ప్రకాశం

వైభవంగా అయ్యప్ప పడిపూజ కార్యక్రమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శి, నవంబర్ 19 : హరిహర సుత అయ్యప్పస్వామి వారి పడిపూజా కార్యక్రమం సోమవారం అద్దంకి రోడ్డులోని కాకి ఆంజనేయస్వామి ఇంటి వద్ద వైభవంగా నిర్వహించారు. అయ్యప్పస్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన అరటి మండపాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. అద్దంకికి చెందిన వౌలాలి గురుస్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేలాది మంది అయ్యప్పలు పాల్గొన్న ఈ పడి పూజా కార్యక్రమంలో అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. స్వామియే శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప మాలలు ధరించిన అయ్యప్ప భక్తులు స్వామి వారి కీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. అనంతరం స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

గ్రంథాలయాల అభివృద్ధికి కృషి
* జిల్లా గ్రంథాలయ చైర్మన్ వైవీ సుబ్బారావు
ఒంగోలు అర్బన్, నవంబర్ 19 : గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా గ్రంథాలయ చైర్మన్ వైవీ సుబ్బారావు అన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్‌గా వైవీ సుబ్బారావు సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ 2007వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పంచాయతీలు, మున్సిపాలిటీల ద్వారా రావాల్సిన రూ.12 కోట్ల రూపాయల సెస్‌ను రాబట్టే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థులు, యువతకు ఉపయోగపడే విధంగా గ్రంథాలయాలను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. తనకు పదవి వచ్చేందుకు సహకరించిన రాష్ట్ర మంత్రులు శిద్దా రాఘవరావు, గంటా శ్రీనివాసరావు, పొంగూరు నారాయణ, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, కరణం బలరామ కృష్ణమూర్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ కార్యదర్శి వెన్నా పోలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వైవీ సుబ్బారావుకు అభినందనలు తెలిపారు.