ప్రకాశం

దర్శి వైకాపా అభ్యర్థి రేసులో మద్దిశెట్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,నవంబర్ 12: దర్శి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి రేసులో మద్దిశెట్టి వేణుగోపాల్ ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఆ మేరకు దర్శి నియోజకవర్గంనుండి ఆయనే పోటీచేస్తారని మద్దిశెట్టి సమీపబంధువు ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. దీంతో రానున్న ఎన్నికల్లో మద్దిశెట్టి పోటీచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గతంలో దర్శి నియోజకవర్గంనుండి ప్రజారాజ్యంపార్టీ తరుపున మద్దిశెట్టి వేణుగోపాల్ పోటీచేసి ఒటమీపాలైనారు. అప్పటినుండి రాజకీయాలకు దూరంగా వేణుగోపాల్ ఉంటూ వస్తున్నారు. మారిన రాజకీయ పరిస్ధితుల నేపధ్యంలో వైకాపాతరుపున పోటీచేసేందుకు ఆయన సుముఖంగా ఉన్నట్లు ఆయన సమీపబంధువుల ద్వారా సమాచారం.
గతకొంతకాలంనుండి జనసేనపార్టీతరుపున మద్దిశెట్టి పోటీచేస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. జనసేనతరుపున పోటీచేయాలని కొంతమంది జనసేన ముఖ్యనాయకులు మద్దిశెట్టికి సూచించినట్లు తెలుస్తొంది. కాని తాను వైకాపా తరుపునే పోటీచేస్తానని మద్దిశెట్టి సూత్రప్రాయంగా తిరస్కరించినట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం.
దీంతో దర్శి నియోజకవర్గంలో రాజకీయ ముఖచిత్రం మారిపోయే అవకాశాలున్నాయి. దర్శి నియోజకవర్గంలో రెడ్లు, కాపులు ఎక్కువుగా ఉన్నారు. ఈనేపధ్యంలో ఆరెండు వర్గాలకు చెందిన ఓటర్లతోపాటు మిగిలిన వర్గాలు కూడా తమకు మద్దతు పలికితే తమ గెలుపుఖాయమన్న ధీమాలో మద్దిశెట్టి ఉన్నట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం. గతంలో కాపు సామాజికవర్గానికి చెందిన వారు ఎక్కువుగా తెలుగుదేశంపార్టీకి మద్దతు ప్రకటించారు. ఈనేపధ్యంలో మద్దిశెట్టికే కాపు సామాజికవర్గం మద్దతు తెలుపుతుందా లేక జనసేన తరుపున పోటీచేసే అభ్యర్ధికి మద్దతు తెలుపుతుందా అన్న చర్చకూడా ఆయాపార్టీలనుండి వినిపిస్తొంది.
ఇదిఇలాఉండగా మాజీ శాసనసభ్యులు బూచేపల్లి సుబ్బారెడ్డి కుటుంబం దర్శి నియోజకవర్గంలో కీలకం మారనుంది. తన తండ్రి సుబ్బారెడ్డి ఆరోగ్యం పూర్తిస్ధాయిలో మెరుగుపడిన వెంటనే బూచేపల్లి శివప్రసాదురెడ్డి కూడా ఎన్నికల్లో పోటీచేసే అవకాశాలు లేకపోలేదన్న వాదన ఆపార్టీనేతలనుండే వినిపిస్తొంది. మొత్తంమీద బూచేపల్లి పోటీచేయకపోతే మాత్రం మద్దిశెట్టికి సంపూర్ణమద్దతు తెలిపే అవకాశాలున్నట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం. కాగా రాష్ట్రంలోనే తొలిసారిగా దర్శి నియోజకవర్గ వైకాపా అభ్యర్ధిగా బాదం మాధవరెడ్డిని ప్రకటించారు. కాని మారిన రాజకీయ పరిస్ధితుల నేపధ్యంలో బాదం పోటీచేసేందుకు విముఖత చూపటంతో తాత్కాలిక ఇన్‌చార్జీగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డిల నియమించటం జరిగింది. ఈనేపధ్యంలో బాలినేని దర్శి నియోజకవర్గంలో జరిగే పలు పార్టీకార్యక్రమాల్లో పాల్గొని పార్టీని పురోభివృద్దిబాటలో పయనింపచేసేందుకు కసరత్తులు చేస్తున్నారు.
ఇదిఇలాఉండగా దర్శి నియోజకవర్గంనుండి రాష్ట్ర అటవీశాఖమంత్రి శిద్దా రాఘవరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో సుమారు మూడువేల కోట్లరూపాయలకు పైగా నిధులను తీసుకువచ్చి అభివృద్ది చేయటం జరిగింది. దీంతో తన గెలుపు నల్లేరుమీద నడకన్న ధీమాలో మంత్రి శిద్దా ఉన్నారు. మొత్తంమీద రానున్న ఎన్నికల్లో విజయలక్ష్మి ఏవరిని వరిస్తుందో వేచిచూడాల్సిఉంది.