ప్రకాశం

రామాయపట్నం పోర్టు సాధన పట్ల జిల్లా నేతలకు చిత్తశుద్ధి లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,సెప్టెంబర్ 25:ప్రకాశం జిల్లాకే తలమానికంగా నిలిచే రామాయపట్నం పోర్టు నిర్మాణ సాధనపై నెల్లూరు జిల్లాలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నేతలకున్న శ్రద్ధ జిల్లాలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నేతలకు ఎందుకులేదన్న విమర్శలు ఆ పార్టీ నేతల నుండే వెల్లువెత్తుతున్నాయి. రామాయపట్నం పోర్టు సాధనయాత్ర పేరుతో నెల్లూరు వైకాపా పార్లమెంటుసభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కావలి మాజీ శాసనసభ్యుడు వంటేరు వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కావలి నుండి యాత్ర బయలుదేరి రామాయపట్నం వరకు జరిగింది. ఈ యాత్రలో ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి కూడా పాల్గొన్నారు. కాని రామాయపట్నం పోర్టు నిర్మాణ సాధన పేరుతో ప్రత్యక్షపోరుకు నెల్లూరుకు చెందిన వైకాపా నేతలు ఆందోళనకు దిగితే జిల్లాకు చెందిన నేతలు ఇంతవరకు ఎందుకు ప్రత్యక్షపోరుకు దిగలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామాయపట్నం పోర్టు వస్తే జిల్లాలోని అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని ఒకపక్క వైకాపా నేతలతోపాటు, జిల్లాలోని అన్నిప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ప్రకటనకే గుప్పిస్తున్నారు. రామాయపట్నం పోర్టుసాధన కోసం ఒంగోలు నుండి రామాయపట్నం వరకు ర్యాలీలు, ఆందోళనలు, యాత్రలు చేసిన పరిస్ధితులు లేవు. కేవలం మొక్కుబడిగా జిల్లాకలెక్టరేట్‌ల వద్ద అనేక సమస్యల మద్య రామాయపట్నం పోర్టుకావాలని డిమాండ్ చేయటం తప్ప రాఫిడ్ యాక్షన్‌లోకి దిగటం లేదు. దీంతో కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు సైతం రామాయపట్నం పోర్టు నిర్మాణంపై ఎలాంటి ఉద్యమాలు లేవన్న ఉద్దేశంతో మిన్నకుండిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిపిఐ, సిపిఎం, ఇతర వామపక్షనాయకులు సైతం రామాయపట్నం సాధన కోసం భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని ప్రకటనలు గుప్పించారు, కాని భారీ ఆందోళనలుచేపట్టిన దాఖలాలు లేవు. ఇదిలా ఉండగా రామాయపట్నం సాధనకోరుతూ నెల్లూరుకు చెందిన వైకాపా నేతలు మాత్రం కదం తొక్కి అందరికి గుణపాఠంగా నిలిచారనే చెప్పవచ్చు. ఈ యాత్రలో జిల్లాకు చెందిన వైకాపా నేతలు తక్కువస్థాయిలోనే హాజరయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిఇలాఉండగా ఇటీవల జరిగిన జిల్లా తెలుగుదేశంపార్టీ సమన్వయ సమావేశం జిల్లా ఇన్‌చార్జి మంత్రి రావెలకిశోర్‌బాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలోను రామాయపట్నం పోర్టు నిర్మాణం విషయంలోను చర్చకు వచ్చింది. రామాయపట్నం పోర్టు నిర్మాణ విషయంపై మరోకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.
కాగా రామాయపట్నం పోర్టు నిర్మాణం జరిగితే జిల్లా అనేక రంగాల్లో అభివృద్ధి చెందటమే కాకుండా వేలాదిమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిగే అవకాశాలున్నాయి. ప్రధానంగా పొగాకు, పత్తి, ఆక్వా, గ్రానైట్ ఉత్పత్తులను తక్కువ ఖర్చుతో రామాయపట్నం పోర్టు నుండి ఎగుమతులు చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా జిల్లాకు నూతన పరిశ్రమలు వచ్చే అవకాశాలుంటాయి. రామాయపట్నం పోర్టు జాతీయ రహదారికి, రైలు మార్గానికి దగ్గరగా ఉంది. దీంతో సరుకుల రవాణాపరంగా కూడా పారిశ్రామికవేత్తలకు ఖర్చులు తగ్గే అవకాశాలున్నాయి. జిల్లాలోని ఉత్పత్తులతోపాటు గుంటూరు, కడప, కృష్ణ, కర్నూలు జిల్లాల పారిశ్రామికవేత్తలకు సైతం ఈపోర్టువలన ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. రామాయపట్నం పోర్టు నిర్మిస్తే పెట్రోకెమికల్ కాంప్లెక్స్ స్థాపనకు దుబాయ్ కంపెనీ సిద్ధంగా ఉందని అన్ని రాజకీయపక్షాలు పేర్కొంటున్నాయి. మొత్తంమీద రామాయపట్నం పోర్టు సాధనపై నెల్లూరు జిల్లా వైకాపా నేతలకున్న శ్రద్ధ మన జిల్లాకు చెందిన వైకాపా నేతలపై ఉన్న శ్రద్ధ ఏమేరకు ఉందో ఇట్టే అర్ధవౌతుంది. ఇప్పటికైనా రామాయపట్నం సాధన కోసం అన్ని రాజకీయపక్షాలు కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలపై పోరుబాట పట్టాల్సి ఉంది.లేని పక్షంలో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచే అవకాశాలున్నాయి.