ప్రకాశం

ప్రత్యేకహోదాపై రాష్ట్రప్రజలను మోసం చేసిన మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, సెప్టెంబర్ 19: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పదేపదే చెప్పిన దేశ ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసంచేశారని యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి మానస మల్లిక్ ధ్వజమెత్తారు. సోమవారం ఒంగోలులో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుర్రాల రాజ్‌విమల్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ప్రకాశం భవనం వద్ద అంబేద్కర్ విగ్రహానికి, జగ్జీవన్‌రాం విగ్రహాలకు పూలమాలలు వేసి పలువురు నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా జిల్లాకాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మానసమల్లిక్ మాట్లాడుతూ ఆనాటి దేశప్రధాని మన్మోహన్ సింగ్ లోక్‌సభ, రాజ్యసభల్లో ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తూ ప్రకటన చేస్తే బిజెపినేత వెంకయ్యనాయుడు వ్యంగ్యంగా మాట్లాడి తమపార్టీ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పది సంవత్సరాలపాటు ప్రత్యేక హోదాకల్పిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. బిజెపి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి మూడు సంవత్సరాలు కావస్తున్నా ప్రత్యేకహోదాపై కుంటిసాకులు చెబుతూ సిగ్గులేకుండా రాష్ట్ర రాజధాని విజయవాడలో సంబరాలు చేసుకోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2014 ఎన్నికల్లో బిజెపి ప్రచార సారధి నరేంద్రమోదీ తిరుపతి ఎన్నికల ప్రచార సభలో వెంకటేశ్వరస్వామి సాక్షిగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని వాగ్ధానాలు చేసి ప్రస్తుతం హోదా కంటే ప్రత్యేక ప్యాకేజియే మేలని చెప్పటాన్ని చూస్తుంటే రాష్ట్ర ప్రజలు ఎంతో ఆరాధ్య దైవంగా భావించే వెంకటేశ్వరస్వామి మీద దేశ ప్రధానికి, వెంకయ్యనాయుడులకు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏ మాత్రం గౌరవం ఉందో రాష్ట్రప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం నిజాయితీగా చిత్తశుద్దితో కాంగ్రెస్‌పార్టీ మాత్రమే పోరాటం చేస్తుందన్నారు. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జి రాజ్‌విమల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, బాబు వస్తే జాబు వస్తుందని హామీలు ఇచ్చారని, ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. యువజన కాంగ్రెస్ తరుపున రాష్ట్రానికి ప్రత్యేకహోదాతోపాటు నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించకపోతే రానున్న కాలంలో మరిన్ని ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. ఈ ర్యాలీలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఎ విజయ్, నియోజకవర్గాల కాంగ్రెస్‌పార్టీల ఇన్‌చార్జులు ఎద్దు శశికాంత్‌భూషణ్, వేమా శ్రీనివాసరావు, షేక్ సైదా, యాదాల రాజశేఖర్, శ్రీపతి ప్రకాశం తదితరులు పాల్గొన్నారు.