ప్రకాశం

ఫ్లోరైడ్ ప్రాంతాలపై ఎంపి సుబ్బారెడ్డి దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,మే 13:జిల్లాలోని ఫ్లోరైడ్ గల ప్రాంతాలతోపాటు, పశ్చిమప్రాంతంలో నెలకొన్న మంచినీటి ఎద్దడిని నివారించేందుకు ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు. గతంలో ఈ విషయాన్ని కేంద్రప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఫలితాలను సాధించారు. అందులోభాగంగా జిల్లా ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ రమేష్, ఫ్లోరోసిస్ టీం సభ్యులు సత్యనారాయణతో శుక్రవారం రాత్రి తన కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో తాగునీటి అవసరాలు, ఫ్లొరోసిస్ పాంతాల్లో సురక్షితమైన తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని అందుకు సంబంధించి యాక్షన్ ప్లాన్‌ను తయారుచేయాలని అధికారులను ఆదేశించారు.జిల్లాలో 56మండలాలు ఉండగా వాటిలో 14మండలాల్లో ఫ్లోరోసిస్ సమస్య తీవ్రంగా ఉందని ఈ ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటిని అందించే విషయంపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. కేంద్రం కూడా ఆయాప్రాంతాలకు సురక్షితమైన నీటిని అందించేందుకు నిధులను మంజూరుచేసేందుకు సుముఖంగా ఉందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ప్రధానంగా పశ్చిమప్రాంతంలో మంచినీటి సమస్య జఠిలంగా ఉందని అందువలన ఆయాప్రాంతాల్లో మంచినీటి ట్యాంకర్ల ద్వారా నీటినిసరఫరా చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కేంద్రప్రభుత్వం ఇటీవల మంజూరుచేసిన నానోవాటర్‌బేస్ టెక్నాలజి పధకాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి అధికారులకు సూచించారు. జిల్లాకు వచ్చిన ప్రతిసారి ఒక్కొక్క అంశంపై ఆయన ప్రత్యేక దృష్టిసారిస్తూనే ఉన్నారు. గతంలో పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈవిషయాన్ని కేంద్రప్రభుత్వందృష్టికి తీసుకువెళ్ళి పొగాకురైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవటం జరిగింది. మొత్తంమీద జిల్లాసమస్యలపై ఎంపి సుబ్బారెడ్డి ప్రత్యేక దృష్టిసారిస్తూనే ఉన్నారు.