ప్రకాశం

ప్రతి పేదవానికి సొంతంటి కల నెరవేరుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందుకూరు, డిసెంబర్ 11: రాష్ట్రంలోని ప్రతి పేదవానికి తన సొంతింటి కలను నెరవేర్చడమే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. ఆదివారం పట్టణంలోని ఎస్‌ఎస్ ట్యాంక్ సమీపంలో గృహాల నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని ఎమ్మెల్యే పోతుల రామారావు, మాజీ ఎమ్మెల్యే దివి శివరాంతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ జి మల్లికార్జున, మున్సిపల్ కమిషనర్ అన్నం వెంకటేశ్వర్లుతో కలసి స్థల వివరాలు తదితర అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో గృహాలు నిర్మిస్తే పేదలకు ఏమైనా ఇబ్బందులు కలుగుతాయా అన్న కోణంలో అధికారులు అలోచించాలన్నారు. పట్టణానికి దూరంగా కాకుండా సమీపంలో గృహాలు నిర్మించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచన అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంతం అన్ని వసతులతో అభివృద్ధి చెందుతుందని, ఇప్పటికే కోట్లాది రూపాయలతో ఎస్‌ఎస్ ట్యాంక్, పార్కు, స్విమ్మింగ్ పూల్ వంటి వసతులను కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో పేదలకు గృహాలు నిర్మిస్తే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
రాష్ట్రంలో 1.20 లక్షల గృహాల నిర్మాణం
రాష్ట్ర వ్యాప్తంగా 1.20 లక్షల గృహాలను నాణ్యతా ప్రమాణాల్లో ఎలాంటి రాజీ లేకుండా నిర్మించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే దివి శివరాం నివాసంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికలు నాటికి గృహాల నిర్మాణ పనులను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం చదరపు అడుగుకు రూ.350 నుంచి రూ.850 మాత్రమే కేటాయించిందని, తద్వారా గృహాలు నాసిరకంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చదరపు అడుగుకు రూ.1800 కేటాయించారని, అన్ని వసతులతో గృహాల నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి గృహంలో మంచినీరు, విద్యుత్, టెయిల్స్ వంటి వౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. గృహ సముదాయాల ప్రాంతంలో పాఠశాల, పార్కు, కమ్యూనిటీ హాల్ తదితర ఏర్పాట్లను చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం గృహానిర్మాణాలకు అనువైన స్థలాలను పరిశీలిస్తున్నామని, ఈ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే గృహ నిర్మాణాలకు టెండర్లు పిలుస్తామని ఆయన తెలిపారు. రానున్న 18 నెలల్లో కందుకూరులో 1437 గృహాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు పట్టణంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు ద్వారా ఆయా కాలనీలోని రోడ్లను, డ్రైనేజీలను అభివృద్ధి చేశామని, ఇతర కాలనీల్లో కూడా అభివృద్ధి కావాల్సి ఉందని, మరికొంత నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. స్పందించిన మంత్రి నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు.
