రకాశం జిల్లాగా పేరు మార్చి సుమారు 48 సంవత్సరాలు అయ్యిందని తెలిపారు. మూడు జిల్లాల నుండి మూడు డివిజన్లు తీసుకున్నారని, అవి కర్నూలు నుండి మార్కాపురం, నెల్లూరు నుండి కందుకూరు, గుంటూరు నుండి ఒంగోలు ఈ మూడు డివిజన్లు కలిపి 48 సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లా గా ఏర్పాటు చేశారన్నారు. అందులోని 56 మండలాల్లోని జనాభా సుమారు 38 లక్షల మంది ఉన్నారని తెలిపారు. ఈ మూడు రెవెన్యూ డివిజన్ల కు చాలా అసౌకర్యం కలుగుతుందని తెలిపారు. ఉదాహరణకు దర్శి నియోజక వర్గం నుండి ప్రజలు కందుకూరు డివిజన్‌కు వెళ్ళాలంటే సుమారు 200 కిలో మీటర్లు వెళ్ళాల్సి వస్తుందని, కనుక మీ ద్వారా డిప్యూటీ ముఖ్యమంత్రి కె ఈ క్రిష్ణమూర్తిని కోరేదేమింటంటే ప్రకాశం జిల్లాలో మూడు డివిజన్లను ఆరు రెవెన్యూ డివిజన్లుగా పెంచితే అక్కడ ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని కోరారు. ఇందుకు రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి సమాధానం చెబుతూ రాష్ట్రంలో ప్రస్తుతం 61 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయని, మాగుంట శ్రీనివాసులరెడ్డి చెప్పినట్లు ఎప్పుడైతే కొత్త రాష్ట్రం ఏర్పడిందో అప్పుడే రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కొత్త ప్రతిపాదనలు వచ్చాయని, ఈ ప్రతిపాదనలను సిసియల్‌కి, ప్రభుత్వానికి పంపించామన్నారు. ఆ తరువాత క్యాబినెట్‌లో కూడా చర్చించామన్నారు. ఆ తరువాత ప్రజా ప్రతినిధుల నుండి మరికొన్ని ప్రతిపాదనలు వచ్చాయన్నారు. వాటిపై కూడా సిసియల్ ఏ ని వివరాలు కోరామని తెలిపారు. ఈ కొత్త రెవెన్యూ డివిజన్ల ప్రతిపాదనలపై ఆర్థిక భారం ఎంత ఉంటుందో తెలియజేయాలని ఈ నెల 7వ తేదిన సిసియల్ ఏ కోరారన్నారు. అదీ కాకుండా పొన్నూరు, అద్దంకి, కుప్పం, పొద్దుటూరు వీటిని కూడా కొత్త డివిజన్లు చేయాలని ప్రతిపాదనలు వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం వాటిలో 16 కొత్త డివిజన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. దానిలో శ్రీకాకుళంలోని పాతపట్నం, విజయనగరంలో బొబ్బిలి, చీపురుపల్లి, విశాఖపట్నంలో చింతపల్లి, రంపచోడవరం, తూర్పు గోదావరి లో భీమవరం, కృష్ణాలో నందిగామ, గుంటూరులో బాపట్ల, ప్రకాశం లో మార్టూరు , దర్శి ఇవే కాకుండా బద్వేలు, గుంతకల్లు, పత్తికొండ ఇవన్నీ ప్రతిపాదనల్లో ఉన్నట్లు సమాధానం ఇచ్చారు. ఈ ప్రతిపాదనలను క్యాబినెట్ లో చర్చించామన్నారు. వీటన్నింటిపై ఆర్థిక భారం ఎంత ఉంటుందో తెలియజేయాల్సిందిగా సిసియల్ ఏ ని కోరామన్నారు. ఆ వివరాలు వచ్చిన వెంటనే వీలైనంత త్వరగా చేసేందుకు అవకాశం ఉంటుందని ఉపముఖ్యమంత్రి కృష్ణమూర్తి మాగుంట అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు.
నిమజ్జనానికి తరలిన గణనాథుడు

యద్దనపూడి, సెప్టెంబర్ 21: గత తొమ్మిది రోజులు నుంచి వినాయక చవితి సందర్భంగా జరుగుతున్న నవరాత్రి ఉత్సవాలు ముగిసిన అనంతరం వినాయకుని నిమజ్జన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. మండలంలోని చింతపల్లిపాడు గ్రామంలో అర్చకులు నారాయణం శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు అందుకున్న గణనాధుడు తొమ్మిదో రోజు పూర్ణాహుతి కార్యక్రమం అనంతరం తప్పెట్లు, వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహిస్తూ, మహిళలు , యువకులు వసంతాలు చల్లుకుంటూ కేరింతలతో నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని, స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.