ప్రకాశం

సమస్యలు పరిష్కారించాలని గ్రానైట్ యజమానుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,డిసెంబర్ 2:తమ సమస్యలను పరిష్కరించాలంటూ స్మాల్ స్కేల్ గ్రానైట్ ఫ్యాక్టరీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన జరిగింది. ముందుగా చీమకుర్తి మండలంలోని మర్రిచెట్లపాలెం నుండి ప్రదర్శగా యజమానులు, కార్మికులు పెద్దఎత్తున ప్రదర్శన నిర్వహించుకుంటూ ఒంగోలులోని కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఆందోళన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్మాల్‌స్కేల్ గ్రానైట్ ఫ్యాక్టరీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వై కోటేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు ప్రసాదురెడ్డి మాట్లాడుతూ తమకు క్వారీల్లో ఉత్పత్తిఅయిన రా మెటీరియల్ 50శాతం పైబడి స్థానిక కటింగ్ పాలిషింగ్ యూనిట్లకు విధిగా సరఫరా చేసే ఏర్పాట్లు చేయాలని, రాయల్టీ ఈల్డింగ్ ఒక ఘనపు మీటరకు శ్లాబులు అయితే 450 చదరపు అడుగుల టైల్స్ అయితే 550 చదరపు అడుగులుగా నిర్ణయించాలని కోరారు. నాలుగు అడుగుల వరకు చిన్న రాళ్ళ కేటగిరిగా భావించి టైల్స్ కేటగిరి కిందకు తీసుకురావాలని, ప్రతి క్వారీ వాళ్ళు వేస్ట్ డంప్స్ నుండి రామెటీరియల్ అమ్ముతున్నారని, వారు తాత్కాలిక పర్మిట్‌లు తప్పనిసరిగా ఇచ్చేటట్లు ఏర్పాట్లుచేసి రాయల్టీని తగ్గించాలన్నారు. జివో నెంబరు 37ను దుర్వినియోగం అవుతుందని దాన్ని సరళీకరించాలన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో స్థానిక పరిశ్రమలు ఉత్పత్తిచేసిన గ్రానైట్స్‌ను మాత్రమే వాడాలని, వ్యాట్ ఇన్‌పుట్ క్రాస్ వెరిఫికేషన్‌ను పూర్తిచేసి తక్షణమే రీఫండ్ చేయాలని, సి లేక హెచ్ ఫారమ్స్ వలన కలిగిన బకాయిలను ఇన్‌ఫుట్ ట్యాక్స్‌లో సరిచేసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ముందస్తు సమాచారం లేకుండా వేబిల్‌లను కాని, సి లేక హెచ్ ఫారమ్‌లను పొందే సదుపాయాలను తొలగించే పద్ధతిని విడనాడాలని, గ్రానైట్ కటింగ్ పాలిషింగ్ యూనిట్లకు ఇస్తున్నటువంటి రాయితీలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.జిల్లాలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గెలాక్సీ, స్టీల్‌గ్రే, బ్లాక్ పెరల్, బ్లాక్ ఖనిజ వనరులు వెలికితీసి గ్రానైట్ క్వారీలు 150కిపైగా ఉన్నాయని వాటిని ఆధారం చేసుకుని 1179పైగా చిన్న తరహా గ్రానైట్ కటింగ్ పాలిషింగ్ యూనిట్లను ఏర్పాటుచేసుకున్నట్లు తెలిపారు. ఈ పరిశ్రమలపై ప్రత్యక్షంగా 42వేలమంది, పరోక్షంగా 55వేలమంది కుటుంబాలకు జీవనాధారం కల్పిస్తున్నట్లు తెలిపారు. స్థానిక చిన్న తరహా గ్రానైట్ కటింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్లకు ముడిరాళ్ల లభ్యత చాలా తక్కువుగా ఉందన్నారు. ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులైన నిరుద్యోగ యువత కొత్తపరిశ్రమలను ఏర్పాటుచేసేందుకు ఆశక్తి కనబరుస్తున్నప్పటికి ప్రభుత్వపరంగా, స్థానిక క్వారీల నుండి ముడిరాళ్ల లభ్యతపై సరైనహామీ లేకపోవటం ప్రతిబంధకంగా మారిందన్నారు. అధికారులు గ్రానైట్ కటింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్లపై ఒత్తిడి అధికంగా మోపటం వలన ముడిసరుకుపై ఉన్న రాయల్టీని తమ యూనిట్లపై మోపటం వలన యూనిట్స్ నిర్వహించటం చాలా కష్టతరంగా మారిందన్నారు. దీనివలన జిల్లాలోని అధికసంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కోల్పోవటం జరుగుతుందన్నారు. జిల్లాలోని గ్రానైట్ కటింగ్ పాలిషింగ్ యూనిట్ల వలన నెలకు సుమారు 62కోట్లరూపాయలు రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో నాయకులు లగడపాటి శ్రీనివాసరావు, చలపతిరావు, వెంకటేశ్వరరెడ్డి, శంకరరెడ్డి, మస్తాన్‌రావు తదితరులు పాల్గొన్నారు.