గుణ్ణం కట్టను సుందరంగా
తీర్చిదిద్దాలి
పట్టణ నడిబొడ్డున గల గుణ్ణంకట్టను సుందరంగా తీర్చిదిద్దాలని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఎమ్మెల్యే పోతుల రామారావుకు సూచించారు. ఆదివారం కందుకూరుకు వచ్చిన మంత్రి నారాయణ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేతో కలిసి గుణ్ణంకట్టను పరిశీలించారు. ఈసందర్భంగా గుణ్ణంకట్టలో వ్యర్థాలను తొలగించి సుందరంగా తీర్చిదిద్దాలని, మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలని, పక్కనే గల లారీ స్టాండ్‌కు ప్రత్యామ్నాయ స్థలం చూపించి ఆ ప్రాంతాన్ని పార్కుగా అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కె ఆదెన్న, జడ్‌పిటిసి కంచర్ల శ్రీకాంత్, ఎఎంసి చైర్మెన్ తల్లపనేని వెంకటేశ్వర్లు, పట్టణ టిడిపి అధ్యక్షులు పి వెంకటేశ్వర్లు, నాయకులు కె కోటేశ్వరరావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

11మండలాల్లో పర్యటిస్తున్న ప్రత్యేకాధికారులు
మూడడుగుల ఎత్తులో ఎగసిపడుతున్న సముద్రపుఅలలు
వలలు, తెప్పలు, బోట్లను సురక్షిత ప్రాంతాలకు తరలించిన మత్స్యకారులు
తుపాన్‌ప్రభావంతో వీస్తున్న బలమైన ఈదురుగాలులు
ఆందోళనలో ఆక్వా రైతన్నలు

ఒంగోలు,డిసెంబర్ 11:బంగాళాఖాతంలో ఏర్పడిన వార్ధా తుపాన్‌ప్రభావంతో ఎలాంటి విపత్కర పరిస్థితులునైనా ఎదుర్కొనేందుకు జిల్లాయంత్రాంగం సర్వసన్నద్ధమైంది. తుపాన్ సోమవారం మధ్యాహ్నం నాటికి చెన్నైప్రాంతంలో తీరం దాటుతుందని, దీని ప్రభావం జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై కోస్తాతీరప్రాంత మండలాలైన ఉలవపాడు, నాగులుప్పలపాడు, గుడ్లూరు, ఒంగోలు, జరుగుమల్లి, వేటపాలెం, టంగుటూరు, కొత్తపట్నం, చీరాల, చినగంజాంలో ప్రత్యేకాధికారులు పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. తుపాన్ తీరం దాటే సమయంలో 80నుండి 90కిలోమీటర్ల మేర బలమైన ఈదురుగాలులు వీస్తాయని దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. కాగా తుపాన్ ప్రభావంతో సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి. సాధారణంగా ఒక అడుగు ఎత్తులో ఉండాల్సిన సముద్రపు అలలు తుపాన్ ప్రభావంతో మూడుఅడుగుల ఎత్తులో అలలు ఎగసిపడుతున్నాయి. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లలేదు. గతంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈపాటికే సురక్షిత ప్రాంతాలకు తరలివచ్చారు. అదే విధంగా మత్స్యకారులు తమ బోట్లు,తెప్పలు,వలలను సముద్రపు ఒడ్డు నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జిల్లావ్యాప్తంగా ఈపాటికే బలమైన చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తుపాన్ తీరం దాటే సమయంలో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండటంతో ఆక్వారైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ నుండి అతిభారీ వర్షాలు కురిస్తే తమ చెరువులు కట్టలు తెగిపోయే అవకాశం ఉందని దీనివలన తాము ఆర్థికంగా నష్టపోయే అవకాశాలున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోస్తాతీరప్రాంత మండలాల్లోని పోలీసులను జిల్లా ఎస్‌పి త్రివిక్రమవర్మ అప్రమత్తం చేశారు. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని ఆయన పోలీసు సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు.
ఇదిలా ఉండగా జిల్లాలోని ఎక్కువశాతంమంది ప్రజలు భారీ వర్షాలు కురవాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నారు. వర్షాలు లేకపోవటంతో వాగులు, వంకలు ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. కొన్నిగ్రామాలకు తాగునీటి సమస్య కూడా ఎక్కువుగానే ఉంది. ప్రధానంగా పొగాకు నాట్లు వేసిన రైతులకు ఈ వర్షం ఎంతగానో మేలు చేకూర్చనుంది. వరినాట్లు కూడా ముమ్మరంగా పడే అవకాశాలున్నాయి. అదే విధంగా భారీ నుండి అతిభారీ వర్షాలు కురిస్తే భూగర్భజలాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాగా తుపాన్ చైన్నై వద్ద తీరం దాటుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో ఇటు జిల్లా యంత్రాంగంతోపాటు, అటు జిల్లా ప్రజానీకం ఊపిరిపీల్చుకుంటుంది.

