ప్రకాశం

మేజర్ నియోజకవర్గాల్లో వైకాపా ఇన్‌చార్జీల మార్పు తధ్యమేనా ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, నవంబర్ 15 : జిల్లాలోని మేజర్ నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న వైకాపా ఇన్‌చార్జీలను మార్చే ఆలోచనలో రాష్ట్ర పార్టీ ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా సమాచారం. ఆ మేరకు పార్టీ ముఖ్య నేతలు గెలుపుగుర్రాల వేటలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి చివరిలో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉండటం, కేవలం స్వల్వవ్యవధి మాత్రమే ఉండటంతో జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఆర్ధిక, అంగబలం ఉన్న నేతలను ఎంపికచేసే ప్రక్రియలో వైకాపా ముఖ్యనేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఇన్‌ఛార్జీలను మార్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వాటిలోని మేజర్ నియోజకవర్గాలకు అభ్యర్ధులను మార్చే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా పశ్చిమ ప్రకాశంలోని మూడు నియోజకవర్గాలు, తూర్పు ప్రకాశంలోని మూడు నియోజకవర్గాల్లో అభ్యర్ధుల మార్పు ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఆ నియోజకవర్గాల్లో కొత్త ముఖాలను తెరపైకి తెచ్చేప్రయత్నంలో ముఖ్యనేతలు ఉన్నట్లు సమాచారం. రానున్న ఎన్నికలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్య కావడంతో ప్రతి నియోజకవర్గం కీలకమే. గతంలో చేసిన తప్పిదాలను ఈ సారి జరగకుండా ఉండేందుకు అభ్యర్థుల ఎంపికలో వడపోత కార్యక్రమాల్లో వైకాపా ముఖ్యనేతలు ఉన్నట్లు సమాచారం.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు కొన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు లేకపోవడంపై సర్వత్రా పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దర్శి నియోజకవర్గంలో ప్రస్తుతం తాత్కాలిక ఇన్‌చార్జీగా మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ నేపధ్యంలో కొత్త అభ్యర్థి ఎంపికలో రాష్ట్ర పార్టీ తలమునకలై ఉంది. మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తాను పోటీ చేయలేనంటే విద్యాసంస్థల అధినేత మద్దిశెట్టి వేణుగోపాల్‌ను రంగంలోకి దించనున్నారు. అదేవిధంగా చీరాల నియోజకవర్గంలో కొనసాగుతున్న యడం బాలాజీ స్థానంలో అంగ, ఆర్థిక బలం ఉన్న నాయకులను ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకోవాలా లేక జిల్లాలో ఉన్న నేతలకే ప్రాధాన్యత కల్పిస్తారా అన్న చర్చ సాగుతోంది. అద్దంకి నియోజకవర్గంలో ప్రస్తుతం ఇన్‌చార్జీగా బాచిన చెంచుగరటయ్య ఉన్నారు. రాజకీయ పరిస్థితులు మారి తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్యనేత వైకాపా గూటికి చేరితే మాత్రం ఆయనకే అద్దంకి సీటును కేటాయించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా సమాచారం. అదేవిధంగా పర్చూరు నియోజకవర్గంలోను రాజకీయ సమీకరణలు మారే అవకాశాలు ఉన్నాయి. పర్చూరులో బీజేపీకి చెందిన ఒక సీనియర్ నేత కుమారుడు రంగంలోకి దిగితే ఆయనకే టిక్కెట్ దక్కనున్నట్లు సమాచారం. సంతనూతలపాడు నియోజకవర్గానికి ప్రస్తుతం ఇన్‌చార్జీగా కొనసాగుతున్న టిజెఆర్ సుధాకర్‌బాబు గుంటూరు జిల్లాకు చెందిన నేత. ఈ నేపధ్యంలో స్థానికంగా ఉండే నేతలకే ప్రాధాన్యత కల్పిస్తారా లేక టిజెఆర్‌కే అవకాశం కల్పిస్తారా అన్న చర్చ సాగుతోంది. ప్రధానంగా సంతనూతలపాడు నియోజకవర్గానికి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నుంచి వైకాపా గూటికి చేరిన పక్షంలో ఆయనకే టిక్కెట్ దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మాజీ ఎమ్మెల్యేకు వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం. గిద్దలూరు నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న ఇన్‌చార్జీని మారుస్తారా లేక కొత్తవారికి అవకాశం కల్పిస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తంమీద బలమైన అభ్యర్థుల వేటలో వైకాపా ముఖ్యనేతలు ఉండటంతో రానున్న ఎన్నికల్లో కొత్తముఖాలు తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
పంటలు చేతికందేవరకు నీరు ఇవ్వాల్సిందే
* అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్ * జిల్లా వాటానీటి విడుదలకు చర్యలు * జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ వెల్లడి
సంతమాగులూరు, నవంబర్ 15: అద్దంకి బ్రాంచి కెనాల్ పరిధిలో ఇప్పటివరకు నాట్లు పూర్తి చేసుకున్న పైర్లు రైతు చేతికందేవరకు సాగర్ జలాలు అందించాల్సిందే అని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్‌ను కోరారు. అద్దంకి బ్రాంచికెనాల్ ఆయకట్టు రైతుల సాగునీటి సమస్య పరిస్కారాన్ని ప్రాధాన్యత అంశంగా తీసుకున్న అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్ వరుసగా గురువారం కూడా కాలువ జిల్లా సరిహద్దు ప్రారంభమయ్యే 18/0 మైలు వద్ద జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్‌తో కలిసి జిల్లాకు అందుతున్న నీటి పరిమాణాన్ని పరిశీలించారు. 18/0కు గుంటూరు జిల్లా నుంచి 1202 క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో అక్కడే నడుస్తున్న జయలక్ష్మి పవర్‌ప్లాంట్‌ను తక్షణమే నిలిపివేసి నీరు త్వరితగతిన దిగువకు చేరేవిధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినయ్‌చంద్ సాగర్ ఆయకట్టు అధికారులను ఆదేశించారు. 18/0 నుంచి 32వ మైలు వరకు కాలువపై పర్యటించిన అధికారులు, ఎమ్మెల్యే రవికుమార్ మేజర్లకు విడుదలవుతున్న నీటిని పరిశీలించారు. పలు మేజర్ల వద్ద నీటి విడుదలపై జరుగుతున్న జాప్యం, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్‌ను రవికుమార్ సమక్షంలో నిలదీశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ జిల్లాకు కేటాయించిన నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశామని, రైతులకు వీలైనంతవరకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసకుంటున్నట్లు తెలిపారు. అద్దంకి బ్రాంచి కెనాల్‌పై నీటి సరఫరా పర్యవేక్షణకు నియమించిన ప్రత్యేక అధికారి కృష్ణవేణి మాట్లాడుతూ కాలువపై నీటి పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాత్రింబవళ్లు కాలువపై పెట్రోలింగ్ నిర్వహించి దిగువ భూములకు కూడా నీరు చేరేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, తహశీల్దార్ నెహ్రూబాబు, ప్రత్యేక అధికారి కృష్ణవేణి, మండల నాయకులు, ఎంపీపీ సనె్నబోయిన ఏడుకొండలు, ఓరుగంటి కోటిరెడ్డి, చంతా రామారావు, బొమ్మిరెడ్డి శేషిరెడ్డి, అడవి శ్రీనివాసరావు, ముచ్చునూరి శ్రీనివాసరెడ్డి, బండి కోటిరెడ్డి, కారసాని వెంకటకోటిరెడ్డి, జిర్రా విజయబాబు, ఆయకట్టు రైతులు వందలాదిగా పాల్గొన్నారు.

