ప్రకాశం

ఉపాధి పనులు కల్పించి వలసలు నివారిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెలిగండ్ల, నవంబర్ 18: మండలంలోని 21 పంచాయతీల్లో ఉపాధి పనులు కల్పించి వలసలు నివారిస్తామని జిల్లా డ్వామా అడిషనల్ డైరెక్టర్ భవాని తెలిపారు. ఉపాధిహామీ పథకం 10వ సామాజిక తనిఖీ ప్రజావేదిక స్థానిక మండల కార్యాలయంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని కౌలు భూముల్లో రైతులు పండ్ల తోటల పెంపకం చేయకూడదన్నారు. భూమి యజమానులు మాత్రమే పండ్లతోట పెంపకానికి అర్హులని అన్నారు. జూన్ 2017 నుంచి మార్చి 2018 వరకు మండలంలో రూ.3.38 కోట్లతో ఉపాధి పనులు జరిగినట్లు ఆమె తెలిపారు. వాటికి సంబంధించి గ్రామాల్లో సామాజిక తనిఖీ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించిన లోటుపాట్లను ప్రజావేదికలో వెల్లడించారు. పంచాయతీరాజ్, అటవీశాఖ వారు తనిఖీ బృందానికి రికార్డులు ఇవ్వలేదని తెలిపారు. ఇమ్మడిచెరువులో సంవత్సరం నుంచి పనులు కల్పించలేదని ఎంపీపీ జయరామిరెడ్డి ఆరోపించారు. మోటుపల్లిలో నీటి కుంటలు నిర్మిస్తే నేటికీ బిల్లులు చెల్లించలేదని ముక్కు వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. పద్మాపురం నుంచి మొగుళ్లూరు వరకు రోడ్డుకు ఇరువైపులా 700 మొక్కలు నాటగా కేవలం 400 మొక్కలే బతికినట్లు తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాల్లోని రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు ఎక్కువ నిధులు ఇచ్చినట్లు భవాని తెలిపారు. మోటుపల్లిలో హైదరాబాద్‌లో చదువుకుంటున్న వారికి ఉపాధిహామీ నగదు చెల్లించినట్లు ఆ గ్రామస్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు సుధాకర్, టిఏలు, ఎఫ్‌ఏలు, సామాజిక తనిఖీ బృందం సభ్యులు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.