ప్రకాశం

జిల్లాలో సహజ వనరుల ఆధారంగా పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, సెప్టెంబర్ 19: జిల్లాలో సహజవనరుల ఆధారంగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు జిల్లా పరిశ్రమల శాఖ, బ్యాంకర్లు సంయుక్తంగా అవరమైన చర్యలు చేపట్టాలని జిల్లాకలెక్టర్ సుజాతశర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం స్థానిక టిటిడిసిలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఆర్థిక సహకారం అందించే నిమిత్తం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల అవగాహన సదస్సు జరిగింది. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న 137 పరిశ్రమలను స్థాపించేలా బ్యాంకర్లతో తక్షణమే సమావేశం ఏర్పాటుచేయాలని పరిశ్రమల శాఖ అధికారిని ఆదేశించారు. స్టాండప్ ఇండియా కార్యక్రమం కింద రోజువారి అందుతున్న దరఖాస్తులను పరిశీలించి ఎస్‌సి, ఎస్‌టి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు స్థాపించేందుకు అనుకూల వాతావరణం కల్పించేందుకు అధికారులు, బ్యాంకర్లు కృషిచేయాలని సూచించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనతో రెండంకెల అభివృద్ధి సాధించేలా చూడాలని తద్వారా జిల్లా ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు. ఇందుకోసం జిల్లా పరిశ్రమల కేంద్రంలో ప్రత్యేక సలహాకేంద్రం ఏర్పాటుచేయాలన్నారు. ఔత్సాహికులు బ్యాంకుల నియమనిబంధనల ప్రకారం నడుచుకోవాలన్నారు. జిల్లాలో 102 కిలోమీటర్ల మేర తీరప్రాంతంలో పలు సహజవనరులు ఉన్నాయని, వాటిని వెలికితీయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గ్రానైట్ క్వార్జ్, సముద్ర ఉత్పత్తులు, ఫుడ్ ప్రాసిసెంగ్‌కు అవసరమైన ఉత్పత్తులపై దృష్టిసారించాలని జిల్లాకలెక్టర్ ఆదేశించారు. పరిశ్రమల శాఖ జిల్లా మేనేజరు టి ఆనందకుమార్ మాట్లాడుతూ జిల్లాలోని పారిశ్రామిక వేత్తలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తక్షణమే సలహాకేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నామన్నారు. నాబార్డు ఎజిఎం జ్యోతి శ్రీనివాస్ మాట్లాడుతూ స్టాండప్ ఇండియా ద్వారా వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు సంబంధిత బ్యాంకులకు పంపుతున్నామన్నారు. ఇప్పటికే 15 దరఖాస్తులు ఈ పథకం కింద వచ్చాయన్నారు. ఈసమావేశంలో నాబార్డు కన్సల్టెన్సీ నుండి సీనియర్ బ్యాంకు అధికారులు శ్రీహరి, రామకృష్ణారావు, డిక్కి జిల్లా కో ఆర్డినేటర్ వి భక్తవత్సలం, ఎల్‌డిఎం నరసింహారావు పాల్గొన్నారు.