ప్రకాశం

పొగాకు వేలం కేంద్రాల్లో వ్యాపారుల సిండికేట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూలై 4: జిల్లాలోని పొగాకు బోర్డు వేలం కేంద్రాల కొనుగోళ్లలో పొగాకు వ్యాపారులు సిండికేట్ అవుతుండటంతో పొగాకు ధరలు పెరగకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో 20 రోజుల్లో జిల్లాలోని 12 పొగాకు బోర్డు వేలం కేంద్రాలల్లో పొగాకు కొనుగోళ్లు ముగిసే దశకు చేరినప్పటికీ జిల్లాలో ఒక కేజి పొగాకుకు సగటు ధర 112 రూపాయలకు మించి ధర రావటం లేదు, అదే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఒక కేజికి సగటు ధర 122 రూపాయలు ధర వస్తుండగా, జిల్లాలో మాత్రం ఒక కేజికి 112 రూపాయలు ధర మించి రావటం లేదు. వ్యాపారులు సిండికేట్ కావటం కారణంగానే రైతులకు గిట్టుబాటు ధరలు రావటం లేదని రైతులు వాపోతున్నారు. పొగాకు వ్యాపారులు ఒకటి రెండు పొగాకు బేళ్లకు మాత్రం నాణ్యమైన పొగాకు ఒక కేజికి 150 రూపాయలు వరకు ధర ఇచ్చి మిగిలిన పొగాకుకు లోగ్రేడ్, మధ్యరకం పొగాకు అంటూ , నాణ్యత సరిగా లేదంటూ ధరను బాగా తగ్గించి వ్యాపారులు కొనుగోళ్లు చేస్తున్నట్లు పొగాకు రైతు సంఘం అధ్యక్షులు దుగ్గినేని గోపి, రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది పొగాకు బోర్డు రాష్టవ్య్రాప్తంగా 120 మిలియన్ కేజీల పొగాకు పంటను ఉత్పత్తి చేయాలని రైతులకు లక్ష్యంగా నిర్ణయించింది. బోర్డు ఇచ్చిన లక్ష్యం మేరకు రైతులు పొగాకు పంటను ఉత్పత్తి చేశారు. ఇప్పటికి వేలం కేంద్రాలు ప్రారంభమై సుమారు 104 రోజులు కావస్తుండగా పొగాకు వ్యాపారులు రాష్ట్రంలో సుమారు 84 మిలియన్ కేజీల పొగాకు పంటను కొనుగోలు చేశారు. ఇందుకు గాను రాష్టవ్య్రాప్తంగా ఒక కేజికి సగటు ధర 122 రూపాయలు ధర వచ్చింది. ఇందుకు గాను ప్రకాశం జిల్లాకు సుమారు 70 మిలియన్ కేజీల పొగాకు పంటను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా సుమారు 75 మిలియన్ కేజీల పొగాకును రైతులు ఉత్పత్తి చేశారు. జిల్లాలో పొగాకు బోర్డు ఇచ్చిన ఇండెంట్ కంటే కేవలం ఒక 5 మిలియన్ కిలోలు మాత్రమే అధనంగా రైతులు పొగాకు పంటను ఉత్పత్తి చేసినట్లు పొగాకు బోర్డు అధికారుల ద్వారా సమాచారం . ఇప్పటి వరకు జిల్లాలోని పొగాకు బోర్డు వేలం కేంద్రాలల్లో పొగాకు వ్యాపారులు సుమారు 55 మిలియన్ కేజీల పొగాకును కొనుగోలు చేయగా ఇంకా రైతుల వద్ద కేవలం 15 మిలియన్ కేజీల పొగాకు మాత్రమే నిల్వ ఉంది. ఇదే విదంగా వ్యాపారులు కొనుగోలు చేస్తే మరో 20 రోజులలో జిల్లాలోని 12 పొగాకు బోర్డు వేలం కేంద్రాలల్లో పొగాకు కొనుగోళ్ళు ముగిసే అవకాశం ఉంది . అయితే ప్రస్తుతం వ్యాపారులు పొగాకు నాణ్యత తగ్గింది అన్న పేరుతో ధరలను బాగా తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. నాణ్యత సరిగా లేదంటూ వేలం కేంద్రాలకు రైతులు తీసుకొచ్చిన 15శాతం పైగా పొగాకును తిరస్కరించి వెనక్కి పంపిస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఏడాది రైతులకు పెరిగిన అధనపు ఖర్చుల ప్రకారం ఒక కేజి పొగాకుకు 140 రూపాయలు తగ్గకుండా సగటు ధర వస్తేనే గిట్టుబాటు అవుతుందని అయితే వ్యాపారులు అందుకు అనుగుణంగా ధరలు ఇవ్వక పోవడం పట్ల రైతులు విమర్శిస్తున్నారు. వేలం కేంద్రాల ముగింపు దశలో నైనా రైతులకు మంచి ధరలు వచ్చే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. బోర్డు ఇచ్చిన లక్ష్యం కంటే అధనంగా రైతులు ఉత్పత్తి చేసిన పొగాకు అపరాధ రుసుమును బోర్డు వసూలు చేసేందుకు చర్యలు చేపట్టిందని, అయితే పొగాకు సాగుచేసిన రైతులు ఒక్కో బ్యారన్‌కు సుమారు 2 లక్షల రూపాయలు వరకు నష్టపోతున్నందున్న ఈ ఏడాది బోర్డు రైతుల నుండి ఎలాంటి అపరాధ రసుం వసూలు చేయరాదని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దుగ్గినేని గోపినాధ్ డిమాండ్ చేశారు.