ఎట్టకేలకు గ్రంథాలయ పాలక వర్గం నియామకం
*చైర్మన్‌గా వెంకట సుబ్బారావు *ఆరుగురు సభ్యులతో పాలక వర్గం

ఒంగోలు, నవంబర్ 15 : రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు జిల్లా గ్రంథాలయ సంస్థ పాలక వర్గాన్ని గురువారం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా యలగాల వెంకటసుబ్బారావును నియమించగా సభ్యులుగా ఆరుగుర్ని నియమించింది. కనిగిరి ప్రాంతానికి చెందిన కండ్రా మల్లికార్జున్‌రావు, దర్శికి చెందిన గొట్టిపాటి వెంకటేశ్వర్లు, గిద్దలూరు ప్రాంతానికి చెందిన సయ్యద్ రసూల్, మార్టూరు నుండి తాళ్లూరు మరియమ్మ , కొరిశపాడు నుండి రావి ప్రభావతి, వేటపాలెంకు చెందిన కెవిడి మల్లికార్జున్‌రావును ప్రభుత్వం సభ్యులుగా నియమించింది. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన చైర్మన్, సభ్యులు మాట్లాడుతూ తమ పై రాష్ట్ర ప్రభుత్వం ఉంచిన బాధ్యత ను పూర్తి స్థాయిలో నిర్వర్తించి జిల్లా లో గ్రంధాలయాల ప్రతిష్టకు కృషి చేస్తామన్నారు. తమను జిల్లా గ్రంథాలయ సంస్థ సభ్యులుగా ఎంపిక చేసేందుకు కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటి శాఖా మంత్రి నారా లోకేష్, విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు, అటవీశాఖా మంత్రి శిద్దా రాఘవరావు, మున్సిపల్‌శాఖా మంత్రి పి నారాయణ, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు , ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్థన్, ఎమ్మెల్సీలు మాగుంట శ్రీనివాసులరెడ్డి, కరణం బలరాం కృష్ణమూర్తిలకు ధన్యవాదాలు తెలిపారు. గ్రంధాలయంలో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.