ప్రకాశం

ఉగ్ర ఘాతుకాన్ని తరిమికొట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, సెప్టెంబర్ 19: ఉగ్ర ఘాతుకాన్ని వెంటనే తరిమికొట్టాలని, ఉగ్రదాడిలో మృతిచెందిన వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుతూ సోమవారం రాత్రి బిజెపి ఆధ్వర్యంలో ఒంగోలులో కలెక్టరేట్ ఎదుట కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో జిల్లా బిజెపి అధ్యక్షుడు పులి వెంకటకృష్ణారెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడుతూ పాకిస్తాన్ కవ్వింపు చర్యలను తిప్పికొట్టాలని కేంద్రప్రభుత్వాన్ని కోరారు. నిద్రపోతున్న జవాన్లపై ఉగ్రవాదులు చొరబడి గ్రైనేడ్ లాంచర్ల ద్వారా దాడి జరపటం వలన 17మంది జవాన్లు వీరమరణం పొందారన్నారు. ఎబివిపి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కోర్టుసెంటరులో కార్యకర్తలు, రవీంద్రభారతి స్కూలు విద్యార్థులు ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈసందర్భంగా ఎబివిపి జిల్లా కన్వీనర్ విజయ్‌బాబు మాట్లాడుతూ ఆదివారం 5.30గంటల ప్రాంతంలో ఉరి ప్రాంతంలో ఉగ్రవాదులు చొరబడి నిద్రపోతున్న జవాన్లపై లాంచర్లతో దాడి చేసి దొంగదెబ్బతీయటం దారుణమన్నారు. ఈ చర్యలకు పాల్పడ్డవారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు సిద్ధమవుతున్న భారత సైనికులకు అన్ని సదుపాయాలు కల్పించాలని కోరారు. సైనిక సిబ్బంది తక్కువ అనిపిస్తే ఎబివిపి కార్యకర్తలు దేశవ్యాప్తంగా తరలివస్తారని, వారికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఇక మీదట ఉగ్రదాడులు జరగకుండా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని గట్టిగా భయపెట్టాలన్నారు. ఈ దాడుల్లో మృతిచెందిన జవాన్ల ఆత్మశాంతి కోసం కొద్దిసేపు వౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి నాయకులు హనుమంతు, సురేష్, శివప్రసాదు తదితరులు పాల్గొన్నారు.