ప్రకాశం

దళితులు ఐకమత్యంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్చూరు, ఫిబ్రవరి 20:రాష్ట్రంలోని దళితులందరూ ఐకమత్యంగా మెలగాలని ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ కారెం శివాజీ పిలుపునిచ్చారు. బుధవారం పర్చూరు విచ్చేసిన చైర్మన్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం ఇంకొల్లు రోడ్డులోని రోటరీ భవన్ వరకు ర్యాలీగా తరలివెళ్ళారు. ఏపీ దళిత మహాసభ ఆధ్వర్యంలో దళిత చైతన్య సదస్సు జరిగింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న కారెం శివాజీ మాట్లాడుతూ తిరుగుబాటు చేయడం ద్వారానే హక్కులు సాధించుకోవచ్చని చెప్పారు. ఇటీవల కేంద్రప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుకార్చే ప్రయత్నం చేసిందని చెప్పారు. దళితులందరూ తిరుగుబాటు చేయడం ద్వారా కేంద్రం చట్టసభల్లో చట్టం చేశారని చెప్పారు. ఇందుకోసం దళితులందరూ సమైక్యంగా గుంటూరు, రాజమండ్రి భారీ సభలు ఏర్పాటుచేసి సాధించుకుందామని చెప్పారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ త్యాగశీలి అని బోధించు, సమీకరించు, పోరాడు అంబేద్కర్ భావజాలాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని చెప్పారు. అంబేద్కర్ ప్రపంచ మేధావి అని భారత రాజ్యాంగం రచించి దళితులకు హక్కులు కల్పించారని అన్నారు. స్వాతంత్య్రానికి ముందే మహిళలకు, దళితులకు ఓటుహక్కు కల్పించాలని బ్రిటీషువారితో పోరాటం చేశారని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి 72 సంవత్సరాలు అయినా దళిత ప్రజల్లో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను చదివించి వారిలో ఐక్యతాభావాలను పెంపొందించాలని తెలిపారు. స్వార్ధపూరిత జీవితాలను విడనాడి ఆపదలో ఉన్నవారిని అక్కరకు చేర్చుకోవాలని తెలిపారు. దళిత ప్రజలందరూ ఐక్యంగా ఉంటే రాజ్యాధికారం సాధించుకోవచ్చని తెలిపారు. ఈ సదస్సులో దళిత సంఘాల నాయకులు పి. ఆంజనేయప్రసాద్, కె. ఇస్సాకు, ఆంజనేయులు, సంపత్‌కుమార్, ఎం. కిషోర్, పి. రవి, ఎం గురునాధం, మోహన్‌ధర్మా, చిన నాగేశ్వరరావు, జ్వాలా, పున్నారావు, రాఘవులు తదితరులు పాల్గొన్నారు.

దళితుల సంక్షేమం అంటే మాలల సంక్షేమమేనా
* మందృ కృష్ణమాదిగ
టంగుటూరు, ఫిబ్రవరి 20: దళితుల సంక్షేమం అంటే మాలల సంక్షేమంగా మారిందని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విమర్శించారు. టంగుటూరు పట్టణంలోని అరుంధతీనగర్‌లో బుధవారం రాత్రి ఎమ్మార్పీఎస్ సభ జరిగింది. ఈ సభకు డొక్కా తిరుమలరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిధిగా పాల్గొన్న మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ మాదిగజాతి ఉనికిని చాటుకోవడానికి గుంటూరులో తలపెట్టిన మహాసభ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుమతి ఇవ్వకుండా మాదిగలపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో చంద్రబాబుకు త్వరలో పుట్టగతులు లేకుండా చేస్తామన్నారు. కొండేపి నియోజకవర్గ ఎమ్మెల్యే సీటును మాదిగలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నాలుగు శాఖలకు నలుగురు మాలలే ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో క్రిష్ట్ఫర్, ఆర్ చంద్ర, శ్యాం, భిక్షాలు, ఆశీర్వాదం, సుబ్బారావు, కోటయ్య, జాన్‌బాబు, రాజు, జయరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత బొమ్మలసెంటర్ నుంచి బాణాసంచా కాల్చుకుంటూ అరుంధతీనగర్ వరకు భారీర్యాలీ నిర్వహించారు. సభాప్రాంగణంలోని అంబేద్కర్, జగజ్జీవన్‌రాం విగ్రహాలకు మందృ కృష్ణమాదిగ పూలమాలలు ఘనంగా నివాళులర్పించారు.

వీరజవాన్‌కు ఘనంగా నివాళి
గిద్దలూరు, ఫిబ్రవరి 20 : గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి చెందిన షేక్ బికారిసాహేబ్ (34) కాశ్మీర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై హైదరాబాద్‌లో చికిత్సపొందుతూ మంగళవారం మృతిచెందాడు. ఈయన కాశ్మీర్‌లో జవాన్‌గా పనిచేస్తూ ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన మృతదేహాన్ని బుధవారం స్వగ్రామమైన ముండ్లపాడుకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పాల్గొని వీరజవాన్ బికారిసాహేబ్ పార్థీవదేహంపై పుష్పగుచ్ఛాన్ని వుంచి గౌరవవందనం చేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట ముండ్లపాడు తాజామాజీ సర్పంచ్ కడియం శేషగిరిరావు, కృష్ణ, ప్రభాకర్, అహ్మద్, మండ్లా బుజ్జి తదితరులు పాల్గొన్నారు.