ప్రకాశం

‘హనుమారెడ్డి అభినందనీయుడు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఆగస్టు 21: తరతరాలుగా మానవ సమాజంలో మహిళల జీవన విధానం - మనుగడ, కాలానుగుణమైన పరిణామాల గురించి ప్రామాణిక రచనలు చేసిన ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు బి హనుమారెడ్డి అభినందనీయుడని ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ ఎం కృష్ణకుమారి కొనియాడారు. ఆదివారం ప్రకాశంజిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయంలో ప్రముఖ రచయిత, న్యాయవాది బి హనుమారెడ్డి రచించిన ‘మహిళ’ గ్రంథావిష్కరణ సభ జరిగింది. ఈసభకు అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శి పెనుకొండ లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా కృష్ణకుమారి మాట్లాడుతూ న్యాయవాదవృత్తిలో అనుభవం పండిన హనుమారెడ్డి సామాజిక కుటుంబ విలువల పరిరక్షణలో మహిళలు చేసిన కృషిని మహిళ గ్రంథంలో చక్కగా విపులీకరించారన్నారు. సమాజం వేగంగా మారుతున్న నేపధ్యంలో మహిళ స్వీయవ్వకిత్వ పరిరక్షణకు ఆత్మగౌరవ నినాదంతో స్ర్తివాదాన్ని ఉద్యమంగా తెరమీదకు తెచ్చినప్పటికి ఆచరణలో అనుకున్న సత్ఫలితాలు ఇవ్వలేదన్న హనుమారెడ్డి అభిప్రాయంతో అందరు ఏకీభవించాలని కృష్ణకుమారి వివరించారు. మహిళలకు చట్టబద్దమైన రక్షణ గురించి సోదాహరణంగా వివరించిన హనుమారెడ్డి అభినందనీయుడన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మహిళ గురించి మంచి పుస్తకం రాసిన హనుమారెడ్డి న్యాయవాదిగా తమ అనుభవాన్ని ఈ పుస్తకంలోని ప్రతి పేజిలో చూపించారన్నారు. పాఠకులు పుస్తకాన్ని విమర్శనాత్మక దృష్టితో చదివి మంచిని స్వీకరించాలని పిలుపునిచ్చారు. ప్రముఖ కవి సాహితీ విమర్శకులు డి శ్రీనివాసాచార్యులు మహిళ పుస్తకావిష్కరణపై చక్కగా సమీక్షించారు. రచనలో హనుమారెడ్డి వాదపటిమ, విషయవివరణలో సమతూకం, సమన్వయ దృష్టి చదవటానికి యోగ్యమైన చక్కని భాష పాఠకులను ఆలోచింపచేస్తాయన్నారు. రచయితకు స్వేచ్ఛతోపాటు బాధ్యత ఉందని, సమాజాన్ని మెప్పించి ఒప్పించే విధంగా మహిళ అనే పుస్తకాన్ని రాసిన హనుమారెడ్డిని అభినందించారు. ప్రముఖ సాహితీ విమర్శకులు కె వెంకటేశ్వరెడ్డి పుస్తక సారాంశాన్ని వివరించగా, సభలో రచయిత బి హనుమారెడ్డి, వై కొండారెడ్డి, బి సుందరరావు, ప్రకాశం జిల్లా రచయితల సంఘం కార్యవర్గసభ్యుడు దేవపాలన, అన్ను విజయకుమారి, కెవి రమణారెడ్డి, పిన్ని వెంకటేశ్వర్లు, వివిధరంగాల ప్రముఖులు పాల్గొన్నారు. తొలుత హనుమారెడ్డి ప్రకాశం జిల్లా రచయితల సంఘం పక్షాన అతిథులను ఘనంగా సన్మానించారు.