ప్రకాశం

కెపి వ్యూహం ఏమిటి..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, జూలై 19 : రాజకీయ ఉద్దండుడు, మార్కాపురం నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికై రెండు పర్యాయాలు మార్కాపురం సమితి అధ్యక్షుడిగా పనిచేసిన కెపి కొండారెడ్డి రాజకీయ వ్యూహం ఏమిటో అర్థం కావడం లేదు. కాగా గత శుక్రవారం కెపికి సన్నిహితంగా ఉండే మాజీ ఎంపి, ప్రస్తుత ఎంఎల్‌సి మాగుంట శ్రీనివాసులరెడ్డి, అనంతపురం ఎంపి జెసి దివాకర్‌రెడ్డిలతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును విజయవాడలో కలిశారు. అయితే తన బంధువు సొంతపనిపై కలిసినట్లు చెప్తున్నప్పటికీ పట్టణంలో మాత్రం మరోరకంగా ఊహాగానాలు వినపడుతున్నాయి. గత ఆరునెలలుగా ఇలాంటి ఊహాగానాలే వినిపిస్తున్నప్పటికీ వాస్తవంగా మాత్రం నిజంకాలేదు. అయితే ఇటీవల జిల్లాలో వైకాపాలో పెనుమార్పులు జరగడంతో ఈయన కూడా టిడిపి తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు అనుచరుల ద్వారా తెలుస్తోంది. డివిజన్‌లో సీనియర్ నాయకుడు కావడం, మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో బలమైన అనుచరవర్గం ఉండటంతో చంద్రబాబు కూడా ఈయన రాకను స్వాగతిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈయన బంధువర్గంలో కొందరు టిడిపిలో చేరాలని ఒత్తిడి తెస్తున్నట్లు కూడా సమాచారం. గత ఎన్నికల సమయంలోనే టిడిపిలో చేరాలని భావించినప్పటికీ కొందరు అనుచరులు వైకాపా అధికారంలోకి వస్తుందని, మార్కాపురం టిక్కెట్టు లభిస్తుందని ఒత్తిడి చేయడంతో అటువైపు మొగ్గారు. ప్రస్తుతం అవేవి ఫలించకపోవడంతో టిడిపివైపు చూస్తున్నారన్న ప్రచారం జోరందుకుంది. అలాగే కెపికి వియ్యంకుడైన కంభం మాజీఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులురెడ్డి ఈయన బాటలో నడిచేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఏదిఏమైనా త్వరలో మార్కాపురం నియోజకవర్గంలో భారీమార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు.