ప్రకాశం

మృతుని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందుకూరు రూరల్, సెప్టెంబర్ 25: స్థానిక ఆర్‌టిసి బస్టాండ్‌లో వాషర్‌మెన్‌గా పనిచేస్తున్న ఎం శ్రీరామమూర్తి విధి నిర్వహణలో ఉండగా బస్సు డీకొనడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందడంతో అతని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని, నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో డిపో గేటు వద్ద ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జి శ్రీనివాసులు అధ్యక్షతన నాయకులు ఐదు డిమాండ్‌లతో కూడిన వినతిపత్రం డిపో మేనేజర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ స్పందించి నాలుగు డిమాండ్ల పరిష్కారానికి హామీ ఇచ్చారు. రామ్మూర్తి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 5లక్షల రూపాయల ఇన్సూరెన్స్, అంత్యక్రియలకు 15వేల రూపాయలు ఇస్తామని డిఎం హామీ ఇచ్చారు. దీంతో సమస్య పరిష్కారమైంది. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మజుందార్, సిపిఎం జిల్లా కార్యదర్శి పి ఆంజనేయులు, సిఐటియు రాష్ట్ర నాయకులు జాలా అంజయ్య, నాయకులు ఎం కోటయ్య, హనీఫ్, మాబు, కొండారెడ్డి, ప్రభుదాసు, జి వెంకటేశ్వర్లు, కె ఆంజనేయులు, కె సుబ్బరావమ్మ, బి వెంకట్రావు, గంగయ్య, కేశవరావు, బాబూరావు, బాలనాగయ్య, వ్యకాస నాయకులు కుమార్, వెంకటేశ్వర్లు, కె మాల్యాద్రి, బాలకోటయ్య, ఎన్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, శ్రీరామమూర్తి భాతిక కాయాన్ని పలు ప్రజాసంఘాల నాయకులు, వివధ పార్టీల నాయకులు సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.