ప్రకాశం

ధర్మవరంలో కత్తులతో ఇరువర్గాల దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అద్దంకి, జూలై 4: ఆస్తి విషయంలో బావ-బావమరుదుల కుటుంబాల మధ్య జరిగిన తగాదా తీవ్రరూపం దాల్చి కత్తులు, వేటకొడవళ్లతో నరుక్కునే వరకు వచ్చింది. వివరాల ప్రకారం ధర్మవరం గ్రామానికి చెందిన దేవరాల పెద్ద రామాంజనేయులు, తాళ్ళూరి అంజయ్య కుటుంబాల మధ్య ఆస్తి విషయంలో వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపధ్యంలో వివాదం ఘర్షణగా మారి ఇరువర్గాలకు చెందిన వారు కత్తులు, వేటకొడవళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో తాళ్ళూరి అంజయ్య, దేవరాల పెద్ద రామాంజనేయులుకు తీవ్రగాయాలతో రక్తమోడుతున్న దేహాలతో ఉండగా సమాచారం అందుకున్న 108వాహనం వారు క్షతగాత్రులు అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనలో తీవ్రగాయాలైన వారిరువురిని మెరుగైన వైద్యచికిత్సల కోసం ఒంగోలుకు తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు అద్దంకి పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.