ప్రకాశం

రేపు జిల్లాకు వ్యవసాయ కమిషన్ బృందం రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,జూలై 19: ఈనెల 21వతేదీన జిల్లాకు వ్యవసాయకమిషన్ బృందం వస్తున్న దృష్ట్యా వారి పర్యటనలు విజయవంతం చేయాలని జిల్లాకలెక్టర్ సుజాతశర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక సిపిఒ సమావేశ మందిరంలో వ్యవసాయ టాస్క్ఫోర్స్ కమిటీ పర్యటనపై వ్యవసాయశాఖ,దాని అనుబంధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 21న వ్యవసాయ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్ సుబ్బారావు నేతృత్వంలో కమిటీ సభ్యులు ఒంగోలులో పర్యటించి అంబేద్కర్ భవన్‌లో జరిగే సమావేశంలో రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారన్నారు. జిల్లాలో నాబార్డుద్వారా 137కోట్లరూపాయలతో గొర్రెల పెంపకం యూనిట్లు నెలకొల్పే అవకాశం ఉన్నప్పటికి బ్యాంకర్లు రుణాలు మంజూరుచేసేందుకు ముందుకు రాకపోవటం సరైంది కాదన్నారు.
అదేవిధంగా గ్రామీణ నీటి సరఫరా అధికారులతో జిల్లాకలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో ఎక్కడ నీటి ఎద్దడి లేకుండా ప్రత్యామ్నాయంగా కంటెజెన్సీ ప్రణాళికను సిద్దం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లోని 22 మండలాల్లోని 105 అవాస ప్రాంతాల్లో రోజుకు వెయ్యిట్రిప్పుల చొప్పున తాగునీటి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయటం జరుగుతుందన్నారు. జిల్లాకు త్వరలో నాగార్జునసాగర్ నీరు రానున్నాయని వాటిని ఎట్టి పరిస్థితుల్లో వృథాకాకుండా చెరువుల్లో నింపుకునేందుకు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో ఇప్పటికే మూడువేల బోరుబావులు ఎండిపోయాన్నారు. ఆయా సమావేశాల్లో వివిధ శాఖలకు చెందిన అదికారులు పాల్గొన్నారు.