ప్రకాశం

డెంగ్యూ లక్షణాలతో బాలిక మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతనూతలపాడు, సెప్టెంబర్ 25 : మండలంలోని మైనంపాడు బిసి కాలనీకి చెందిన రావులపల్లి లలిత డెంగ్యూ జ్వరంతో గత రాత్రి మృతి చెందింది. ఈ బాలిక స్థానిక హైస్కూల్‌లో ఏడో తరగతి చదువుతూ గత ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతుండటంతో గత రెండు రోజుల క్రితం బాలిక తల్లిదండ్రులు ఒంగోలు రిమ్స్‌కు తరలించి వైద్యం అందించారు. మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరుకు తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో బాలిక తల్లిదండ్రులు శనివారం మధ్యాహ్నం మరో హాస్పిటల్‌లో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. లలిత తల్లిదండ్రులు చెంచలరావు, రమణమ్మలు చీమకుర్తి గ్రానైట్ ఫ్యాక్టరీ కార్మికులు. మృతదేహాన్ని ఆదివారం సంతనూతలపాడు ప్రాధమిక వైద్యశాల వైద్యుడు విజయ్‌కుమార్, మైనంపాడు గ్రామాభివృద్ది కమిటీ చైర్మన్ ఆళ్ళ సుబ్బారావు, విద్యాకమిటీ చైర్మన్ పి రాము, సొసైటీ డైరెక్టర్ ఎ బ్రహ్మయ్య, కె పెద్దబ్బాయి, మాజీ సర్పంచ్ కె సుబ్బారావు లలిత కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వైద్య బిసి కాలనీలో 150 మందికి వైద్యపరీక్షలు నిర్వహించగా వారిలో ఐదుగురు జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. దీంతో సోమవారం బిసి కాలనీలో వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే తల్లిదండ్రులు రిమ్స్ వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ లలిత మృతి చెందిందని , లలిత మృతికి సంబంధించి మెడికల్ రిపోర్టులు ఇవ్వాలని తల్లిదండ్రులు కోరినప్పటికీ వైద్యులు నిరాకరించినట్లు వారు వాపోయారు. సరైన వైద్యం అందకపోవడం వల్లే లలిత మృతి చెందినట్లు వారు అవేదన వ్యక్తం చేశారు. బిసి కాలనీలో సర్వే చేసిన వైద్య సిబ్బంది ఎన్ క్రిష్ణ, కె విలోనియా, కె సీతమ్మ, సూపర్ వైజర్ పార్వతమ్మ నిర్వహించారు.