ప్రకాశం

మాజీ ఎమ్మెల్యే ఇరిగినేని మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కనిగిరి, ఫిబ్రవరి 12: జిల్లా రాజకీయాల్లో ఒక ధృవ తారగా వెలుగొంది అందరి నోట పెద్దాయనగా పిలువపడే కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఇరిగినేని తిరుపతినాయుడు మృతిచెందిన విషయం తెలుసుకుని కనిగిరి ప్రాంత ప్రజానీకం శోకసంద్రంలో మునిగిపోయింది. నియోజకవర్గంలోని పామూరు మండలంలో మోపాడు సర్పంచ్‌గా కమ్యూనిస్ట్ భావాలతో ఎన్నికైన ఇరిగినేని తిరుపతినాయుడు నాటి కనిగిరి కమిటీ అధ్యక్షునిగా 1981లో అఖండ మెజారిటీతో విజయం సాధించి జిల్లా రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. కమిటీ అధ్యక్షులుగా ఉన్న ఆయన ఎన్‌టిఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో తన రాజకీయ సహచరుడు దివంగత కె నారాయణస్వామి ప్రోత్సాహంతో పార్టీలో చేరి అనంతరం తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షునిగా జిల్లా రాజకీయాలను ప్రభావితం చేశారు. నాటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని విడనాడి జె వెంగళరావు ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీలో చేరి డిసిసి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1981లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి కేవలం 1800 ఓట్లతో ఎమ్మెల్యే ఛాన్స్ మిస్ అయ్యారు. 1989లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఘన విజయం సాధించి వరుసగా 1999 నుంచి 2004 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజాదరణ పొందిన వ్యక్తిగా నియోజకవర్గ రాజకీయాల్లో రాణించారు.
పలువురు ప్రముఖుల సంతాపం
మాజీ ఎమ్మెల్యే ఇరిగినేని తిరుపతినాయుడు మృతికి మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, కేటిఆర్ టెక్నో స్కూల్ చైర్మన్ కె తిరుపతిరెడ్డి, వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్‌యాదవ్, మాజీ మంత్రి ముక్కుకాశిరెడ్డి, ఎమ్మెల్యే కదిరి బాబూరావు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. అదే విధంగా కనిగిరి తాలూకా ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో ఇరిగినేని తిరుపతినాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సిపిఐ డివిజన్ కార్యదర్శి యాసిన్, రవీంద్ర, సిపిఎం నాయకులు పి తిప్పారెడ్డి, బి వెంకటేశ్వర్లు, పిసి కేశవరావు నివాళులు అర్పించారు.