ప్రకాశం

అదనపుకట్నం కోసం భార్యను కిరాతకంగా కాల్చి చంపిన భర్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గిద్దలూరు, సెప్టెంబర్ 19: అనంతపూర్ జిల్లా గుంతకల్లు సమీపంలోని మద్దికర్రెకు చెందిన బెచ్చపోగుల శాంతిప్రియ (25)ను తన భర్తే ఒంటిపై కిరోసిన్ పోసి కిరాతకంగా కాల్చి చంపిన సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న చుట్టుపక్కల ఇళ్ళలోని ప్రజలు భర్తకు దేహశుద్ధి చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంతకల్లు సమీపంలోని మద్దికర్రె గ్రామానికి చెందిన శాంతిప్రియకు కర్నూల్ జిల్లా డోన్ మండపం మల్కాపురం గ్రామానికి చెందిన చంద్రశేఖర్ అనే రైల్వేస్టేషన్ మాస్టర్‌కు 2010లో వివాహం జరిగింది. వివాహ సమయంలో శాంతిప్రియ తల్లిదండ్రులు కట్నకానుకల కింద 2లక్షల రూపాయల నగదు, 10 తులాల బంగారం ఇచ్చారు. అనంతరం వారికి కల్యాణి అనే కుమార్తె జన్మించింది. అప్పటి నుంచి చంద్రశేఖర్ అదనపు కట్నం తెమ్మంటూ భార్యను వేధింపులకు గురిచేస్తుండేవాడు. వారు గత ఏడాది క్రితం గిద్దలూరు మండలం నల్లమల అటవీ రైల్వేస్టేషన్ అయిన దిగువమెట్టకు బదిలీపై వచ్చారు. గిద్దలూరులోని పాత సత్యనారాయణ టాకీస్ రోడ్డులో రైల్వేస్టేషన్ ఎదుట ఓ ఇంటిలో నివాసం ఉంటున్నారు. కట్నం కోసం శాంతిప్రియను చంద్రశేఖర్ వేధిస్తూనే ఉన్నాడు. ఈనేపథ్యంలో వారికి మరో కుమార్తె జన్మించింది. శాంతిప్రియ తల్లిదండ్రులు లక్ష రూపాయలు ఇచ్చి చంద్రశేఖర్‌కు నచ్చచెప్పి కాపురం సజావుగా చేసుకోవాలని సూచించి శాంతిప్రియను ఇక్కడే వదిలివెళ్ళారు. కాగా, గత 15రోజులుగా భార్య శాంతిప్రియను మరికొంత డబ్బు తెమ్మంటూ చంద్రశేఖర్ వేధింపులకు గురిచేస్తూ చంపుతానని బెదిరించడంతో మద్దికర్రెలో ఉన్న తల్లిదండ్రులకు విషయం తెలిపింది. చంద్రశేఖర్ ధన దాహం తీర్చేందుకు వారు ముందుకు రాకపోవడంతో ఆక్రోశంతో చంద్రశేఖర్ ఆదివారం సుమారు 12గంటల సమయంలో శాంతిప్రియ నోటిలో గుడ్డలు కుక్కి ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించాడు. దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. గమనించిన ఇరుగు పొరుగువారు చంద్రశేఖర్‌కు దేహశుద్ధి చేశారు. అనంతరం సమాచారాన్ని పోలీసులకు తెలిపారు. సిఐ వి శ్రీరాం ఆధ్వర్యంలో ఎస్సై రాంబాబు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లి మరణించడంతో ముగ్గురు కుమార్తెలు అనాథలుగా మిగిలిపోయారు. వారి రోధనలు చూపరులను కంటతడి పెట్టించాయి. తన అల్లుడు చంద్రశేఖర్ తమ కూతురిని కిరోసిన్ పోసి హత్య చేశాడని తండ్రి చిన్నవెట్‌కల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.