ప్రకాశం

కార్పొరేట్ విద్యాసంస్థలపై ఐక్యంగా పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్,సెప్టెంబర్ 25:రాష్ట్రంలో విద్యావ్యవస్థపై పెత్తనం చెలాయిస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై ఐక్యంగా పోరాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఎపి ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి చైతన్య హరిబాబు అన్నారు. ఆదివారం అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎంసిఎ భవన్‌లో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేట్ విద్యాసంస్థలు, ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు స్కూళ్లని లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు ఉపయోగపడే విధంగాప్రభుత్వం నిబంధనలు రూపొందించి చిన్న స్కూల్స్ ఉనికినే లేకుండా చేస్తున్నాయని విమర్శించారు. సమావేశంలో అప్సా జిల్లా అధ్యక్షుడు ఎన్ నాగభూషణం మాట్లాడుతూ ప్రైవేటుస్కూళ్లని స్థాయిలను బట్టి వర్గీకరించాలన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు లేని నిబంధనలు చిన్న, చిన్న స్కూళ్లకు పెట్టి ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పిడిఎస్‌యు రాష్ట్ర నాయకులు మల్లికార్జున్ మాట్లాడుతూ కార్పొరేట్ విద్యాసంస్థల్లో పేదవిద్యార్థులు చదవలేని పరిస్థితి ఉందని విమర్శించారు. ప్రభుత్వం కార్పొరేట్ విద్యాసంస్థలకు వత్తాసు పలుకుతుందన్నారు. వైఎస్‌ఆర్‌ఎస్‌యు అధ్యక్షుడు ఎస్ మణికంఠారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కార్పొరేట్ విద్యాసంస్థలు, ప్రైవేటు స్కూళ్ల పట్ల ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుందన్నారు. ప్రైవేటు పాఠశాలలు మూతపడితే పేద విద్యార్థులకు విద్యదూరం అవుతుందన్నారు. ప్రస్మా జిల్లా అధ్యక్షుడు కె శ్రీనివాస్ మాట్లాడుతూ తొమ్మిదవ తరగతి పరీక్ష పేపరులో ప్రైవేటు విద్యాసంస్థలో పేద విద్యార్థులకు విద్య దూరమని ప్రశ్న ఇవ్వటం అవివేకమని విమర్శించారు. ఆప్సా చేసే పోరాటాలకు మద్దతు ఇస్తామన్నారు. ఈకార్యక్రమంలో ఎఐఎస్‌ఎఫ్ జిల్లా నాయకులు కుమారి మాట్లాడుతూ కార్పొరేట్ విద్యాసంస్థలపై విద్యార్థి సంఘాలు, ప్రైవేటు విద్యాసంస్థల అసోసియేషన్లు ఐక్యంగా ఉద్యమించాలన్నారు. త్వరలో అన్ని సంఘాలతో ఐక్యకార్యచరణ రూపొందించి ఉద్యమించాలని అప్సా నాయకులు సురేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో అప్సా నాయకులు కె ప్రభాకర్‌రావు, శ్రీనివాసరెడ్డి, ఎం సుబ్బారావు, విద్యార్థి సంఘాల నాయకులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, విద్యార్థి జెఎసి నాయకులు రాయపాటి జగదీష్, నలందా ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.