ప్రకాశం

బిసి యువత విదేశీ విద్యకు నిధులు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, సెప్టెంబర్ 25: వెనుకబడిన తరగతుల విద్యార్థులు విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు రాష్ట్రప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలు విడుదల చేసిందని రాష్ట్ర టిడిపి కార్యదర్శి, రాష్ట్ర బిసి కార్పొరేషన్ డైరెక్టర్ వినుకొండ సుబ్రహ్మణ్యం అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెయ్యి మందికి ఒక్కొక్కరికి 10లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని నిర్ణయించామని, దానికితోడు బ్యాంకుల నుంచి మరో 10లక్షల రూపాయలు రుణంగా ఇప్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు. కాగా, ఇప్పటివరకు 70మంది మాత్రమే దరఖాస్తులు చేసుకున్నారని, ఇంకా ఎవరైనా ఉంటే దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. 2015-16లో బిసి రుణాల కోసం సబ్సిడీ విడుదల కాలేదనే దుష్ప్రచారం చేస్తున్నారని, 103కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. 2016-17లో సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 204 కోట్ల రూపాయలు విడుదల చేసిందన్నారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని సుబ్రహ్మణ్యం తెలిపారు. పది సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో బిసిలకు రుణాలు ఇచ్చేందుకు కేవలం 70లక్షల రూపాయలు మాత్రమే విడుదల చేసిందన్నారు. అదేవిధంగా విద్యార్థులకు కాంగ్రెస్ హయాంలో ఉన్న బకాయిలు 800కోట్ల రూపాయలు టిడిపి అధికారంలోనికి వచ్చిన తరువాత మరో 1000 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు తెలిపారు. బిసిల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతోందని, దివంగత నందమూరి తారక రామారావు బిసిల కోసమే పార్టీ పెట్టారన్నారు.
రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయడమే జగన్ లక్ష్యం
విభజన రాష్ట్రంలో చంద్రబాబునాయుడు అభివృద్ధి కోసం తహతహలాడుతుంటే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాత్రం రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకు సిద్ధం అవుతున్నారని వినుకొండ సుబ్రహ్మణ్యం అన్నారు. రాజకీయ పరిజ్ఞానం లేకనో, కుటుంబ నేపథ్యమో తెలియదు కానీ ఎంతో పవిత్రమైన శాసనసభలో వ్యవహరించిన తీరు ఆక్షేపణీయమన్నారు. శాసనసభలో నిబంధనలకు అనుగుణంగా చర్చ జరగాల్సి ఉండగా అలాంటిదేమీ ఉండదని, తాము చెప్పిందే చట్టం, తాము చేసిందే శాసనం అన్నవిధంగా వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. స్పీకర్‌పై కాగితాలు చించివేయడం, పాదరక్షలతో బల్లలు ఎక్కడం వారి నైజానికి నిదర్శనం అన్నారు. నాడు అమరావతిని రాజధాని చేయాలంటే అడ్డుకోవడం, సాగునీరు అందించేందుకు పట్టిసీమను నిర్మిస్తుంటే అడ్డుకోవడం వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ విధానాలని, ఆ విధానాలను ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరని అన్నారు. పాత్రికేయుల సమావేశంలో మార్కాపురం మార్కెట్‌యార్డు చైర్మన్ డివి కృష్ణారెడ్డి, జిల్లా టిడిపి అధికార ప్రతినిధి సిహెచ్ శ్రీనివాసరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ షెక్షావలి తదితరులు పాల్గొన్నారు.