‘వార్ధా’ భయం

జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం
భారీ వర్షాలు
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు
జిల్లా ఇన్‌చార్జీ కలెక్టర్ హరిజవహర్‌లాల్ వెల్లడి

ఒంగోలు,డిసెంబర్ 12:వార్ధా తుపాన్ ప్రభావంవలన జిల్లాలో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎం హరిజవహర్‌లాల్ తెలిపారు. ఆదివారం స్థానిక సిపిఒ కాన్ఫరెన్స్‌హాలులో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వార్ధా తుపాన్‌కు సంబంధించి ఇప్పటివరకు 33 బులిటెన్లు విడుదలయ్యాయన్నారు. 11వతేదీ ఉదయం 8.30గంటలకు విడుదలైన బుల్‌టెన్ ప్రకారం 12వతేదీవరకు ప్రకాశం, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. సముద్రపు అలలు ఉద్ధృతంగా ఉంటాయన్నారు. భారీవర్షాలు, గాలులు వలన పూరిగుడిసెలు, పాత భవనాలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. వరి,బొప్పాయి వంటి పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందన్నారు. మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదని ఆయన హెచ్చరించారు. ప్రతి మూడుగంటలకు ఒక బులెట్‌న్ వస్తుందని, దానిని ఎప్పటికప్పుడు ముగ్గురు ఆర్‌డిఒలకు సమాచారం కోసం పంపిస్తున్నామన్నారు. జిల్లాలో 12వతేదీన 11మండలాల్లో 50మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు అయ్యే పరిస్ధితి కనిపిస్తుందన్నారు. పలుచోట్ల తీవ్రంగా వర్షం పడవచ్చునని ఏఏప్రాంతాల్లో ఏంత వర్షం కురుస్తుందో ముందే అంచనా వేశామన్నారు. ఆప్రకారం కొత్తపట్నం మండలంలో అత్యధికంగా 60మిల్లీమీటర్లు, కనిగిరిలో 40, పిసిపల్లిలో 40, కొండెపిలో 47, వెలిగండ్లలో 50, వలేటివారిపాలెంలో 40, జరుగుమల్లిలో 47, సిఎస్‌పురంలో 41, లింగసముద్రంలో 40,మర్రిపూడిలో 40, వేటపాలెంలో 47, సింగరాయకొండలో 50, పొన్నలూరులో 48, కందుకూరులో 49, బేస్తవారిపేటలో 40, టంగుటూరులో 47, గుడ్లూరులో 55, ఉలవపాడులో 50.4, ఒంగోలులో 51.4, సంతనూతలపాడులో 41.2మిల్లీమీటర్ల వర్షం కురవచ్చునని ఆయన తెలిపారు. తుపాన్ సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లాలో ఇప్పటివరకు అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ విభాగాన్ని ప్రారంభించామన్నారు. 1077 టోల్‌ఫ్రీనెంబరు, 08592- 281400 ల్యాండ్‌ఫోన్‌ను ఏర్పాటుచేశామని , ఎవరైనా సరే సమాచారం అందించవచ్చునని, వెంటనే స్పందించి సమస్య పరిష్కరిస్తామన్నారు. ఆవిభాగానికి అన్ని ప్రభుత్వ శాఖలనుండి ఒక్కొక్కరు చొప్పున అనుసంధానం చేశామన్నారు. జిల్లాకు 34మంది సభ్యులతో కూడిన జాతీయ విపత్తు సహాయక దళం వచ్చిందన్నారు. లోతట్టు ప్రాంతాలు, సముద్రతీర ప్రాంతాలు సందర్శించామని, చాటింపువేసి ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. తహాశీల్దార్లు, మండల స్ధాయి అధికారులతో తాను టెలికాన్పరెన్స్‌లు నిర్వహించి అప్రమత్తం చేశామన్నారు. తీరప్రాంతంలోని 11మండలాలేకాకుండా జిల్లాలోని మొత్తం 56మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించి తుపాన్ కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం వాటిల్లకుండా ముందస్తుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. శనివారం 120కిలోమీటర్ల వేగంతో గాలులు వీచయాయని, ఆదివారం 90కిలోమీటర్ల వేగానికి తగ్గాయన్నారు. తుపాన్ నెల్లూరు నుండి చెన్నై వైపునకు కదులుతుందని ఉత్తర తమిళనాడుకు పోతు దక్షిణకోస్తా ఆంధ్రప్రదేశ్ వైపు వస్తున్నట్లు తెలుస్తుందన్నారు. జిల్లాకు చెందిన రాష్టమ్రంత్రితో పాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రికి, తీరప్రాంత శాసనసభ్యులకు తుపాన్ సమాచారం చేరవేశామనివారి ద్వారా కూడా ప్రజలకు సమాచారం అందిస్తున్నామన్నారు. ఒక్కనీటి బిందువుకూడా వృధాకాకుండా చెరువులు,పంటకుంటలు నింపుకుని భూగర్బజలాలు పెంపునకు కృషిచేయాలని అధికారులకు సూచించామన్నారు. కోస్తాప్రాంతంలో 88షెల్టర్ గృహాలను గుర్తించామన్నారు. నీటి సదుపాయాలు, పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టామన్నారు. కావాల్సిన నిత్యావసర సరుకులు సిద్ధంగా ఉంచుకున్నామన్నారు. వెయ్యిలీటర్ల పెట్రోలు, ఐదువందల లీటర్ల డీజిల్ నిల్వ ఉంచామన్నారు. గ్యాస్ డీలర్లతో మాట్లాడి అవసరమైన గ్యాస్ సిలిండర్లు సిద్ధం చేశామన్నారు. విద్యుత్ స్తంబాలు పడిపోతే వెంటనే మార్చేందుకు మూడువేల స్తంబాలు సబ్‌స్టేషన్లల్లో సిద్ధంగా ఉంచామన్నారు. రహదారులు ఎక్కడైనా బలహీనంగా ఉంటే సిద్ధంగా ఉన్నాయమన్నారు. రహదారులు ఎక్కడైనా బలహీనంగా ఉంటే పటిష్టం చేయాలని ఆర్‌అండ్‌బి అధికారులను ఆయన ఆదేశించామన్నారు. మునిసిపాలిటీల్లో లోతట్టు ప్రాంతాల్లోని మురికికాల్వల్లో నీరు నిల్వ ఉండకుండా, చెత్తా, చెదారాలు తొలగించి, నీరుపారుదలకు అనువుగా ఉంచాలన్నారు. ఇళ్లలోకి నీరు రాకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు.
జిల్లా అదనపు ఎస్‌పి దేవదానం మాట్లాడుతూ వార్ధా తుపాన్ చాలా తీవ్రంగా ఉన్నందున పోలీసు యంత్రాంగానికి ప్రజలు పూర్తిగా సహకరించాలన్నారు. పోలీసు యంత్రాంగం రెవిన్యూ అధికారులతో కలిసి తుపాన్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉందన్నారు. పోలీసులకు రెయిన్‌కోట్లు, లైఫ్‌జాకెట్లు, టార్చ్‌లైట్లు, డ్రాగన్‌లైట్లు ఇచ్చి పంపామని, ఎక్కడైనా రవాణా అవసరమైతే వాహనాలు సిద్దంగా ఉంచామన్నారు. పోలీసు సేవాదళ్ కార్యకర్తలు 40మంది జిల్లాకు వచ్చారన్నారు. ఎక్కడ ప్రమాదం ఉందో అక్కడి ప్రజలు వెంటనే అక్కడి నుండి ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళేందుకు పోలీసు వారితో సహకరించాలన్నారు. తుపాన్ ప్రభావం తగ్గాక తిరిగి వారివారి ప్రదేశాలకువెళ్ళవచ్చుని తెలిపారు. ఈనెల 14వతేదీ వరకు మత్స్యకారులు చేపలవేటకు సముద్రంలోకి వెళ్ళవద్దని ఆయన సూచించారు. వారికి కావాల్సిన ఆహార పదార్ధాలు ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జీ డిఆర్‌ఒ భక్తవత్సలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.